-ఫుడ్ ప్రాసెసింగ్ రంగాన్ని మరింత బలోపేతం చేస్తున్నాం.. రాష్ట్ర మంత్రి టీ.జీ భరత్ – హెల్ప్ లైన్ నంబర్ లాంచ్ చేసిన మంత్రి టీ.జీ భరత్ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో ఫుడ్ ప్రాసెసింగ్ రంగాన్ని మరింత బలోపేతం చేసేందుకు కృషి చేస్తున్నామని రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి టీ.జీ భరత్ తెలిపారు. మంగళగిరిలోని ఏపీఐఐసీ కార్యాలయంలో ఆహార పరిశ్రమల ప్రోత్సాహక సౌలభ్య వన్-స్టాప్ హెల్ప్‌లైన్ – 04045901100 ను మంత్రి టీజీ భరత్ లాంచ్ చేశారు. …
Read More »Daily Archives: January 3, 2025
8న ప్రధానమంత్రి నరేంద్ర మోడి విశాఖపట్నం పర్యటనకు విస్తృత ఏర్పాట్లు : సిఎస్
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఈనెల 8వ తేదీన ప్రధాన మంత్రి నరేంద్ర మోడి విశాఖపట్నం పర్యటన విజయవంతానికి విస్తృతమైన ఏర్పాట్లు చేయడం జరుగుతుందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ పేర్కొన్నారు.ప్రధాని పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లపై శుక్రవారం రాష్ట్ర సచివాలయం నుండి ఆయన వీడియో సమావేశం ద్వారా సంబంధిత శాఖల అధికారులతో సమీక్షించారు.ఈసందర్భంగా సిఎస్ మాట్లాడుతూ ప్రధాని పర్యటనను విజయవంతం చేసేందుకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలని సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. ఏర్పాట్లకు సంబంధించి తీసుకోవాల్సిన చర్యలపై ఇప్పటికే సాధారణ పరిపాలన శాఖ …
Read More »త్యాగధనుల పోరాట స్ఫూర్తిని మరువకూడదు
-నైతిక విలువలతో యువత ముందుకు సాగాలి -రాష్ట్ర న్యాయ మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ పిలుపు -ముస్లిం స్వాతంత్ర సమరయోధుల చిత్రాలతో క్యాలెండర్ ఆవిష్కరణ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : దేశం కోసం ప్రాణ త్యాగం చేసిన ఎందరో మహనీయులు, త్యాగధనుల పోరాట స్ఫూర్తిని ప్రతి భారతీయుడు మరువరాదని రాష్ట్ర న్యాయ మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ అన్నారు.మైనారిటీ హక్కుల పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో ప్రముఖ చరిత్రకారులు సయ్యద్ నసీర్ అహ్మద్ సహకారంతో ముస్లిం స్వాతంత్ర సమరయోధుల …
Read More »పర్యాటక అభివృద్ధిలో తొలి అడుగు
-తాటిపూడి రిజర్వాయరులో సాహస జలక్రీడలు ప్రారంభం -పూర్తిస్థాయి భద్రత ప్రమాణాలతో బోటింగ్ కు ఏర్పాట్లు -పిపిపి విధానంలో పర్యాటక అభివృద్ధికి చర్యలు : మంత్రి కొండపల్లి శ్రీనివాస్ -రిజర్వాయరు నిర్మాణంలో గొర్రిపాటి బుచ్చి అప్పారావు విశేషకృషి విజయనగరం(తాటిపూడి), నేటి పత్రిక ప్రజావార్త : జిల్లా పర్యాటక అభివృద్ధిలో తొలి అడుగు పడిందని రాష్ట్ర సెర్ప్, చిన్నపరిశ్రమలు, ఎన్.ఆర్.ఐ. వ్యవహారాల మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు. గంట్యాడ మండలంలోని తాటిపూడి రిజర్వాయరులో పర్యాటక అభివృద్ధిలో భాగంగా సాహస జలక్రీడలను(Adventure Water Sports) మంత్రి శుక్రవారం ప్రారంభించారు. …
Read More »జనవరి 23వ తేదీన కురుబ మహాసభ…
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : కురబ మహాసభ జనవరి 23వ తేదీన చిత్తూరు జిల్లా మదనపల్లి ఫంక్షన్ హాల్ లో నిర్వహిస్తున్నామని కురుబ రాష్ట్ర అధ్యక్షులు జబ్బలి శ్రీనివాసులు తెలిపారు. స్థానిక గాంధీనగర్ ప్రెస్క్లబ్లో శుక్రవారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కురుబ కులస్తులు దేశవ్యాప్తంగా 12 కోట్ల మంది ఉన్నారని రాష్ట్రంలో 20 లక్షలు ఉన్నారని, ఆయన తెలిపారు. చిత్తూరు జిల్లా మదనపల్లిలో మేము నిర్వహించే భారీ మహాసభ 10,000 మందితో నిర్వహిస్తున్నామని దానికి కేంద్రం నుండి, రాష్ట్రంలో అన్నిరాజకీయ …
