Breaking News

Daily Archives: January 3, 2025

గుంటూరు నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో 3 రోజుల పాటు సంక్రాంతి సంబరాలు…

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో 13, 14, 15 తేదీల్లో అంగరంగ వైభవంగా, తెలుగు సంప్రదాయాలను నేటి తరానికి తెలియచేసేలా నగర ప్రజలు, ప్రజా ప్రతినిధులు, వివిధ సంస్థల సహకారంతో నిర్వహిస్తామని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్ అన్నారు. శుక్రవారం గుంటూరు పశ్చిమ ఎంఎల్ఏ గల్లా మాధవి తో కలిసి బృందావన్ గార్డెన్స్ లోని ఎన్టీఆర్ మున్సిపల్ స్టేడియంలో సంక్రాంతి సంబరాల ఏర్పాట్లపై ప్రత్యేక సమావేశం జరిగింది. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ ఎన్టీఆర్ మున్సిపల్ …

Read More »

చేతివృత్తిదారులకు నైపుణ్య శిక్షణ… కమిషనర్ పులి శ్రీనివాసులు 

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : నగరపాలక సంస్థ పరిధిలో వివిధ రకాలైన చేతివృత్తిదారుల (సర్వీసు ప్రొవైడర్స్ నమోదు కార్యక్రమము ఫేజ్-1)ను గుర్తించి వారికి నైపుణ్య-సాంకేతిక శిక్షణ ఇచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు గుంటూరు నగరపాలక సంస్థ కమిషనర్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ నగరంలోని ప్లంబర్లు, కార్పెంటర్లు, ఎలక్ట్రిషియన్లు, ఏసీ, టివి, రిఫ్రిజిరేటర్, వాషింగ్ మిషన్ వంటివి మరమ్మతులు చేసేవారు, పెయింటర్, బ్యూటీషియన్ (స్త్రీ, పురుషులు) తదితరులకు తగిన నైపుణ్య, సాంకేతిక శిక్షణ, సర్టిఫికెట్ ఇవ్వడంతో పాటు జీవనోపాధి …

Read More »

మార్కెట్ నిర్మాణంపై మార్కెట్ వ్యాపారుల సంఘ ప్రతినిధులతో ప్రత్యేక సమావేశం

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగరానికి ఐకాన్ సింబల్స్ గా శంకర్ విలాస్ ఆర్ఓబి, పివికె నాయుడు మార్కెట్ ల నిర్మాణం జరగనున్నదని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్ అన్నారు. శుక్రవారం గుంటూరు పశ్చిమ ఎంఎల్ఏ గల్లా మాధవి తో కలిసి నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయంలో పివికె నాయుడు మార్కెట్ నిర్మాణంపై మార్కెట్ వ్యాపారుల సంఘ ప్రతినిధులతో ప్రత్యేక సమావేశం జరిగింది. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ గుంటూరు నగరంలో పివికె నాయుడు మార్కెట్ షుమారు 152 కోట్లతో …

Read More »

ఏటి అగ్రహారం విస్తరణ పనులు వేగంగా చేపట్టాలి…

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : ఏటి అగ్రహారం విస్తరణ పనులు వేగంగా చేపట్టాలని, విస్తరణ పూర్తి అయిన ప్రాంతంలో రోడ్ నిర్మాణ పనులు ప్రారంభించాలని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్  పట్టణ ప్రణాళిక, ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం కమిషనర్  ఏటి అగ్రహారం మెయిన్ రోడ్ విస్తరణ పనులను, అంకిరెడ్డిపాలెంలో హిందూ శ్మశాన వాటిక వద్ద చేపట్టిన అభివృద్ధి పనులను పరిశీలించి, అధికారులకు తగు ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా కమిషనర్  తొలుత చుట్టగుంట సెంటర్ నుండి కంకరగుంట ఆర్యుబి …

Read More »

ఉద్యోగుల మంచి కోరుకునే ప్రభుత్వం మాది

-రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఉద్యోగుల సంక్షేమంతో పాటు వాళ్ల మంచి కోరుకునే ప్రభుత్వం తమదని రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత మరియు జౌళి శాఖ మంత్రి ఎస్.సవిత తెలిపారు. తాడేపల్లిలోని తన క్యాంపు కార్యాలయంలో ఏపీ బీసీ, ఓబీసీ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ క్యాలెండర్ ను శుక్రవారం మంత్రి ఆవిష్కరించారు. ఈ సందర్బంగా మంత్రి సవిత మాట్లాడుతూ, ఉద్యోగుల సంక్షేమానికి సీఎం చంద్రబాబునాయుడు పెద్దపీటే వేస్తుంటారన్నారు. 2014లో రాష్ట్రం విడిపోయి, రాష్ట్ర ఆర్థిక …

Read More »

