-కలెక్టర్ డిల్లీరావు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త: నాడు-నేడు రెండవ దశ పనులకు సంబంధించి మెమొరాండం ఆఫ్ అండర్‌స్టాండిరగ్ (యంఓయు) వివరాలను పాఠశాల ప్రధానోపాధ్యాయులు తక్షణమే అప్‌లోడ్ చేయాలని జిల్లా కలెక్టర్ యస్ డిల్లీరావు ఆదేశించారు. మనబడి నాడు -నేడు, జగనన్న శాశ్వత గృహ హక్కు పథకం, జగనన్న గృహా నిర్మాణ పథకం, పనుల ప్రగతిపై బుధవారం జిల్లా కలెక్టర్ డిల్లీరావు కలెక్టరేట్ నుండి వీడియోకాన్ఫరెన్స్ ద్వారా రెవెన్యూ డివిజనల్ అధికారులు, మున్సిపల్ కమీషనర్లు, స్పెషల్ అధికారులు, యంపిడివోలు, తహాశీల్థార్లు, ఇంజనీరింగ్ అసిస్టెంట్లు, విద్యా …
Read More »Latest News
సచివాలయాలు ప్రజా సమస్యల పరిష్కార నిలయాలు కావాలి…
-జిల్లా కలెక్టర్ ఎస్ డిల్లీరావు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త: సచివాలయాల ద్వారా ప్రజలకు మెరుగైన సేవలందించేందుకు సచివాలయ సిబ్బంది సమన్వయంతో పనిచేయాలని జిల్లా కలెక్టర్ ఎస్ డిల్లీరావు అన్నారు. పడమట ఖన్నా నగర్‌లోని వార్డు సచివాలయం 66,65లను బుధవారం జిల్లా కలెక్టర్ డిల్లీరావు ఆకస్మికంగా తనిఖీ చేశారు. సచివాలయంలోని రికార్డులను పరిశీలించారు. వార్డు పరిధిలో సచివాలయాల ద్వారా అందిస్తున్న సేవలను అడిగి తెలుసుకున్నారు. వివిధ సంక్షేమ పథకాల అమలు తీరును ఆరా తీస్తూ అర్హత ఉన్న ప్రతి లబ్దిదారునికి పథకాల లబ్ది చేకూర్చాలన్నారు. …
Read More »వరద బాధితులను ఆదుకోరా?
-ఇంకా జల దిగ్బంధంలో 30 ఊళ్లు -పలు గ్రామాలకు నిలిచిన రాకపోకలు -ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు డాక్టర్ సాకే శైలజనాథ్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త: వరద బాధితులను ఆదుకోవడంలో జగన్ రెడ్డి సర్కారు వైఫల్యం చెందిందని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు డాక్టర్ సాకే శైలజనాథ్ ఆరోపించారు. నష్టం అంచనా వేయడంలోనూ విఫలం అయ్యిందని, తూతూ మంత్రంగా పర్యటించి చేతులు దులుపుకున్నారని విమర్శించారు. ప్రజాప్రతినిధులు, మంత్రులు బాధితులను ఆదుకునేందుకు చర్యలు చేపట్టకుండా కాలక్షేపం చేస్తున్నారని ధ్వజమెత్తారు. తక్షణమే వరద బాధితులను ఆదుకోవాలని …
Read More »ప్రజల డైరక్షన్లో ప్రజల కోసం పని చేసే నాయకుడు పవన్ కళ్యాణ్… : పోతిన వెంకట మహేష్
-వైసీపీ నాయకులవి బ్రిటీషర్ల ఆలోచనలు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త: వైసీపీ నాయకుల్లో బ్రిటీష్ రక్తం ప్రవహిస్తోందని… వారి ఆలోచనలు, పని తీరు మొత్తం కులాల మధ్య చిచ్చు పెట్టు.. విభజించి పాలించు అనే ధోరణిలో ఉన్నాయని జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పోతిన వెంకట మహేష్ ఆరోపించారు. బ్రిటీష్ డీఎన్ఏ ఎక్కించుకున్న వైసీపీ పార్టీ కులాల మధ్య గొడవలు పెట్టి రాజకీయ లబ్ది పొందాలని చూస్తోందన్నారు. కమ్మ, కాపుల మధ్య చిచ్చుపెట్టేందుకు మంత్రి గుడివాడ అమర్నాథ్ ఇష్టారాజ్యంగా మాట్లాడుతున్నారని తెలిపారు. పెట్టుబడులు, …
Read More »మౌలిక వసతుల కల్పనకు ప్రతిపాదనలు సిద్దం చేయాలి…
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త: గుంటూరు నగరంలోని ప్రజలకు స్థానికంగా ఆహ్లాదం కల్గించే అంతర్గత పార్క్ ల్లో మౌలిక వసతుల కల్పనకు ప్రతిపాదనలు సిద్దం చేయాలని నగర కమీషనరు కీర్తి చేకూరి ఐ.ఏ.యస్. పార్క్స్ ఏ.డి.హెచ్.ని ఆదేశించారు. బుధవారం కమిషనర్ బ్రాడిపేట, అరండల్ పేట, ఇన్నర్ రింగ్ రోడ్, ఆర్.టి.సి.కాలని, షాప్ ఎంప్లాయీస్ కాలని, పాత గుంటూరు, శ్రీనివాసరావు తోట, హౌసింగ్ బోర్డ్ కాలనీల్లో ఉన్న పార్క్ లను పరిశీలించి, ఆయా పార్క్ ల్లో చేపట్టాల్సిన అభివృద్ధి పనుల పై ఇంజినీరింగ్ అధికారులకు, పార్క్స్ …
