-టిడిపి అధికార ప్రతినిధి నాగుల్ మీరా
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
భారతీయ సంఘసంస్కర్త, ఉపాధ్యాయిని, రచయిత్రి నిమ్న వర్గాల అభ్యున్నతికి కృషి చేసిన సావిత్రిబాయి పూలే ను మహిళలందరూ ఆదర్శంగా తీసుకోవాలని పోలీస్ హౌసింగ్ మాజీ కార్పొరేషన్ చైర్మన్ నాగుల్ మీరా అన్నారు. బీసీ ఇంటర్నేషనల్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సావిత్రిబాయి పూలే 194వ జయంతి వేడుకలు శుక్రవారం ఘనంగా నిర్వహించారు. కేఎల్ రావు నగర్ లోని రాకేష్ పబ్లిక్ స్కూల్లో నిర్వహించిన ఈ వేడుకలలో టీడీపీ అధికార ప్రతినిధి నాగుల్ మీరా విశ్రాంత ఐపీఎస్ అధికారి యన్ రవీంద్రబాబు, టిడిపి ఆర్గనైజింగ్ సెక్రెటరీ బొమ్మసాని సుబ్బారావు, ఎన్టీఆర్ జిల్లా బిజెపి అధ్యక్షులు అడ్డూరిశ్రీరామ్ పశ్చిమ ఎమ్మెల్యే కార్యాలయ కార్యదర్శి ప్రత్తిపాటి శ్రీధర్ ముఖ్య అతిథులుగా పాల్గొని సావిత్రిబాయి పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
అనంతరం ఉత్తమ ఉపాధ్యాయులకు బహుమతులను అందజేశారు. ఈ సందర్భంగా నాగుల్ మీరా మాట్లాడుతూ సామాజిక బాధ్యత లో భాగంగా మహిళల సకల హక్కుల కోసం ప్రాణాలను సైతం పణంగా పెట్టి పోరాటం చేసిన మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలు సావిత్రిబాయి పూలేను బాలికలు, మహిళలు ఆదర్శంగా తీసుకోవాలన్నారు. విద్య ద్వారానే అభివృద్ధి సాధ్యమని భావించి పూణేలో మొదటి బాలికల పాఠశాలను ఏర్పాటు చేసి విద్యను అందించారని కొనియాడారు. ఎన్నో విమర్శలు, దాడులను ఎదుర్కొంటూనే బాలికల్ని, మహిళలను చైతన్య పరిచారన్నారు. కులమత భేదాలకు అతీతంగా లక్ష్యసాధన కోసం కృషిచేసిన సావిత్రిబాయి పూలేను నేటి మహిళలు ఆదర్శంగా తీసుకోవాలన్నారు.
ఆశయాల సాధన కోసం కట్టుబడి ఉండాలి
రవీంద్రబాబు
విశ్రాంత ఐపీఎస్ అధికారి రవీంద్ర బాబు మాట్లాడుతూ సాంఘిక సమానత్వం కోసం జీవితాంతం కృషి చేసిన సావిత్రిబాయి పూలే ఆశయాల సాధనకు ప్రతి ఒక్కరూ కట్టుబడి ఉండాలన్నారు. భారతీయ సమాజంలో గొప్ప మార్పులకు సావిత్రిబాయి పూలే పునాది వేశారని, మహిళా విద్యకు ప్రాధాన్యం కల్పించారని , అణచివేతకు గురైన వర్గాలకు న్యాయం అందించేందుకు జీవితాన్ని అర్పించారని కొనియాడారు. లింగ వివక్ష, కుల అసమానతులపై ఆమె చేసిన పోరాటం ప్రతి ఒక్కరికి స్ఫూర్తిదాయకమన్నారు.
అనంతరం ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీతలైన పిళ్లా విజయలక్ష్మి, యన్ సీతా కుమారి, కొండిపర్తి విజయలక్ష్మి, పొట్నూరి పావన పల్లవి, చలమాల పద్మావతి లను సన్మానం చేసి బహుమతులను అందజేశారు. కార్యక్రమంలో బీసీ ఇంటర్నేషనల్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు యన్ వి రావు, కార్యదర్శి నమ్మి అప్పారావు, అతిథులు బుద్దా నాగేశ్వరరావు, కూరపాటి కోటమరాజు, ఉమ్మడి వెంకటేశ్వరరావు, (చంటి) గుర్రంకొండ, నాగోతీరామారావు, దీటి ప్రభుదాస్, బ్రహ్మయ్య,కుర్మాచారి, రాధా కుమారి, బి ఎస్ కే పట్నాయక్, అవ్వారు బుల్లబ్బాయి, గడ్డిపాటి కిరణ్ చంద్రగిరి రాధా తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News