Breaking News

Monthly Archives: October 2024

శ్రీబాలాత్రిపుర సుందరీదేవి అలంకరణలో ఉన్న కనకదుర్గమ్మని దర్శించుకున్న హోంమంత్రి అనిత

-ఆంధ్రప్రదేశ్ ప్రజలు చంద్రన్న పాలనలో చల్లగా ఉండాలి : హోంమంత్రి అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : దసరా శరన్నవరాత్రి మహోత్సవాలలో భాగంగా తొలిరోజున శ్రీబాలాత్రిపుర సుందరీదేవి అలంకరణలో కొలువై ఉన్న విజయవాడ కనకదుర్గమ్మ అమ్మవారిని హోం శాఖ మంత్రి వంగలపూడి అనిత దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో హోంమంత్రికి స్వాగతం పలికారు. అంతరాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి, అమ్మవారి దర్శనాంతరం వేద పండితులు హోం మంత్రి అనితకు ఆశీర్వచనాన్ని అందజేశారు. ఈవో ఛైర్మన్ అమ్మవారి చిత్రపటం, ప్రసాదం, శేషవస్త్రాలను ఆమెకు …

Read More »

AIIMS మంగళగిరి నందు కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్సలు విజయవంతంగా ప్రారంభించబడినది, 03 ప్రత్యక్ష సంబంధిత కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్సలు పూర్తయ్యాయి!

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్(ఎయిమ్స్), మంగళగిరి మరో మైలురాయిని సాధించింది. 30.08.2024న విజయవంతంగా మొదటి కిడ్నీ మార్పిడి చేసిన నెల వ్యవధిలోనే మరొక 02 కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్సలను పూర్తి చేసినట్లు సగర్వంగా ప్రకటించింది. మొదటి కిడ్నీ మార్పిడిని 2024 ఆగస్టు 30న విజయవాడకు చెందిన 29 ఏళ్ల మద్దెల.శ్రీరామ్,వృత్తి రీత్యా మెడికల్ రిప్రజెంటేటివ్‌గా ఉన్న వ్యక్తికి నిర్వహించారు. అతను తన తల్లి శ్రీమతి మద్దెల శ్యామలా దేవి (46 సంవత్సరాల) నుండి ఒక …

Read More »

రాష్ట్రంలో ఆహార భ‌ద్ర‌తా ప్ర‌మాణాల చ‌ట్టాన్ని ప‌టిష్టంగా అమ‌లు చేయాలి

-గ‌త ప్ర‌భుత్వ నిర్ల‌క్ష్యంపై మంత్రి స‌త్య‌కుమార్ యాద‌వ్ ఆందోళ‌న‌ -గ‌త రెండు ఆర్థిక సంవ‌త్స‌రాల్లో ఆహార భ‌ద్ర‌త కోసం కేంద్రం అందించిన రూ.65 కోట్లు నిరుప‌యోగం -కేంద్రం సంస్థ‌తో ఒప్పందం ద్వారా ఆహార భ‌ద్ర‌తా వ్య‌వ‌స్థ‌ను ప‌టిష్టం చేయాల‌ని మంత్రి ఆదేశం అమ‌రావ‌తి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో ఆహార భ‌ద్రతా ప్ర‌మాణాల్ని ప‌టిష్టంగా అమ‌లు చేసేలా త‌గు చ‌ర్య‌లు తీసుకోవాల‌ని వైద్య, ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖా మంత్రి స‌త్య‌కుమార్ యాద‌వ్ మంత్రిత్వ శాఖ ఉన్న‌తాధికారుల్ని ఆదేశించారు. ఆహార భ‌ద్ర‌త విష‌యంపై …

Read More »

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ సహాయ మంత్రి మురుగన్

తిరుమల, నేటి పత్రిక ప్రజావార్త : నేటి గురువారం ఉదయం కుటుంబ సమేతంగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్న కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ సహాయ మంత్రి డా.ఎల్. మురుగన్.

Read More »

తిరుపతి లోని గవర్నమెంట్ ఐటిఐ నందు జాబ్ మేళా

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ, ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్, సీడ్ఆఫ్ మరియు డి ఆర్ డి ఎ సంయుక్త ఆధ్వర్యంలో తిరుపతి లోని గవర్నమెంట్ ఐటిఐ ( Govt ITI,Padmavati Puram, Tirupati) నందు 04-10- 2024 అనగా ఈ శుక్రవారం నాడు ఉదయం 9 గంటల నుంచి జాబ్ మేళా నిర్వహించబడును. జాబ్ మేళా నిర్వహించే ప్రదేశం:Govt ITI, Padmavati Puram, Tirupati,Tirupati Dist. ఈ జాబ్ మేళాలో బహుళ జాతీయ కంపెనీలైన ముత్తూట్ గ్రూప్, బిగ్ …