Read More »ప్రభుత్వ ప్రాధాన్యత భవనాల నిర్మాణం సత్వరమే పూర్తి కావాలి… : కలెక్టర్ రంజిత్ బాషా
మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త: ‘ప్రభుత్వ ప్రాధాన్యత భవనాల నిర్మాణం సత్వరమే పూర్తిచేయాలని కృష్ణాజిల్లా కలెక్టర్ పి. రంజిత్ బాషా అన్నారు. బుధవారం సాయంత్రం కలెక్టర్ బంగ్లా నుంచి పలు డివిజన్ల ఆర్డివోలు, అన్ని మండలాల ఎంపీడీఓలు, తహసీల్దార్లు, పంచాతిరాజ్ ఏఇ, డిఈ లతో ‘ప్రభుత్వ ప్రాధాన్యత భవనాల నిర్మాణం, కమ్యూనిటీ శానిటరీ కాంప్లెక్స్ కు సంబంధిచి కలెక్టర్ టెలి కాన్ఫెరెన్స్ నిర్వహించారు .ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గ్రామల్లో నిర్మిస్తున్న ప్రభుత్వ భవనాల పురోగతిపై మండలవారీగా సమీక్షించారు. గ్రామ సచివాలయాలు, ఆర్.బి.కె.లు, వై.ఎస్.ఆర్. …
Read More »తేదేపా వారు అసత్య ప్రచారాలు మానుకోవాలి : దేవినేని అవినాష్
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త: రాష్ట్రంలో వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎన్నికల మ్యానిఫెస్టోలో చెప్పిన విధంగా నవరత్నాలు అమలు చేస్తూ పారదర్శకంగా పరిపాలన అందిస్తుంటే, రోజురోజుకు ప్రజలలో పెరిగిపోతున్న ఆదరణ చూసి ఓర్వలేక ప్రతిపక్ష టీడీపీ పార్టీ చిల్లర రాజకీయాలు చేస్తూ అసత్యాలు ప్రచారం చేయడం సిగ్గుచేటు అని తూర్పు నియోజకవర్గ వైస్సార్సీపీ ఇన్ ఛార్జ్ దేవినేని అవినాష్ విమర్శించారు. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా బుధవారం 6వ డివిజన్, 248వ సచివాలయం …
Read More »పేదల సంతోషాన్ని ఓర్వలేని దుష్ట చతుష్టయం: ఎమ్మెల్యే మల్లాది విష్ణు
-32వ డివిజన్ 232 వ వార్డు సచివాలయ పరిధిలో గడప గడపకు మన ప్రభుత్వం విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త: రాష్ట్ర ప్రజలు సంతోషంగా ఉంటే ప్రతిపక్షాలు ఓర్వలేనితనంతో వ్యవహరిస్తున్నాయని ఎమ్మెల్యే మల్లాది విష్ణు పేర్కొన్నారు. బుధవారం 32 వ డివిజన్ 232 వ వార్డు సచివాలయ పరిధిలో కోఆప్షన్ సభ్యురాలు గుండె సుభాషిణి, డివిజన్ ఇంఛార్జి గుండె సుందర్ పాల్, పార్టీ శ్రేణులతో కలిసి గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించారు. రామలింగేశ్వర పేటలోని వీధులలో విస్తృతంగా పర్యటించి.. 210 గడపలను …
Read More »వైద్య ఖర్చులకు ఆర్థిక సహాయం అందజేత
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త: దేవినేని నెహ్రూ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా అనేక సామాజిక సేవ కార్యక్రమాలు చేపడుతున్నట్టు ట్రస్ట్ ఛైర్మన్, వైస్సార్సీపీ తూర్పు నియోజకవర్గ ఇన్ ఛార్జ్ దేవినేని అవినాష్ తెలిపారు. బుధవారం అనారోగ్యంతో బాధపడుతున్న తూర్పు నియోజకవర్గ పరిధిలోని 6వ డివిజన్ కు చెందిన నుదగల పద్మ, కారే పరమ కుమారి, దివ్యంగులు సవరపు చిన్నిప్రకాశ్ లకు వైద్య ఖర్చులు నిమిత్తం దేవినేని నెహ్రూ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా 15000 రూపాయల ఆర్థిక సహాయం అందజేశారు.ఈ సందర్భంగా అవినాష్ మాట్లాడుతూ గత …
Read More »రానున్న రోజులలో చెనేత కార్మికులకు మరింత తోడ్పాటు…
మంగళగిరి, నేటి పత్రిక ప్రజావార్త: మంగళగిరి తాడేపల్లి నగర పాలక సంస్థ కార్యాలయంలో బుధవారం జిల్లా కలెక్టర్ వేణుగోపాల్ రెడ్డి సమక్షంలో జరిగిన ప్రత్యేక సమావేశంలో చేనేత శాఖ ఉన్నతాధికారులతో ఎమ్మెల్సీ హనుమంతరావు, ఎమ్మెల్యే ఆర్కే లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆర్కే మాట్లాడుతూ మంగళగిరి రాజీవ్ గృహకల్ప వద్ద చేనేత క్లస్టర్ కు చేనేత మగ్గం షెడ్లు నిర్మాణానికి హ్యాండ్లూమ్ డిపార్ట్మెంట్ వారు 1 కోటి 10 లక్షల రూపాయలు కేటాయించడం జరిగిందని, మంగళగిరి తాడేపల్లి మున్సిపల్ కార్పొరేషన్ నుండి సుమారు …
Read More »