మంగళగిరి, నేటి పత్రిక ప్రజావార్త:
మంగళగిరి తాడేపల్లి నగర పాలక సంస్థ కార్యాలయంలో బుధవారం జిల్లా కలెక్టర్ వేణుగోపాల్ రెడ్డి సమక్షంలో జరిగిన ప్రత్యేక సమావేశంలో చేనేత శాఖ ఉన్నతాధికారులతో ఎమ్మెల్సీ హనుమంతరావు, ఎమ్మెల్యే ఆర్కే లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆర్కే మాట్లాడుతూ మంగళగిరి రాజీవ్ గృహకల్ప వద్ద చేనేత క్లస్టర్ కు చేనేత మగ్గం షెడ్లు నిర్మాణానికి హ్యాండ్లూమ్ డిపార్ట్మెంట్ వారు 1 కోటి 10 లక్షల రూపాయలు కేటాయించడం జరిగిందని, మంగళగిరి తాడేపల్లి మున్సిపల్ కార్పొరేషన్ నుండి సుమారు 40 లక్షల రూపాయల నిధులతో కలిపి మొత్తం1.5 కోట్ల రూపాయలతో 126 వ్యక్తిగత మగ్గం షెడ్లను, 1000 అడుగుల వైశాల్యం కలిగిన కామన్ మగ్గం షెడ్లను నిర్మించినట్లు ఎమ్మెల్యే ఆర్కే అన్నారు. అతి త్వరలోనే ఈ చేనేత మగ్గం షెడ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేయనుందామని ఇందుకు ఆ ప్రదేశంలో జంగిల్ క్లియరెన్స్ చేసి గ్రావెల్ తోలి మెరక చేయాలని కార్పొరేషన్ అధికారులు సూచనలు చేశారు. ఈ 126 షెడ్ లకు మిగిలిన లబ్ధిదారుల ఎంపిక కూడా త్వరగా పూర్తి చేయాలని అధికారులను కోరారు. రానున్న కాలంలో రత్నాల చెరువు ప్రాంతంలో కూడా ఈ చేనేత మగ్గం షెడ్లు నిర్మించడానికి ప్రతిపాదనలు సిద్ధం చేయడం మరియు అధికారులతో చర్చించడం జరుగుతుందని అన్నారు.
చిన్న సన్న కారు పరిశ్రమలు మరింత అభివృద్ధి చెందాలి…
పరిశ్రమల శాఖ ఉన్నతాధికారులతో జరిగిన భేటీలో మంగళగిరి నియోజకవర్గంలో ఉన్న అన్ని చిన్న సన్నకారు పరిశ్రమలను గుర్తించాలని,రానున్న రోజుల్లో మరింత అభివృద్ధి చెందేలా కార్యచరణ రూపొందించాలని ఎమ్మెల్సీ హనుమంతరావు, ఎమ్మెల్యే ఆర్కే లు కోరారు.
Prajavartha Online Telugu News