విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ నగరంలో 14 పేటల క్రిస్టియన్ లకు ఉపయోగపడేలా 50లక్షల రూపాయల ప్రభుత్వ నిధులతో క్రైస్తవ స్మశానవాటిక ను నిర్మించడం జరిగిందని తూర్పు నియోజకవర్గ వైస్సార్సీపీ ఇన్ ఛార్జ్ దేవినేని అవినాష్ తెలిపారు. బుధవారం నియోజకవర్గ పరిధిలోని రామలింగేశ్వర నగర్ నందు జరిగిన క్రైస్తవ శ్మశాన వాటికను నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి, డిప్యూటీ మేయర్ లు బెల్లం దుర్గ, అవుతూ శైలజ రెడ్డి లతో కలిసి అవినాష్ ప్రారంభించారు. ఈ సందర్భంగా అవినాష్ మాట్లాడుతూ క్రైస్తవ …
Read More »Latest News
దక్షిణ మధ్య రైల్వేలో మొదటి గతి`శక్తి మల్టీ మోడల్ కార్గో టెర్మినల్ ప్రారంభం
-దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని నక్కనదొద్డి స్టేషన్ వద్ద మెస్సర్స్ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ మొదటి గతి-శక్తి మల్టీ మోడల్ కార్గో టెర్మినల్‌గా గుర్తింపు పొందింది విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రైల్వే కార్గో నిర్వహణలో అదనంగా టెర్మినళ్లను అభివృద్ధి చేయడంలో పరిశ్రమల నుండి పెట్టుబడులను బలోపేతం చేయాలనే లక్ష్యంతో భారతీయ రైల్వే వారిచే నూతన గతి-శక్తి మల్టీ మోడల్ కార్గో టెర్మినల్ (జిసిటి) విధానం ప్రవేశపెట్టబడిరది. సరుకులను భద్రంగా మరియు సురక్షితంగా రైళ్లలో రవాణా చేయడానికి రైల్వే శాఖ వారిచే …
Read More »కవితా సంకలనాన్ని ఆవిష్కరించిన గవర్నర్
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ గవర్నర్ మాననీయ బిశ్వభూషణ్ హరిచందన్ రాజ్ భవన్ వేదికగా మంగళవారం ప్రముఖ ఒడిశా కవి, ఒడిస్సా సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత డాక్టర్ భగవన్ జయసింగ్ “టికీ అటకిజా-ఏ, పంత్ (కొంచెం వేచి ఉండండి, ఓ ట్రావెలర్) పేరిట రచించిన 8వ ఒడియా కవితల సంకలనం పుస్తకాన్ని ఆవిష్కరించారు. జీవన గమనంలో ఓ ప్రయాణికుడిగా మృత్యువును ఆలింగనం చేసుకునే క్షణాన, దుఃఖాలు, వేదనలతో నిండిన సమకాలీన వాస్తవికతలో భాగంగా గత జ్ఞాపకాలను పునశ్చరణ చేసే కథానాయకుడి …
Read More »కృత్రిమ కొరత సృష్టించి మార్కెట్లో అధిక ధరలకు అమ్మితే కేసులు నమోదు…
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : నిత్యవసర వస్తువులు, వంట నూనెలను అనధికార నిల్వ చేసి, కృత్రిమ కొరత సృష్టించి మార్కెట్లో అధిక ధరలకు అమ్మితే కేసులు నమోదు చేయడం జరుగుతుందని రీజినల్ విజిలెన్స్ అండ్ ఎన్ ఫోర్స్ మెంట్ అధికారి టి.కనకరాజు హెచ్చరించారు. నందిగామ, ఏ.కొండూరు, తిరువూరు,విజయవాడ నగరంలోని పలు దుకాణాల్లో మంగళవారం పౌరసరఫరాలు, తూనికలు కొలతలు, విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు టి.కనకరాజు ఆధ్వర్యంలో సంయుక్తంగా ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ముఖ్యంగా వంట నూనెలను నిర్దేశించిన ఎమ్మార్పీ ధరలకే విక్రయించాలని దుకాణాల …
Read More »సబ్ కలెక్టర్ కార్యాలయ ప్రాంగణంలో భవనాల నిర్మాణ పనులను పరిశీలించిన జిల్లా కలెక్టర్ జె.నివాస్…
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : నూతనంగా ఏర్పాటు కానున్న ఎన్టీఆర్ జిల్లా విజయవాడకు కలెక్టర్ కార్యాలయం, అనుబంధం వీడియోకాన్ఫరెన్స్ హాల్, మీనీమీటింగ్ హాల్, జిల్లా రెవెన్యూ అధికారి కార్యాలయం, జాయింట్ కలెక్టర్ల కార్యాలయాల నిర్మాణాలకు జరుగుతున్న పనులను మంగళవారం జిల్లా కలెక్టర్ జె.నివాస్ పరిశీలించారు. ప్రస్తుతం సబ్ కలెక్టర్ కార్యాలయ భవనాలలో అందుబాటులో ఉన్న వివిధ గదులలో నూతన కలెక్టర్ కార్యాలయానికి అనువుగా మార్పులు చేసేందుకు చేపడుతున్న నిర్మాణ పనులను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. త్వరితగతిన పనులను పూర్తి చేసి …
Read More »వంట నూనెలను వినియోగదారులకు అందుబాటు ధరలలో లభించేలా రైతుబజార్లలో ప్రత్యేక కౌంటర్లు…
