Breaking News

నాలుగు చక్రాల వాహనాలను బహిరంగ వేలం

మచిలీపట్నం,, నేటి పత్రిక ప్రజావార్త :
వాడుకలలో లేని, నిరుపయోగంగా ఉన్న నాలుగు చక్రాల వాహనాలను బహిరంగ వేలం వేయడం జరుగుతుందని జిల్లా రెవెన్యూ అధికారి చంద్రశేఖర రావు ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు కలెక్టరేట్ లో నిరుపయోగంగా ఉన్న బొలెరో, అంబాసిడర్, జీప్ మహేంద్ర వంటి 12 నాలుగు చక్రాల వాహనాలను ఈనెల 10వ తేదీ ఉదయం 11 గంటలకు మచిలీపట్నం కలెక్టరేట్ ఆవరణలో బహిరంగ వేలం వేయడం జరుగుతుందన్నారు. వేలంలో పాల్గొనేవారు 10వేల రూపాయల ధరావతు( డిపాజిట్) చెల్లించవలసి ఉంటుందన్నారు. ఇతర వివరాలకు పరిపాలనాధికారి, జిల్లా కలెక్టర్ కార్యాలయం మచిలీపట్నంలోను, మరియు మొబైల్ నెంబర్. 98499 03967 సంప్రదించవచ్చునని జిల్లా రెవెన్యూ అధికారి ఆ ప్రకటనలో తెలిపారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *