Breaking News

రాష్ట్రంలో ఒక రోజు ముందే పెన్షన్ల పండుగొచ్చింది

– 65 లక్షల మందికి రూ.4000 పెన్షన్ కూటమికి మాత్రమే సాధ్యమైంది
– జగన్ రెడ్డి రూ.3000 హామీకి తూట్లు పొడిచి వృద్దుల్ని దగా చేశారు.
– పెన్షన్లు ప్రారంభించింది టీడీపీనే.. దేశంలోనే అత్యధిక పెన్షన్ ఇస్తున్నదీ టీడీపీనే

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
పెన్షన్ పథకాన్ని ప్రారంభించి దేశంలోనే అత్యధిక పెన్షన్ ఇచ్చే స్థాయికి తీసుకెళ్లిన ఘనత తెలుగుదేశం పార్టీకి మాత్రమే సాధ్యమవుతుందని రాష్ట్ర గనులు, భూగర్భ వనరులు, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. ఒకటో తేదీ ఆదివారం రావడంతో ఒకరోజు ముందుగానే పెన్షన్లు అందించి ప్రతి ఒక్కరి జీవితాల్లో పండుగ వాతావరణం కల్పించిన ఘనత కూటమి ప్రభుత్వానికి మాత్రమే దక్కుతుందన్నారు. ఈ మేరకు పలువురు వృద్ధులు దివ్యాంగులకు పెన్షన్లను పంపిణీ చేశారు. నాడు ఎన్టీఆర్ 30 రూపాయలతో పెన్షన్ ప్రారంభిస్తే తర్వాత అధికారంలోకి వచ్చిన చంద్రబాబు క్రమంగా పెంచుతూ 2000 చేశారు. 3000 పెన్షన్ ఇస్తానని అధికారులకు వచ్చిన జగన్ రెడ్డి ఐదేళ్లు నాన్చి పెన్షన్ దారులని దగా చేశాడు. విడతల వారీగా పెన్షన్ అంటూ వృద్ధుల్ని పచ్చి మోసం చేశాడు. కానీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఇచ్చిన హామీ మేరకు పెన్షన్ మొత్తాన్ని రూ.4 వేలకు పెంచారు. ఏప్రిల్ నుండి అమలు చేసి పెంచిన పెన్షన్ అందించాము. దేశంలో 65 లక్షల మందికి రూ.4000 పెన్షన్ అందించే ఏకైక ప్రభుత్వం కూటమిదే. అదే సమయంలో దివ్యాంగులకు 6000, 100% అంగవైకల్యం కలిగిన వారికి 15 వేల వరకు పెన్షన్ అందిస్తున్నాం. పేదలకు అండగా నిలవాలని ఏకైక లక్ష్యంతో పెన్షన్ల పంపిణీని అమలు చేస్తున్నామని మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు.

Check Also

జ్యుడీషియల్ ఆఫీసర్ల పదవీ విరమణ వయసు పెంపు

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలోని న్యాయశాఖ జ్యూడిషియల్ ఆఫీసర్ల( న్యాయాధికారులు ) పదవీ విరమణ వయసును పెంపు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *