Breaking News

Daily Archives: April 5, 2024

శుక్రవారం నాటికి 94 శాతం ఫించన్లు పంపిణీ పూర్తయింది : శశి భూషణ్ కుమార్

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో శుక్రవారం నాటికి సామాజిక భద్రతా ఫించన్ల పంపిణీ ప్రక్రియ 94 శాతం పూర్తయిందని అనగా 1847 కోట్ల 52 లక్షల రూ.లను ఫించన్లు దారులకు పంపిణీ చేయడం జరిగిందని రాష్ట్ర పంచాయతీరాజ్ మరియు గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి శశి భూషణ్ కుమార్ తెలియ జేశారు.రాష్ట్రంలో 65.69 లక్షల మంది ఫించను దారులకు ఫించన్లు అందించేందుకు 1951 కోట్ల 69 లక్షల రూ.లను విడుదల చేయగా ఈనెల 3వ తేదీ నుండి 6వ తేదీ వరకు …

Read More »

ఎన్నికల ఫిర్యాదులను సా.4-5 గంటల మధ్య నేరుగా అందజేయవచ్చు…

-రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ప్రతిరోజు సాయంత్రం 4-5 గంటల మధ్య ఎన్నికలకు సంబంధించిన ఫిర్యాదులను, విజ్ఞాపనలను తమకు నేరుగా అందజేయవచ్చని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా ఒక ప్రకటనలో తెలిపారు. రాజకీయ పార్టీలు, సంఘాలు లేదా ఏ వ్యక్తి అయినా ఎన్నికలకు సంబంధించిన విషయాలపై ఫిర్యాదులు/ విజ్ఞాపనలు సమర్పించాలనుకుంటే, పై తెలిపిన నిర్ణీత సమయాల్లో రాష్ట్ర సచివాలయంలో తమను నేరుగా కలిసి అందజేయవచ్చు అన్నారు. కార్యాలయ పని …

Read More »

చిన్నారి మృతి పై విచారణ చేపట్టి సమగ్ర నివేదిక కోరిన రాష్ట్ర బాలల హక్కుల కమిషన్

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : పల్నాడు జిల్లా కారంపూడి మండలం పేటసన్నేగండ్ల గ్రామానికి చెందిన 18 నెలల చిన్నారి అనుమానాస్పదంగా మృతి చెందిన సంఘటన వెలుగులోకి వచ్చిన నేపథ్యంలో పూర్తి స్థాయిలో దర్యాప్తు చేసి విచారణ చేపట్టి సమగ్ర నివేదికను సమర్పించ వలసిందిగా ఆంద్ర ప్రదేశ్ రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ చైర్మన్ కేసలి అప్పారావు మరియు సభ్యురాలు బత్తుల పద్మావతి జిల్లా అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా అప్పారావు మరియు పద్మావతి మాట్లాడుతూ రాష్ట్రంలో చిన్నారులు పై …

Read More »

ఈవిఎం లను భద్రపరచు స్ట్రాంగ్ రూం, కౌంటింగ్ కేంద్రాల సన్నద్ధత ఏర్పాట్ల పరిశీలన

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : సార్వత్రిక ఎన్నికలు 2024 షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో పోలింగ్ అయిన ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్లను భద్రపరిచేందుకు తిరుపతి జిల్లా కేంద్రంలో ఈవిఎం స్ట్రాంగ్ రూం, కౌంటింగ్ కేంద్రాల సన్నద్ధతపై ఎస్వీ జూనియర్ కాలేజి, శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయంలోని ఇంజినీరింగ్ భవనాలలో ఏర్పాట్లను డిఆర్ఓ పెంచల కిషోర్ తో కలిసి కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి ప్రవీణ్ కుమార్ పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఎస్వీ జూనియర్ కాలేజి నందు సూళ్లూరుపేట, గూడూరు, వెంకటగిరి …

Read More »

యువ ఓటర్ల చైతన్యం కోసం షార్ట్ ఫిలిం పోటీలు

-కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి ప్రవీణ్ కుమార్ తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలో యువ ఓటర్లను చైతన్యం చేసేందుకు స్వీప్ కార్యక్రమాలలో భాగంగా షార్ట్ ఫిలిం పోటీలు నిర్వహిస్తున్నట్లు తిరుపతి జిల్లా కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి ప్రవీణ్ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. వీడియో నిడివి గరిష్టంగా 100 సెకండ్లు మించరాదని, ఓటు విలువ తెలియచేసేలా, నిజాయితీగా ఓటువేయడంపై మరియు జిల్లాలో ఓటు టర్న్ ఔట్ శాతం పెరిగేందుకు సూచనలతో వీడియోను రూపొందించాలని తెలియజేసారు. ఈ పోటీలో …

Read More »

ఏప్రిల్ 1 నాటికి 18 ఏళ్లు నిండిన‌వారంతా ఈ నెల 14 లోగా ఓటరుగా నమోదు కొరకు ధ‌ర‌ఖాస్తు చేయాలి…

