అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రతిష్టాత్మక జెకె గ్రూప్ ప్రతినిధులు రాష్ట్రంలో ఏరోస్పేస్ రంగంలో పెట్టుబడి పెట్టేందుకు సుముకత వ్యక్తం చేశారు. గతంలో కర్ణాటక, తెలంగాణలో పెట్టుబడి పెట్టాలని జెకె గ్రూప్ బావించినప్పటికీ రాష్ట్ర సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు, గ్రామీణ పేదరిక నిర్మూలన, ప్రవాసాంధ్రుల సాధికారత, సంబంధాల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ చొరవతో రాష్ట్రంలో పెట్టుబడి పెట్టేందుకు సుముకత వ్యక్తం చేశారు. ఈరోజు సాయంత్రం సచివాలయంలోని ఐదో బ్లాక్ లో ఉన్న మంత్రి కార్యాలయంలో జెకె గ్రూప్ ప్రతినిధులు మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తో సమావేశమయ్యారు. రాష్ట్రంలో పెట్టుబడి పెట్టేందుకు ఉన్న అవకాశాలు, తాము స్థాపించాలని అనుకుంటున్న పరిశ్రమలకు అనువైన వాతావరణం, భౌగోళిక పరిస్థితులపై చర్చించారు. రాష్ట్రంలో పరిశ్రమలకు అవసరమైన భూమి అందుబాటులో ఉండటం, పెట్టుబడిదారులకు స్నేహపూర్వక ప్రభుత్వం ఉన్న నేపథ్యంలో రాష్ట్ర మంత్రి శ్రీనివాస్ సూచన మేరకు వారు పుట్టపర్తి జిల్లా లోని ఏరో స్పేస్ పార్క్ లో తాము పెట్టుబడులు పెట్టేందుకు సుముఖంగా ఉన్నామని తెలియజేశారు. రాష్ట్రంలోని ఏరోస్పేస్ పార్క్ లో ఉన్న అవకాశాలు భౌగోళిక పరిస్థితులు, రవాణా, ఇతర మౌలిక సదుపాయాల గురించి చర్చించి తాము ఏరోస్పేస్ రంగంలో పెట్టుబడి పెట్టేందుకు సుముఖంగా ఉన్నామని తెలియజేశారు. ఈ సమావేశంలో పాల్గొన్న పరిశ్రమ శాఖ కార్యదర్శి యువరాజ్ ను జెకె గ్రూప్ ప్రతినిధులు ఏరో స్పేస్ పార్క్ లో భూమిని పరిశీలించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని మంత్రి ఆదేశించారు. ఇదేవిధంగా రాష్ట్రంలోని ఏరోస్పేస్ పార్కులో ఏర్పాటయ్యే పరిశ్రమల్లో పనిచేసే సిబ్బందికి నైపుణ్య శిక్షణ ఇచ్చేందుకు ఫిలిప్స్ ఇండియా గ్రూప్ ముందుకొచ్చింది. రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగ యువతకు నైపుణ్య శిక్షణ ఇచ్చి ఆయా కంపెనీలకు అవసరమైన నైపుణ్యం గల సిబ్బందిని తయారు చేసేందుకు తాము సుముఖంగా ఉన్నామని తెలియజేశారని మంత్రి వివరించారు.
Tags amaravathi
Check Also
నిస్వార్థంగా సేవ చేయడమే తెలుగుదేశం పార్టీ సిద్థాంతం
–3వ డివిజన్‌లో సభ్యత్వ నమోదు కార్యక్రమంలో పాల్గోన్న ఎమ్మెల్యే గద్దె రామమోహన్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : సమాజానికి …