Breaking News

Monthly Archives: December 2024

ఈ నెల 14 న సాగునీటి సంఘాలకు ఎన్నికల నిర్వహణ…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఎన్.టి.ఆర్. జిల్లా యందు 1978 ప్రాదేశిక నియోజకవర్గాలకు, మరియు 242 సాగునీటి సంఘాలకు ఎన్నికల నిర్వహణ కు ఈ నెల 11 వ తేదీన ప్రకటన జారీ చేయబడింది. తదనుగుణంగా ఈ నెల14వ తేది ఉదయం 8.00 గంటలకు ప్రాదేశిక నియోజకవర్గాల సభ్యులకు మరియు మధ్యాహ్నం 3.00 గంటల నుండి సాగునీటి సంఘాల అధ్యక్ష మరియు ఉపాధ్యక్ష ఎన్నికల ప్రక్రియ ప్రారంభమవుతుంది. పోలీస్ బందోబస్తు కూడా ఏర్పాటు చేయబడింది. ఎన్నికలు ప్రశాంతంగా జరుగుటకు జిల్లా కలెక్టర్ మరియు …

Read More »

ఆహుతులను అలరించిన సాంస్కృతిక కార్యక్రమాలు

-రాష్ట్రంలోని విభిన్న సంస్కృతులను ప్రతిబంబించేలా ప్రదర్శనలు -కళాకారుల ప్రదర్శనలతో పులకించిన విజయవాడ -చిన్నారుల నృత్యాలతో తన్మయం చెందిన వీక్షకులు -ఆకట్టుకున్న ప్రదర్శనలు -కడుపుబ్బ నవ్వించిన స్కిట్స్, మిమిక్రీ ప్రదర్శనలు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : స్వర్ణాంధ్ర 2047 విజన్‌ డాక్యుమెంట్‌ ఆవిష్కరణ మహోత్సవాన్ని పురష్కరించుకుని రాష్ట్ర ప్రభుత్వ భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో విజయవాడ నడిబొడ్డున ఉన్న ఇందిరాగాంధీ మునిసిపల్ స్టేడియం ఆవరణలో ఏర్పాటు చేసిన స్వర్ణాంధ్ర 2047 విజన్ శుక్రవారం అంగరంగవైభవంగా జరిగింది. రాష్ట్రంలోని నలుమూలల నుంచి వేల సంఖ్యలో ప్రజలు …

Read More »

వికసిత భారత్ లో ఏపీ మొదటి స్థానంలో నిలవాలి…. : ఉపముఖ్యమంత్రి కె. పవన్ కళ్యాణ్

-రాష్ట్ర అభివృద్ధిలో అందరి సహకారం అవసరం -వ్యవస్థల బలోపేతంతో ప్రజలకు మేలు జరుగుతుంది -భవిష్యత్ ను అంచనా వేయడంలో సీఎం చంద్రబాబు దూరదృష్టి అద్భుతం -గత ప్రభుత్వం చేసిన దుబారా ఖర్చులతో ప్రజా ఖజానా విచ్ఛిన్నం -ప్రజలు అన్నీ గమనిస్తారు… సరైన సమయంలో సరైన తీర్పు ఇస్తారు -శక్తి, సంపద, సమగ్రాభివృద్ధి రాష్ట్రంగా తీర్చిదిద్దడమే ఏకైక లక్ష్యం -స్వర్ణ ఆంధ్ర @ 2047 విజన్ డాక్యుమెంట్ సీఎం మార్క్ -ఉప ముఖ్యమంత్రి కె. పవన్ కళ్యాణ్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : స్వర్ణ …

Read More »

రాష్ట్రం దిశ దశ మార్చేందుకే.. ‘స్వర్ణాంధ్ర-2047’

-తెలుగు జాతిని అగ్రపథాన నిలపడమే ఏకైక ల‌క్ష్యం -రాష్ట్ర జాతీయ ఉత్పత్తి 2.4 ట్రిలియన్ డాలర్లు.., -త‌ల‌స‌రి ఆదాయం 42 వేల డాల‌ర్లు.. 2047 నాటికి లక్ష్యాలు -అగ్రిటెక్ విధానాల‌తో రైతుల‌కు న్యాయం చేస్తాం -పరిశ్రమలు ఎక్కడొచ్చినా భాగస్వాములుగా స్థానిక రైతులు -క్లీన్ ఎన‌ర్జీ హ‌బ్‌గా ఏపీని తీర్చిదిద్దాలని సంక‌ల్పం -విజ‌న్ డాక్యుమెంట్‌తో పాటు 20 కొత్త పాల‌సీలు -అధికారం-అభివృద్ధి వికేంద్రీక‌ర‌ణ‌పై ప్రత్యేక దృష్టి -175 నియోజ‌క‌వ‌ర్గాల్లో 175 పారిశ్రామిక పార్కులు -రేప‌టి నుంచి ఆంధ్రా వ్యాలీ ఓ స‌క్సెస్ స్టోరీ అవుతుంది -సంక‌ల్ప …

Read More »

ఆల్ ది బెస్ట్‌.. ప‌రీక్ష‌లంటే భ‌య‌మొద్దు..

-ఆత్మ‌స్థైర్యం..విజ‌యానికి చిహ్నం -స్వ‌ర్ణాంధ్ర @ 2047 ఆవిష్క‌ర‌ణ‌లో నున్న హైస్కూల్ -విద్యార్థుల‌తో ముఖ్య‌మంత్రి, ఉప ముఖ్య‌మంత్రి మాటామంతి విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఏమ్మా బాగున్నారా.. ఏం చ‌దువుతున్నారు.. ఎక్క‌డ నుంచి వ‌చ్చారు.. అంటూ విజ‌య‌వాడ రూర‌ల్ మండ‌లం నున్నలోని జిల్లా ప‌రిష‌త్ ఉన్న‌త పాఠ‌శాల విద్యార్థుల‌తో ముఖ్య‌మంత్రివ‌ర్యులు నారా చంద్ర‌బాబు నాయుడు, ఉప ముఖ్య‌మంత్రివ‌ర్యులు కొణిద‌ల ప‌వ‌న్ క‌ళ్యాణ్ ముచ్చ‌టించారు. విజ‌య‌వాడ‌లోని ఇందిరాగాంధీ మున్సిప‌ల్ కార్పొరేష‌న్ స్టేడియంలో స్వ‌ర్ణాంధ్ర‌@2047 విజ‌న్ డాక్యుమెంట్ విడుద‌ల కార్య‌క్ర‌మంలో భాగంగా శుక్ర‌వారం స్టేడియం ఆవ‌ర‌ణ‌లో ప్ర‌త్యేకంగా …

Read More »

శాంతియుత నిరసనపై ప్రభుత్వం ఉక్కుపాదం మోపడం హేయం

-వైసీపీ సెంట్రల్ నియోజకవర్గ సమన్వయకర్త మల్లాది విష్ణు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ‘అన్నదాతకు అండగా వైఎస్సార్ సీపీ’ కార్యక్రమంలో భాగంగా రైతులతో కలిసి కలెక్టరేట్ కు బయలుదేరిన వైసీపీ సెంట్రల్ నియోజకవర్గ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణుని శుక్రవారం పోలీసులు ఇంటివద్దనే అడ్డుకున్నారు. దీంతో లబ్బీపేటలోని తన నివాసం వద్దనే రైతులతో కలిసి రెండు గంటల పాటు ఆయన శాంతియుత నిరసన తెలియజేశారు. రైతాంగాన్ని ఈ ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకోవాలంటూ నినాదాలు చేశారు. ప్రజాసమస్యలపై పోరాడుతున్న వారిని ఈ …

Read More »