Read More »

దసరా శరన్నవరాత్రి మహోత్సవాల ఏర్పాట్లను స్వయంగా పర్యవేక్షించిన నగర పోలీస్ కమీషనర్, జిల్లా కలెక్టర్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : నగరంలో అంగరంగ వైభవముగా ప్రారంభమైన శ్రీ దుర్గామళ్లేశ్వర స్వామి వార్ల దసరా శరన్నవరాత్రి మహోత్సవాలలో బాగంగా మొదటి రోజు అయిన గురువారం పోలీస్ కమిషనర్ ఎస్.వి.రాజ శేఖర బాబు ఐ.పి.ఎస్.కుటుంబ సమేతంగా అమ్మవారిని దర్శించుకున్నారు. అనంతరం టెంపుల్ పరిసర ప్రాంతాలలో ఎటువంటి అవాంచనీయ సంఘటనలు జరుగకుండా ఏర్పాటు చేసిన భద్రతా ఏర్పాట్లను పోలీస్ కమీషనర్ ఇతర అధికారులతో కలిసి నడుచుకుంటూ పర్యవేక్షించడం జరిగింది. ఈ క్రమంలో నగర పోలీస్ కమిషనర్ మరియు జిల్లా కలెక్టర్  ఇతర అధికారులతో …

Read More »

విద్యుత్ రంగంలో ఏపీని దేశంలోనే అగ్రగామిగా నిలుపుతాం

-ఏపీలో పెట్టుబడి పెట్టే పారిశ్రామికవేత్తలకు వెన్నుదన్నుగా నిలుస్తాం -విద్యుత్ పెట్టుబడిదారుల సమీక్ష సమావేశంలో మంత్రి గొట్టిపాటి ప్రకటన అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : విద్యుత్ రంగంలో ఆంధ్రప్రదేశ్ ను దేశంలోనే నెంబర్ వన్ స్టేట్ గా నిలిపేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో చర్యలు తీసుకుంటున్నట్లు విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవి కుమార్ తెలిపారు. బుధవారం సచివాలయంలో విద్యుత్ రంగానికి సంబంధించిన ప్రైవేటే విద్యుత్ ఉత్పత్తి సంస్థల అధిపతులతో మంత్రి గొట్టిపాటి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి …

Read More »

బందరు పోర్టు ప్రారంభించుటకు ప్రభుత్వం అన్ని చర్యలు

మచిలీపట్నం,  నేటి పత్రిక ప్రజావార్త : 2025 డిసెంబర్ నాటికి పనులు పూర్తి చేసి బందరు పోర్టు ప్రారంభించుటకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు రాష్ట్ర గనులు, భూగర్భవనరులు, అబ్కారీ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. మంత్రి గురువారం తమ నివాసంలో పాత్రికేయుల సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడుతూ బుధవారం రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మచిలీపట్నంలో పర్యటించి స్వచ్ఛతాహి సేవ కార్యక్రమాన్ని ప్రారంభించడం, డంపింగ్ యార్డ్ సందర్శించి అక్కడ పరిస్థితిని పరిశీలించడం, అదేవిధంగా బందరు పోర్టు ఆకస్మికంగా సందర్శించి పనులు …

Read More »

నగర సుందరీకరణకు పక్కాగా ఏర్పాట్లు చేయాలి…

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : నగర సుందరీకరణకు పక్కాగా ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ మున్సిపల్ కమిషనర్ సంబంధిత అధికారులను ఆదేశించారు. గురువారం ఉదయం జిల్లా కలెక్టర్ నగరంలోని వారి ఛాంబర్లో మునిసిపల్ అధికారులు, ముడా అధికారులతో కలిసి మచిలీపట్నం అభివృద్ధి పనులపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ముడా పరిధిలోని పోర్టు డంప్యార్డు లేఔట్లు ఉన్న రేఖా చిత్రపటాన్ని ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రహదారి డివైడర్ లపై వివిధ కళాకృతులతో …

Read More »

జిల్లాలో క్రీడల అభివృద్ధికి కృషి చేయాలి…

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలో క్రీడల అభివృద్ధికి కృషి చేయాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లో గురువారం జిల్లా స్థాయి క్రీడల అభివృద్ధి కమిటీ సమావేశం జిల్లా కలెక్టర్ అధ్యక్షతన జరిగింది. జిల్లాలోని గ్రామపంచాయతీలు మున్సిపాలిటీల ద్వారా మూడు శాతం స్పోర్ట్స్ సెస్ వసూళ్లపై సమీక్షించారు. ఈ సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ అథారిటీని ఆర్థికంగా పటిష్టం చేసేందుకు జిల్లాలోని గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీలు నగరపాలక సంస్థల నుండి జీవో నెంబర్ 84 ద్వారా 3 …

Read More »