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : వంట నూనెలను వినియోగదారులకు అందుబాటు ధరలలో లభించేలా రైతుబజార్లలో ప్రత్యేక కౌంటర్లను ఏర్పాటు చేసినట్లు జిల్లా జాయింట్ కలెక్టర్ డా.కె మాధవీలత అన్నారు. బహిరంగ మార్కెట్లలో వంట నూనెలు అధిక ధరలో విక్రయిస్తున్నారని వినియోగదార్ల నుంచి పిర్యాదులు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో జిల్లా యంత్రాంగం వంట నూనెల ధరలను నియంత్రించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంది. దీనిలో భాగంగా జిల్లాలోని 42 రైతుబజార్లలో ప్రత్యేక కౌంటర్లలో వంట నూనెలను సరసమైన ధరలకు విక్రయిస్తునట్లు జాయింట్ కలెక్టర్ అన్నారు. నగరంలోని …
Read More »టిడ్కో గృహా లబ్ధిదారులకు రుణాల మంజూరు లక్ష్యాలను త్వరితగతిన పూర్తి చేయాలి…
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : టిడ్కో గృహా లబ్ధిదారులకు రుణాల మంజూరు లక్ష్యాలను త్వరితగతిన పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ జె.నివాస్ అధికారులను ఆదేశించారు. మంగళవారం కంచికచర్ల మండలం పరిటాలలో ఘన వ్యర్థాల నిర్వహణ కేంద్రం ( ఎస్‌డబ్ల్యుయంసి), గ్రామ సచివాలయ ఆకస్మిక తనిఖీ అనంతరం తిరుగు ప్రయాణంలో జిల్లా కలెక్టర్ జె నివాస్ టెలికాన్ఫరెన్స్ ద్వారా టిడ్కో లబ్ధిదారులకు బ్యాంకుల ద్వారా రుణాల మంజూరుపై విజయవాడ, మచిలీపట్నం నగర పాలక సంస్థ, గుడివాడ, ఉయ్యూరు, నూజివీడు, తిరువూరు, నందిగామ, జగ్గయ్యపేట మున్సిపల్ …
Read More »ఎంపీటీసీ సభ్యులకు రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల పథకాలు పై అవగాహన
కొవ్వూరు, నేటి పత్రిక ప్రజావార్త : మన మండలం/గ్రామ అభివృద్ధి కోసం లక్ష్యం నిర్దేశించుని ఎంపిటిసి లు సమన్వయం తో పని చెయ్యాలని మాస్టర్ ట్రైనర్(MoT) చాగల్లు- ఎంపీడీఓ పి., బి.రాంప్రసాద్ పేర్కొన్నారు. కొవ్వూరు నియోజకవర్గ పరిధిలోని 3 మండలాల ఎంపీటీసీ సభ్యులకు రెండవ రోజు శిక్షణ తరగతులు నిర్వహించారు. ఈ సందర్భంగా రాం ప్రసాద్ మాట్లాడుతూ, రాజ్యాంగ కల్పించిన హక్కులు ద్వారా మండల, గ్రామ అభివృద్ధి లో ప్రతి ఒక్కరూ వారి విలువైన సూచనలు, సలహాలు అందించాల్సి ఉందన్నారు. లక్ష్యం నిర్దేశించుకుంటే కొన్ని …
Read More »తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హజ్ కమిటి ఆత్మీయ అభినందన సభ
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో మైనారిటీలను ఆర్ధికంగా, సామాజికంగా అభివృద్ధి సాధించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం అనేక సంక్షేమ అభివృద్ధి పధకాలను అమలు చేస్తున్నదని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ అంజాద్ బాషా అన్నారు. విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో మంగళవారం నిర్వహించిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హజ్ కమిటి ఆత్మీయ అభినందన సభలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అంజాద్ బాషా ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం అంజాద్ బాషా మాట్లాడుతూ మైనార్టీల కోసం సబ్ ప్లాన్ ను రూపొందించిన …
Read More »నాటకరంగ రూపు రేఖల్ని మార్చిన సుందరం
తెనాలి, నేటి పత్రిక ప్రజావార్త : తెలుగు నాటకరం రూపురేఖలనుతనదైన శైలిలో మార్చినాడని ప్రఖ్యాత సినీ రచయిత బుర్ర సాయి మాథవ్ అన్నారు. ప్రఖ్యాత రంస్థల నటుడు రచయిత దర్శకుడు ప్రయోక్త తల్లావఝుల సుందరం అకాల మరణానికి మంగళవారం సాయంకాలం జరిపిన సంతాప సభుకుహాజరై భేషజాలు లేకుండా సింపుల్ గ్ నాటకాన్ని రక్తి కట్టిస్తాడని కేవలం 2 పాత్రలతో ప్రదర్శితమైన “సూదిలో ఏనుగు”(తను అలపాటి లక్ష్శి )ప్రేక్షకులు మరువరని, తన ముక్కుసూటి తనం పనిలో నబథ్థత తో సినిమారంగంలో నిలదొక్కుకోలేక తనకు లభించవలసిన గౌరవం …
Read More »