-క‌లెక్ట‌ర్‌ మరియు జిల్లా ఎన్నికల అధికారి ప్రవీణ్ కుమార్ తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : ఈ ఏప్రిల్ 1 నాటికి 18 ఏళ్లు నిండిన‌వారంతా ఈ నెల 14 లోగా ఓటరుగా నమోదు కొరకు ధ‌ర‌ఖాస్తు చేసుకోవాలని క‌లెక్ట‌ర్‌ మరియు జిల్లా ఎన్నికల అధికారి ప్రవీణ్ కుమార్ శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ సార్వత్రిక ఎన్నికల్లో పార్ల‌మెంటుతో పాటు అసెంబ్లీ ఎన్నిక‌లు కూడా కలిపి జరుగుతున్నాయని, ఇప్ప‌టికే ఎన్నిక‌ల షెడ్యూల్ ప్ర‌క‌టించ‌గా, మ‌రికొద్ది రోజుల్లో నోటిపికేష‌న్ వెలువ‌డి నామినేష‌న్ల ప‌ర్వం ప్రారంభం …

Read More »

అవగాహన కలిగి ఎన్నికల కమిషన్ సూచించిన మార్గదర్శకాల మేరకు అప్రమత్తంగా నిర్వర్తించాలి…

-ఎన్నికల సమర్థవంత నిర్వహణకు పక్కా ప్రణాళిక, శిక్షణ, ఎన్నికల మార్గదర్శకాల అమలు మూల సూత్రాలు: కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి ప్రవీణ్ కుమార్ తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : సాధారణ ఎన్నికలు 2024 నిర్వహణకు సంబంధించి నోడల్ అధికారులు, ఈఆర్ఓ, సహాయ రిటర్నింగ్ అధికారులు వారి విధుల పట్ల పూర్తి అవగాహన కలిగి ఉండాలని, ఎన్నికల కమిషన్ సూచించిన మార్గదర్శకాలపై అవగాహన కలిగి కార్యా చరణ ప్రణాళికలతో టైం లైన్ నిర్దేశించుకునీ తదనుగుణంగా ఎప్పటికప్పుడు అప్రమత్తంగా విధులు నిర్వర్తించాలని అప్పుడే ఎన్నికలు …

Read More »

బాబూ జగ్జీవన్ రామ్ జయంతి సందర్భంగా ఘనంగా నివాళులు అర్పించిన కలెక్టర్ ప్రవీణ్ కుమార్

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : అణగారిన వర్గాల ఆశా జ్యోతి స్వర్గీయ బాబూ జగ్జీవన్ రామ్  జయంతి పురస్కరించుకుని నేడు శుక్రవారం  సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో స్థానిక తిరుపతి జగ్జీవన్ పార్క్ లోని బాబూ జగ్జీవన్ రామ్  విగ్రహానికి తిరుపతి జిల్లా కలెక్టర్ ప్రవీణ్ కుమార్ పూలమాలలు సమర్పించి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో తిరుపతి ఆర్డీఓ నిషాంత్ రెడ్డి, జిల్లా సాంఘిక సంక్షేమ మరియు సాధికార అధికారి చెన్నయ్య, జిల్లా బిసి సంక్షేమ మరియు సాధికార అధికారి భాస్కర్ …

Read More »

తిరుపతి జిల్లా కలెక్టర్ గా బాధ్యతలు చేపట్టిన ప్రవీణ్ కుమార్

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : నేటి గురువారం రాత్రి ప్రవీణ్ కుమార్ ఐఎఎస్ తిరుపతి జిల్లా నూతన కలెక్టర్ గా బాధ్యతలు స్వీకరించారు. ముందుగా నూతన కలెక్టర్ కి డిఆర్ఓ పెంచల కిషోర్, ఇతర అధికారులు స్వాగతం పలికి పుష్ప గుచ్చాలు అందచేసి శుభాకాంక్షలు తెలిపారు.

Read More »

విజయవాడ ప్రెస్ క్లబ్ లో ఇఫ్తార్ విందు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ముస్లిం సోదర సోదరీమణులకు పర్వదినమైన రంజాన్ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ విజయవాడ యూనిట్, ప్రెస్ క్లబ్ సంయుక్త ఆధ్వర్యంలో శుక్రవారం ప్రెస్ క్లబ్ లో ఇఫ్తార్ విందు నిర్వహించారు. జనాబ్ అల్తాఫ్ రజా హాజరై నమాజ్ నిర్వహించారు. ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టుల వారి వృత్తిలో దినదినాభివృద్ధి చెందాలని ఆశీర్వదించారు. జర్నలిస్టులు అధిక సంఖ్యలో ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. సత్యనారాయణపురం పోలీస్ స్టేషన్ సిఐ వెంకట్ నారాయణ గవర్న పేట సిఐ డి …

Read More »