మహిళల విద్యకు సావిత్రిబాయి పూలే కృషి

-రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : బాల్య వివాహాలు, సతీ సహగమనానికి వ్యతిరేకంగా పోరాటం చేసిన సావిత్రి బాయి పూలే… అట్టడుగు వర్గాలు, మహిళల విద్య కోసం చేసిన సేవలు స్ఫూర్తిదాయకమని రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత మరియు జౌళి శాఖ మంత్రి ఎస్.సవిత తెలిపారు. శుక్రవారం సావిత్రిబాయి పూలే జయత్యోంత్సవం సందర్భంగా తాడేపల్లిలోని తన క్యాంపు కార్యాలయంలో ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి మంత్రి ఘన నివాళులర్పించారు. ఈ సందర్బంగా మంత్రి సవిత …

Read More »

”నూత‌న “ఉత్సాహంతో ఉత్త‌మ సేవ‌లందించండి

-జిల్లా క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : నూత‌న సంవ‌త్స‌రంలో మ‌రింత ఉత్సాహంతో ప‌నిచేసి అభివృద్ధిలో జిల్లాను అగ్ర‌గామిగా నిలిపేందుకు కృషిచేద్దామ‌ని జిల్లా క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ కోరారు. ఏపీ ఎన్‌జీజీవో ఎన్‌టీఆర్ జిల్లాశాఖ 2025 క్యాలెండ‌ర్‌ను జిల్లా క‌లెక్ట‌ర్ జి.లక్ష్మీశ న‌గ‌రంలోని ఆయ‌న క్యాంపు కార్యాల‌యంలో శుక్ర‌వారం ఆవిష్క‌రించారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ ప్ర‌జ‌ల‌కు స‌మ‌ర్థ‌వంత‌మైన సేవ‌లందించ‌డంలో ఉద్యోగుల‌ది కీల‌క‌పాత్ర అన్నారు. ప్ర‌భుత్వం అమ‌లుచేసే సంక్షేమ, అభివృద్ధి కార్య‌క్ర‌మాల‌ను పూర్తిస్థాయిలో ప్ర‌జ‌ల‌కు చేరువ చేయ‌డంలో మ‌రింత స‌మ‌ర్థ‌వంతంగా …

Read More »

మల్లవల్లి రైతుల హౌజ్ అరెస్ట్ పై మల్లాది విష్ణు ఫైర్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : కృష్ణా జిల్లా బాపులపాడు మండలం మల్లవల్లి రైతులను హౌజ్ అరెస్ట్ చేయడంపై వైసీపీ విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు తీవ్రంగా స్పందించారు. వందలాది మంది పోలీసులు గ్రామాన్ని మోహరించడంపై నిప్పులు చెరిగారు. పచ్చని పొలాలను ప్రభుత్వానికి ఇచ్చిన రైతులను ఈ ప్రభుత్వం సంఘ విద్రోహ శక్తులుగా చిత్రీకరిస్తూ.. హౌజ్ అరెస్ట్ లు చేయడం దుర్మార్గమన్నారు. ఏపీఐఐసీ పారిశ్రామికవాడ భూసేకరణలో నష్టపరిహారం అందని రైతులకు రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే న్యాయం చేయాలని డిమాండ్ …

Read More »

సావిత్రి భాయి పూలే కు ఘన నివాళి

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఏపీ పిటిడి బీసీ ఎంప్లాయిస్ వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు ఎస్ పి శేషగిరిరావు ఆధ్వర్యంలో సావిత్రిబాయి పూలే జయంతి కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. హెచ్ బి కాలనీ లో జరిగిన ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే కార్యాలయ కార్యదర్శి ప్రత్తిపాటి శ్రీధర్,ఎన్టీఆర్ జిల్లా మీడియా కోఆర్డినేటర్ యేదుపాటి రామయ్య,42వ డివిజన్ టిడిపి అధ్యక్షులు ముదిరాజ్ శివాజీ పాల్గొని ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఎస్ పి శేషగిరిరావు మాట్లాడుతూ దేశంలో మొదటి మహిళా ఉపాధ్యాయురాలైన …

Read More »

మహిళలందరూ సావిత్రిబాయి పూలే ను ఆదర్శంగా తీసుకోవాలి

-టిడిపి అధికార ప్రతినిధి నాగుల్ మీరా విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : భారతీయ సంఘసంస్కర్త, ఉపాధ్యాయిని, రచయిత్రి నిమ్న వర్గాల అభ్యున్నతికి కృషి చేసిన సావిత్రిబాయి పూలే ను మహిళలందరూ ఆదర్శంగా తీసుకోవాలని పోలీస్ హౌసింగ్ మాజీ కార్పొరేషన్ చైర్మన్ నాగుల్ మీరా అన్నారు. బీసీ ఇంటర్నేషనల్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సావిత్రిబాయి పూలే 194వ జయంతి వేడుకలు శుక్రవారం ఘనంగా నిర్వహించారు. కేఎల్ రావు నగర్ లోని రాకేష్ పబ్లిక్ స్కూల్లో నిర్వహించిన ఈ వేడుకలలో టీడీపీ అధికార ప్రతినిధి నాగుల్ …

Read More »