Breaking News

యువతలో టాలెంట్ వెలికి తీసేందుకు యువ కెరటాలు కార్యక్రమం

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
యువతలో నూతన ఉత్తేజం కలిగించేందుకు, వారిలో దాగివున్న టాలెంట్ వెలికి తీసేందుకు యువ కెరటాలు కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర గనులు భూగర్భవనరులు ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. స్థానిక హిందూ కళాశాల గ్రౌండ్స్ లో శుక్రవారం ప్రారంభమైన యువ కెరటాలు కార్యక్రమంలో మంత్రి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ యువతలో స్ఫూర్తిని నింపి నూతన ఉత్సాహాన్ని నింపిన వివేకానందుని ఈ సందర్భంగా మంత్రి గుర్తు చేసుకున్నారు. వివేకానందుని జన్మదినం జనవరి 12న యువజన దినోత్సవంగా జరుపుకుంటున్నామని దాన్ని పురస్కరించుకొని యువతలో నూతన ఉత్తేజం కల్పించాలని 2014 నుండి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. మొదటి రోజున పాఠశాల విద్యార్థులకు రెండో రోజున కళాశాల విద్యార్థులకు అనేక ఈవెంట్స్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు ఈరోజు ఉదయం విద్యార్థులకు చిత్రలేఖనంలో నిర్వహించిన పోటీలకు వేలాది మంది విద్యార్థులు హాజరై తమ టాలెంట్ చూపారని అన్నారు. రేపు కళాశాల విద్యార్థులకు వినూత్న కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. మచిలీపట్నం కేవలం బందర్ లడ్డుకే ప్రసిద్ధి మాత్రమే కాదు ఏ రంగంలోనైనా మచిలీపట్నం ముందు ఉంటుందని నిరూపించాలని విద్యార్థులకు సూచించారు. గత కార్యక్రమాల్లో ప్రపంచ చెస్ ఛాంపియన్ హంపి, నైనా జస్వాల్ వంటి ప్రసిద్ధ క్రీడాకారులు యువతలో స్ఫూర్తి నింపిన విషయం మంత్రి గుర్తు చేశారు. ఏపీకి అత్యధిక ఒలంపిక్ పథకాలు తెచ్చే విధంగా మా వంతు కృషి చేస్తామన్నారు.

ఈ కార్యక్రమంలో పాల్గొని యువతలో స్ఫూర్తిని నింపిన పోలాండ్ దేశానికి చెందిన టైక్వాండో వరల్డ్ ర్యాంకర్, రెండుసార్లు ఒలంపియన్ అయిన పెట్రిసియ (WCTA డైరెక్టర్, పొలాండ్) మరియు WCPT డైరెక్టర్ – ఇండియా, టీక్వాండో ఓపెన్ వరల్డ్ కప్ ఛాంపియన్, టీక్వాండో ఇండియన్ నేషనల్ టీం, వరల్డ్ టీక్వాండో గ్రాండ్ స్లాం కి క్వాలిఫై అయిన మొదటి భారతీయుడు) శివమ్ త్యాగీ లను మంత్రి సాలువ, మెమెంటోలతో సత్కరించారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్లేస్ మీరు చెప్పినా… నన్ను చెప్పమన్నా.. …కూటమి అభివృద్ధిపై చర్చకు రెడీ

-వైసీపీకి మంత్రి సవిత సవాల్ -మీటరు రోడ్డు కూడా వేయలేని అసమర్థులు -వైసీపీ నేతలపై మంత్రి సవిత విసుర్లు -ఉన్న …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *