Breaking News

ముందు రోజే పింఛన్ల పండుగ

-కూటమి ప్రభుత్వం లబ్ధిదారులకు ఎన్టీఆర్ భరోసా పింఛన్లు పంపిణీ చేయడంలో ముందడుగు
-తొలిరోజే 100 శాతం పెన్ష‌న్ల పంపిణీకి అధికారులు, సిబ్బంది కృషిచేయాలి
-ఏపీ విప్, ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య

నందిగామ, నేటి పత్రిక ప్రజావార్త :
కూటమి ప్రభుత్వం లబ్ధిదారులకు ఎన్టీఆర్ భరోసా పింఛన్లు పంపిణీ చేయడంలో ముందడుగు వేస్తోందని ఏపీ ప్రభుత్వ విప్ నందిగామ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య పేర్కొన్నారు.  ప్రతి నెలా ఒకటో తేదీన పింఛను అందిస్తారు. అయితే డిసెంబరు ఒకటో తేదీ ఆదివారం కావడంతో లబ్ధిదారులు ఇబ్బందులు పడకూడదని ఈ నెల 30న పంపిణీ చేయాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించి ఉత్తర్వులు జారీ చేసిందని స్పష్టం చేశారు.

ఈ మేరకు నందిగామ మున్సిపాలిటీలో తంగిరాల సౌమ్య ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొని స్వయంగా పింఛన్లు లబ్ధిదారులకు అందజేశారు.  పెన్ష‌న్ల పంపిణీ ప్ర‌క్రియ‌ను విజ‌య‌వంతంగా పూర్తిచేసేలా అధికారులకు దిశానిర్దేశం చేశారు. గ‌త అనుభ‌వాల‌ను దృష్టిలో ఉంచుకొని ఏవైనా చిన్న‌చిన్న స‌మ‌స్య‌లుంటే వెంట‌నే సరిదిద్ది పెన్ష‌న్ల పంపిణీని కార్యక్రమం పూర్తి చేయాలన్నారు.

జిల్లాలో 2,31,127 పెన్ష‌న్ల‌కు రూ. 97.93 కోట్లు మేర పంపిణీ చేయ‌డం జ‌రుగుతుంద‌న్నారు. రాష్ట్ర ప్ర‌భుత్వం ల‌బ్ధిదారుల‌కు సామాజిక భ‌ద్ర‌త‌ను పెంచే ఉద్దేశంతో పెన్ష‌న్ల పంపిణీని మ‌రింత స‌ర‌ళీకృతం చేసింద‌న్నారు. వివిధ కార‌ణాల వ‌ల్ల రెండు నెల‌ల పాటు వ‌రుస‌గా పెన్ష‌న్ తీసుకోక‌పోయినా మూడో నెల‌లో ఆ మొత్తాన్ని ఒకేసారి చెల్లించేందుకు అవ‌కాశం క‌ల్పించింద‌న్నారు. ఎన్‌టీఆర్ భ‌రోసా పెన్ష‌న్ తీసుకుంటున్న వ్య‌క్తి మ‌ర‌ణిస్తే అత‌ని భార్య మ‌రుస‌టి నెల నుంచే స్పౌజ్ పెన్ష‌న్ (వితంతు పెన్ష‌న్‌) పొందేలా వీలుక‌ల్పించిన‌ట్లు వివ‌రించారు.

Check Also

జ్యుడీషియల్ ఆఫీసర్ల పదవీ విరమణ వయసు పెంపు

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలోని న్యాయశాఖ జ్యూడిషియల్ ఆఫీసర్ల( న్యాయాధికారులు ) పదవీ విరమణ వయసును పెంపు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *