విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త:
దేవినేని నెహ్రూ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా అనేక సామాజిక సేవ కార్యక్రమాలు చేపడుతున్నట్టు ట్రస్ట్ ఛైర్మన్, వైస్సార్సీపీ తూర్పు నియోజకవర్గ ఇన్ ఛార్జ్ దేవినేని అవినాష్ తెలిపారు. బుధవారం అనారోగ్యంతో బాధపడుతున్న తూర్పు నియోజకవర్గ పరిధిలోని 6వ డివిజన్ కు చెందిన నుదగల పద్మ, కారే పరమ కుమారి, దివ్యంగులు సవరపు చిన్నిప్రకాశ్ లకు వైద్య ఖర్చులు నిమిత్తం దేవినేని నెహ్రూ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా 15000 రూపాయల ఆర్థిక సహాయం అందజేశారు.ఈ సందర్భంగా అవినాష్ మాట్లాడుతూ గత 10రోజులుగా ఈ డివిజన్ లో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా ఇంటింటికి పర్యటించినప్పుడు వీరి ఆర్థిక ఇబ్బందులు గురుంచి మా దృష్టికి తీసుకురాగా ట్రస్ట్ ద్వారా వారికి మందులకు అవసరమైన నగదును ఇవ్వడం జరిగింది అని అన్నారు. దేవినేని నెహ్రూ ఎప్పుడు కూడా పేదలకు అండగా ఉండేవారని, కష్టం అంటూ ఎవరు ఇంటికి వచ్చిన కులమత పార్టీలకతీతంగా వారికి అండగా నిలిచి, సమస్య పరిష్కారానికి కృషి చేశారని, నేడు ఆయన తనయుడు గా నేను కూడా అదేబాటలో నడుస్తూ దేవినేని నెహ్రూ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా విద్య, వైద్య, ఉపాధి కల్పన కోసం అనేక సేవ కార్యక్రమలు చేపట్టడం జరిగిందని వివరించారు. జగన్మోహన్ రెడ్డి పేద ప్రజల అభ్యున్నతికి ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారు అని అన్నారు. రాబోయే రోజుల్లో అందరం కలిసికట్టుగా వైస్సార్సీపీ పార్టీ బలోపేతం చేయడంతో పాటు, విస్తృతంగా సేవ కార్యక్రమలు చేపడతామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు వేగే వెంకటేశ్వర రావు ,స్థానిక డివిజన్ కార్పొరేటర్ వియ్యపు అమర్నాద్ , రాష్ట్ర తూర్పు కార్పొరేషన్ వెల్ఫేర్ డైరక్టర్ ఇజ్జాడ తేజేష్ మరియు డివిజన్ ముఖ్య నాయకులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News