తిరువూరు శ్రీ వాహిని కళాశాలలో ఫిట్ ఇండియా బ్లాక్ లెవల్ క్రీడా పోటీలు

తిరువూరు, నేటి పత్రిక ప్రజావార్త : కేంద్ర యువజన వ్యవహారాలు మరియు క్రీడా మంత్రిత్వ శాఖ నెహ్రూ యువ కేంద్రం ఎన్టీఆర్ జిల్లా మరియు శ్రీ వాహిని ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ సంయుక్త ఆధ్వర్యంలో బ్లాక్ లెవెల్ క్రీడా పోటీలు జరిగాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రవేశపెట్టిన ఫిట్ ఇండియా మూవ్మెంట్ ఆగస్టు-29, 2019 ప్రకారం దేశంలోని యువత అంతా ఆరోగ్యపరమైన మరియు కండరపుష్టిని కలిగి ఉండాలని శారీరక శ్రమ క్రీడలు ఆడడం ద్వారా ఆరోగ్యం కల్పించుకోవాలని ఈ ఫిట్ ఇండియా …

Read More »

స్వర్ణ ఆంధ్ర విజన్-2047 డాక్యుమెంట్‌ను అభినందించిన ఏపీ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ఫెడరేషన్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు విజయవాడలో ఆవిష్కరించిన స్వర్ణ ఆంధ్ర విజన్-2047 డాక్యుమెంట్‌ను ఆంధ్రప్రదేశ్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ఫెడరేషన్ (ఏపీ ఛాంబర్స్) అభినందించింది. స్వర్ణ ఆంధ్ర విజన్-2047లోని 10 మార్గదర్శక సూత్రాలైన పేదరిక నిర్మూలన, ఉపాధి కల్పన, నైపుణ్యం మరియు మానవ వనరుల అభివృద్ధి, నీటి భద్రత, అగ్రి-టెక్, ప్రొడక్ట్ పర్ఫెక్షన్, డీప్ టెక్, కాస్ట్ ఆప్టిమైజేషన్ ఆఫ్ ఎనర్జీ మరియు ఫ్యూయల్, క్లీన్ ఆంధ్ర ‘ సంపన్నమైన, ఆరోగ్యవంతమైన …

Read More »

రెండో రోజూ కలెక్టర్ల సదస్సులో తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి

రాజమహేంద్రవరం (అమరావతీ), నేటి పత్రిక ప్రజావార్త : ఆక్వా ఉత్పత్తుల సాగు పద్ధతులు, వినియోగం, మార్కెటింగ్, ల్యాండ్ కన్వర్షన్ తదితర అంశాలపై, నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం, యువతకు ఆయా విభాగాల్లో నైపుణ్యం కల్పించేందుకు చర్యలు తీసుకోవడం పై దృష్టి కేంద్రీకరించాలని జిల్లా కలెక్టర్ పి . ప్రశాంతి కలెక్టర్ల కాన్ఫరెన్స్ లో వివరించారు. గురువారం వెలగపూడి లో రాష్ట్ర ముఖ్యమంత్రి అధ్యక్షతన నిర్వహించిన రెండు రోజుల పాటు నిర్వహిస్తున్న జిల్లా కలెక్టర్ల సదస్సులో తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి రెండో రోజూ …

Read More »

జిల్లాలో భారీ వర్షాల నేపథ్యంలో డిసెంబర్ 13వ తేది జిల్లా లోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థలకు, జూనియర్ కళాశాలలు, అంగన్వాడి కేంద్రాలకు సెలవు

-జిల్లా ఇంఛార్జి కలెక్టర్ శుభం బన్సల్ తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలో భారీ వర్షాల నేపథ్యంలో డిసెంబర్ 13వ తేది శుక్రవారం తిరుపతి జిల్లా లోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థలకు, జూనియర్ కళాశాలకు, అంగన్వాడీ కేంద్రాలకు సెలవు ప్రకటిస్తున్నట్లు ఇంఛార్జి జిల్లా కలెక్టర్ శుభం బన్సల్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. బంగాళా ఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలు, విపత్తు నిర్వహణ శాఖ హెచ్చరికల మేరకు ముందస్తు చర్యల్లో భాగంగా తిరుపతి జిల్లా పరిధిలోని …

Read More »