– ప్రభుత్వ ప్రాధాన్యాలు, ప్రజా అవసరాల మేరకు క్రమశిక్షణతో పనిచేయాలి
– జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రభుత్వ ప్రాధాన్యాలు, ప్రజావసరాల మేరకు బృంద స్ఫూర్తితో, క్రమశిక్షణతో పనిచేసి కలెక్టరేట్ గౌరవం పెంచేందుకు అధికారులు, సిబ్బంది కృషిచేయాలని జిల్లా కలెక్టర్ డా. లక్ష్మీశ అన్నారు. బుధవారం కలెక్టరేట్ శ్రీ పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో కలెక్టరేట్లోని సమన్వయ, మెజిస్టీరియల్, ఎలక్షన్స్, ల్యాండ్ తదితర సెక్షన్ల అధికారులు, సిబ్బందితో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వ ఆశయాలు, ఆకాంక్షలు; ఉన్నతాధికారుల సూచనలు, క్షేత్రస్థాయిలో ప్రజల అవసరాలకు అనుగుణంగా విధులు నిర్వర్తించాలన్నారు. కలెక్టరేట్‌కు వెళ్తే తమకు తప్పకుండా న్యాయంజరుగుతుందనే నమ్మకంతో ప్రజలు వస్తారని.. ఆ మేరకు సిబ్బంది పనిచేయాలన్నారు. పని ఎంత చిన్నదైనా, పెద్దదైనా సమాన ప్రాధాన్యమిచ్చి, సత్వరం పూర్తిచేయాలన్నారు. విధి నిర్వహణలో ఎట్టిపరిస్థితుల్లోనూ నిర్లక్ష్యం అనేది ఉండకూడదని కలెక్టర్ లక్ష్మీశ స్పష్టం చేశారు. సమావేశంలో డీఆర్వో ఎం.లక్ష్మీ నరసింహం, కలెక్టరేట్ ఏవో ఎస్.శ్రీనివాసరెడ్డి, వివిధ సెక్షన్ల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News