మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : పరిశుభ్రత ప్రతీ ఒక్కరి జీవన విధానంలో భాగం కావాలని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు పిలుపునిచ్చారు. స్థానిక ఏ జె. కళాశాల ఆవరణలో ‘స్వచ్ఛతా హి సేవా’ కార్యక్రమంలో ఏర్పాటు చేసిన పారిశుధ్య కార్యక్రమంలో అధికారులు, పారిశుద్ధ్య కార్మికులతో కలిసి ముఖ్యమంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మాట్లాడుతూ మహాత్మా గాంధీ కలలుగన్న గ్రామ స్వరాజ్యం గ్రామాల అభివృద్ధి ద్వారానే సాధ్యమన్నారు. ఆరోగ్యమే మహాభాగ్యం అని మన పరిసరాలు పరిశుభ్రంగా ఉన్నప్పుడే రోగాలు, అంటువ్యాధులు మన …
Read More »Monthly Archives: October 2024
ముఖ్యమంత్రికి మంత్రులు, అధికారులు, ప్రజాప్రతినిధులు ఘన స్వాగతం
మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు బుధవారం ఉదయం 11 గంటలకు మచిలీపట్టణం చేరుకున్నారు. కృష్ణా జిల్లా పర్యటనలో భాగంగా గుంటూరు జిల్లా తాడేపల్లి నుండి హెలికాప్టర్ లో మచిలీపట్టణం ఏ .జె. కళాశాల ఆవరణలో ఏర్పాటుచేసిన హెలిపాడ్ కు చేరుకున్న ముఖ్యమంత్రి కి రాష్ట్ర మంత్రులు పొంగూరు నారాయణ, కొలుసు పార్థసారథి, కొల్లు రవీంద్ర, ఎంపీ వల్లభనేని బాలసౌరి , ఎమ్మెల్సీ కంచుమర్తి అనురాధ, ఎమ్మెల్యే లు వెనిగళ్ళ రాము, కాగిత కృష్ణ ప్రసాద్ , వర్ల …
Read More »జాతిపిత మహాత్మా గాంధీ ఆలోచన విధానాలు అందరికీ అనుసరణీయం
మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : జాతిపిత మహాత్మా గాంధీ ఆలోచన విధానాలు అందరికీ అనుసరణీయం ఆదర్శనీయమని రాష్ట్ర గనులు భూగర్భ వనరులు ఆప్కారి శాఖ మంత్రివర్యులు కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా బుధవారం నగరంలోని నోబుల్ కళాశాలలో ఏర్పాటుచేసిన వ్యర్థాలతో 800 కళా ప్రదర్శనలను మంత్రివర్యులు జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ తో కలిసి సందర్శించారు. కళాకృతులు చాలా బాగున్నాయని మంత్రి కలెక్టరు విద్యార్థులను అభినందించారు. అనంతరం ఏర్పాటు చేసిన బహుమతి ప్రధానోత్సవ కార్యక్రమంలో మంత్రివర్యులు మాట్లాడుతూ మహాత్మా …
Read More »ఇన్వైట్ యువర్ కమిషనర్ విజేత ఇంటికి వెళ్లి బహుమతి ఇచ్చిన
-విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర, బుధవారం ఉదయం “ఇన్వైట్ యువర్ కమిషనర్” కార్యక్రమం విజేత, భారతి నగర్ రెండవ లైన్ లో ఉన్న ధవలేశ్వరపు నాగలక్ష్మి ఇంటి వద్దకు వెళ్లి, స్వచ్ఛతాహి సేవా కార్యక్రమంలో భాగంగా వారు నిర్వహించిన టెర్రస్ గార్డెన్ వీక్షించి వారికి పదివేల రూపాయల చెక్కును బహుకరించారు. ఈ సందర్భంగా విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర మాట్లాడుతూ విష రసాయన రహిత ఆహారం పండించుకొని …
Read More »ప్రపంచానికే దిశ నిర్దేశించే సామర్థ్యం విజయవాడకు ఉంది – డాక్టర్ జి సృజన, ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్
-జాతిపిత మహాత్మా గాంధీ ఆదర్శాలను అనుసరిద్దాం- గద్దె రామ్మోహన్రావు తూర్పు నియోజకవర్గం శాసనసభ్యులు -ప్రజలకు 15 రోజులుగా నిరంతరాయంగా విస్తృతంగా అవగాహన కల్పించిన స్వచ్ఛత ఈ సేవా కార్యక్రమం – ధ్యానచంద్ర, విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ప్రపంచానికే దిశ నిర్దేశించే సామర్థ్యం విజయవాడకు ఉందని స్వచ్ఛతాహి సేవా కార్యక్రమాల్లో వినూత్నమైన కార్యక్రమాలు చేపట్టి ప్రపంచానికి చాటి చెప్పాలని అన్నారు ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి సృజన. విజయవాడ నగర పాలక సంస్థ ఆధ్వర్యంలో జరిగిన …
Read More »దసరా ఉత్సవాల సందర్భంగా అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించిన నగర పోలీస్ కమీషనర్ ఎస్.వి.రాజ శేఖర బాబు, దంపతులు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ నగరంలో ఇంద్రకీలాద్రిపై వేంచేసి ఉన్న శ్రీదుర్గామల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానంలో ది.03.10.2024వ తేదీ నుండి 12.10.2024వ తేదీ వరకు ప్రతిష్టాత్మకంగా జరిగే దసరా శరన్నవరాత్రి ఉత్సవాల వేడుకలను పురష్కరించుకుని పోలీస్ వారి ఆడపడుచు అయిన అమ్మవారికి అనాదిగా వస్తున్న అనవాయితీ ప్రకారం సాంప్రదాయం నేపథ్యంలో నగర పోలీస్ కమీషనర్ ఎస్.వి.రాజ శేఖర బాబు ఐ.పి.ఎస్., సతీ సమేతంగా బుధవారం అమ్మవారికి చీరా, సారెను సమర్పించడం జరిగింది. ఈ సందర్భంగా ముందుగా పోలీస్ కమీషనర్ దంపతులు వన్ …
Read More »బాపూజీ చూపిన మార్గం నేటితరానికి అనుసరణీయం: మల్లాది విష్ణు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : దేశానికి స్వాతంత్ర్యం సాధించి పెట్టిన గాంధీ మహాత్ముడు చూపిన మార్గం నేటితరానికి అనుసరణీయమని వైసీపీ సెంట్రల్ నియోజకవర్గ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. జాతిపిత మహాత్మగాంధీ, భారత మాజీ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రిల జయంతిని పురస్కరించుకుని ఆంధ్రప్రభ కాలనీలోని జనహిత సదనములో ఆ మహనీయుల చిత్రపటాలకు బుధవారం పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. అనంతరం మల్లాది విష్ణు మాట్లాడుతూ.. సత్యం, అహింసలను ఆయుధాలుగా చేసుకుని, శాంతియుతంగా పోరాటం చేసి దేశానికి గాంధీ మహాత్ముడు …
Read More »కూటమి ప్రభుత్వంలో ఏం కొనలేం.. తినలేమంటున్న నిరుపేదలు
-నిత్యావసరాల ధరల పెంపుతో సామాన్యుడి నడ్డి విరుస్తున్న చంద్రబాబు సర్కార్: మల్లాది విష్ణు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం నిత్యావసరాల ధరలను విపరీతంగా పెంచి పేదల నడ్డివిరుస్తోందని వైసీపీ సెంట్రల్ నియోజకవర్గ సమన్వయకర్త మల్లాది విష్ణు విమర్శించారు. గడిచిన 4 నెలలలో నిత్యావసరాలు మొదలుకొని ఆహారధాన్యాలు, అన్ని రకాల వస్తుసేవల ధరలు ఆకాశాన్నంటి సామాన్యులకు చుక్కలు చూపిస్తున్నాయని మండిపడ్డారు. అవసరమైన పప్పు, బియ్యం, నూనె, ఉల్లి ధరలు కూడా అమాంతం పెరిగిపోయాయని.. ధరల పెరుగుదలతో సామాన్య, మధ్యతరగతి ప్రజల …
Read More »మ్యాక్సీవిజన్ ఆధ్వర్యంలో ఉచిత కంటి పరీక్ష
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : మ్యాక్సీవిజన్ ఐ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ విజయవాడ వారి ఆధ్వర్యంలో ఏపీ హెచ్ ఎంఎల్ జొన్నలగడ్డ ఆదినారాయణ పద్మజల కుమారులు, కుమార్తెలు అజిత్ సింగ్ నగర్ లోని వాంబే కాలనీ లో గల పెద్ద మసీదు నందు ఉచిత కంటి పరీక్ష నిర్వహించి కళ్ళజోళ్ళు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మ్యాక్సీవిజన్ నుంచి క్యాంప్ కోఆర్డినేటర్ అలివేలు మునేశ్వర రావు, కౌన్సిలర్ రాజేశ్వరి, ఆప్తమాల జిస్ట్ అహ్మద్ పాషా తదితరులు పాల్గొన్నారు.
Read More »స్వాతంత్య్రం కంటే స్వఛ్చత కే మహాత్మ గాందీజీ అత్యధిక ప్రాధాన్యత ఇచ్చారు…
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : దేశంలో పరిశుభ్రత పాటించటం వలనే ఆరోగ్యవంతమైన సమాజానికి పునాది వేయవచ్చని స్వాతంత్య్రం కంటే స్వఛ్చత కే మహాత్మ గాందీజీ అత్యధిక ప్రాధాన్యత ఇచ్చారని కేంద్ర గ్రామీణాభివృద్ది మరియు కమ్యూనికేషన్ శాఖ సహాయ మంత్రి డా. పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. బుధవారం శ్రీవెంకటేశ్వరవిజ్ఞాన మందిరంలో జరిగిన స్వఛ్చత హీ సేవా ముంగిపు కార్యక్రమంలో కేంద్ర గ్రామీణాభివృద్ది మరియు కమ్యూనికేషన్ శాఖ సహాయ మంత్రి డా. పెమ్మసాని చంద్రశేఖర్, జిల్లా కలెక్టర్ ఎస్ నాగలక్ష్మీ, నగరపాలక సంస్థ కమిషనర్ పులి …
Read More »
Prajavartha Online Telugu News