Read More »రెవెన్యూ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలి
-RoFR పట్టాలు సాగు చేసుకుంటున్న రైతుల ఇబ్బందులకు చెక్ పెట్టాలి -అన్ సర్వే ల్యాండ్స్ కు కొత్త నెంబర్లు కేటాయించాలి -మండలాల వారీగా రీ సర్వే చేపట్టాలి -సన్న, చిన్నకారు రైతు భూ సమస్యలను పరిష్కరించాలి -దేవాదాయ భూముల వివరాలు క్రమబద్ధీకరించాలి -కొలుసు పార్థసారధి, రాష్ట్ర సమాచార, పౌర సంబంధాలు, గృహ నిర్మాణ శాఖామాత్యులు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : అటవీ భూములకు RoFR పట్టాలు ఇచ్చినా అటవీ శాఖాధికారులు సాగు రైతులను ఇబ్బందులకు గురి చేస్తున్న సంఘటనలు వెల్లువెత్తుతున్నాయి, వాటిపై ప్రభుత్వం …
Read More »ఖరీఫ్ 2025 నుండి కొత్తగా అమలుకానున్న డిజిటల్ లైసెన్సు విధానం
-యస్..డిల్లీ రావు ఐ.ఏ.ఎస్., వ్యవసాయ సంచాలకులు, ఆంధ్రప్రదేశ్. -ముఖ్యమంత్రి ఆదేశాలతో డిజిటల్ లైసెన్సు విధానం లో కృతిమ మేధ, డీప్ టెక్ సాంకేతిక వినియోగం -వ్యవసాయ వనరుల క్రయ విక్రయ లైసెన్సు విధానం మరింత సులభతరం. -ముగిసిన టెండర్ల ప్రక్రియ -పారదర్శకతకు పూర్తి అవకాశం విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : మంగళగిరి వ్యవసాయ సంచాలకులు కార్యాలయం లో శుక్రవారం యస్ .డిల్లీరావు విలేకరులతో మాట్లాడుతూ ఏప్రిల్ మాసం నుండి ప్రారంభంఅయ్యే ఖరీఫ్ సీజన్ నుండి వ్యవసాయ వనరులైన విత్తనాలు, ఎరువులు మరియు పురుగుమందుల …
Read More »ఈనెల 6,7,8, తేదిలలో రాష్ట్ర స్థాయి POLY TECHFEST 2024-25
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ లోని వివిధ పాలిటెక్నిక్ డిప్లొమా విద్యార్థులు సాంకేతిక ప్రాజెక్టుల ద్వారా వినూత్నమైన మరియు సాంకేతిక నైపుణ్యాలను ప్రదర్శించే సాంకేతిక ప్రదర్శన “POLY TECHFEST 2024-25” స్టేట్ మీట్ ను జనవరి 6, 7 & 8 తేదిలలో మూడు రోజుల పాటు S.S. కన్వెన్షన్ హాల్, లబ్బీపేట, విజయవాడలో నిర్వహించనున్నట్లు సాంకేతిక విద్యా శాఖ సంచాలకులు శ్రీ. G. గణేష్ కుమార్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలియజేసారు. ఈ కార్యక్రమాన్ని ‘మేక్ ఇన్ ఇండియా’కు మద్దతుగా …
Read More »బుడమేరు వరదలు పునరావృతం కాకుండా పట్టిష్ట చర్యలు
-గత ప్రభుత్వ నిర్లక్ష్యంతో నగర ప్రజలు నష్టపోయారు -బుడమేరు పునర్నిర్మాణానికి అధికారులతో కలసి ప్రణాళికలు సిద్ధం -గత ప్రభుత్వం బుడమేరుకు రూపాయి కూడా ఖర్చు చేయలేదు -రాష్ట్ర మంత్రులు పి. నారాయణ, నిమ్మల రామానాయుడు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : బుడమేరు వరద నియంత్రణ పై విజయవాడ ఇరిగేషన్ క్యాంప్ ఆఫీస్ లో జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు, మున్సిపల్ వ్యవహారాల శాఖ మంత్రి పి. నారాయణ, లు ఉన్నతాధికారులతో శుక్రవారం సమీక్ష చేశారు. ఈ సమీక్షా సమావేశానికి ఇరిగేషన్ స్పెషల్ …
Read More »నేషనల్ గేమ్స్ కి ఏపీ బాక్సర్లు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఈనెల 28 నుంచి ఫిబ్రవరి 14వ తేదీ వరకు ఉత్తరాఖండ్లో నిర్వహించనున్న నేషనల్ గేమ్స్ కి రాష్ట్రం తరఫునుంచి ఇద్దరు క్రీడాకారులు ఎంపికైనట్లు ఆంధ్ర ప్రదేశ్ బాక్సింగ్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి లక్ష్మణ్ దేవ్ తెలిపారు. బాక్సింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా విడుదల చేసిన జాబితాలో హెవీ వెయిట్ విభాగంలో(86-92కేజీ ) శివ గణేష్ రెడ్డి( ప్రకాశం జిల్లా), హెవీ వెయిట్ విభాగంలో (92-92+ కేజీ) హేమంత్ కుమార్ రత్నం( శ్రీకాకుళం) లు ఎంపికైనట్లు చెప్పారు. సీనియర్ …
Read More »