Breaking News

ఎపిశాక్స్ ఆద్వర్యంలో హెచ్.ఐ.వి పై అవగాహనా శిభిరాలు


విజ‌య‌వాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రపంచ ఎయిడ్స్ నివారణా దినాన్ని పురస్కరించుకొని ఆంధ్ర ప్రదేశ్ స్టేట్ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ (ఎపిశాక్స్) ఆదేశాలనుసారంగా దిశ (డిస్ట్రిక్ట్ ఇంటిగ్రేటెడ్ స్ట్రాటజి ఫర్ హెచ్.ఐ.వి/ఎయిడ్స్) ఆధ్వర్యంలో విజయవాడ పండిట్ నెహ్రు బస్ స్టాండ్ లో రొండు చోట్ల హెచ్.ఐ.వి పై ఐ.ఈ.సి క్యాపెయిన్ ను నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని జిల్లా ఎయిడ్స్ నియంత్రణా అధికారిణి డాక్టర్ జి.ఉషారాణి అధ్యక్షతన జరిగింది. కార్యక్రమంలో యన్.టి.ఆర్ మరియు గుంటూరు జిల్లాల పర్యవేక్షణా అధికారి జాన్సన్ పర్వవేక్షించారు. ఈ సందర్భంగా జాన్సన్ మాట్లాడుతూ ప్రపంచ ఎయిడ్స్ నివారణ దినం ను పురస్కరించుకొని శనివారం మరియు ఆదివారం విజయవాడ బస్ స్టాండ్ ఆవరణలో రొండు చోట్ల అవగాహన సిబిరాలను ఏర్పాటు చేశామని ఈ రొండు స్టాల్స్ నందు స్వచ్చంద సేవా సంస్థలు ప్రజలకు హెచ్.ఐ.వి / సుఖవ్యాధులపై అవగాహనను ఏర్పరుస్తారని ఆయన అన్నారు. ఇందులో వాసవ్య మహిళా మండలి, కృష్ణా జిల్లా లారి ఓనర్స్ అసోశియేషన్, స్నేహ టి.ఐ, గైడ్ పౌండేషన్, ఆర్ హెడ్స్, రైడ్స్ విజయవాడ, లీడ్స్ సంస్థల సిబ్బంది పాల్గొంటారని ఆయన అన్నారు.

అనంతరం శ్రీనివాసరావు, ఆర్.టి.సి సి.పి.యం, మాట్లాడుతూ విజయవాడ ఆర్.టి.సి ప్రయాణికులు సౌకర్యార్థం వారు హెచ్.ఐ.వి పై అవగాహన కలిగి ఉండాలన్న ఉద్దేశంతో ఈ మంచి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న ఆంధ్ర ప్రదేశ్ స్టేట్ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటి వారికి ప్రత్యేక కృతజ్ఞతలను ఆయన తెలియజేశారు.

అనంతరం గోపరాజు రశ్మి, కార్యదర్శి, వాసవ్య మహిళా మండలి మాట్లాడుతూ సిటి టెర్మినల్ నందుగల స్టాల్ వాసవ్య మహిళా మండలి, కృష్ణా జిల్లా లారి ఓనర్స్ అసోశియేషన్ మరియు స్నేహ టి.ఐ సంస్థలు ఈ రెండు రోజులు అవగాహనను అందిస్తామని ఆమె అన్నారు. ఈ సందర్బంగా హెచ్.ఐ.వి/ సుఖవ్యాధులపై ఫ్లిప్ చార్జ్లు, కలర్ టి.వి గేమ్, బిహేవియర్ చేంజ్ కమ్యూనికేషన్, కరపత్రాలను పంచడం ద్వారా ప్రయాణికులకు అవగాహనను కల్పించారని ఆమె అన్నారు.

ఈ కార్యక్రమంలో క్లస్టర్ ప్రాజెక్ట్ ఆఫీసర్ మల్లేశ్వరరావు, సిబ్బంది. వి. రాజామోహన్ రావు, కె.శ్రీనివాసరావు, వి.వి సాంబశివరావు, రవి శంకర్, మధుబాబు, యన్. రామారావు, రవి, వినోల్య, సత్యప్రసాద్, వీరాంజనేయులు, అజయ్, సుహాసిని, రమాదేవి, కృష్ణారెడ్డి, రమాదేవి, రాయప్ప, శాంతకుమారి, పాప తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్లేస్ మీరు చెప్పినా… నన్ను చెప్పమన్నా.. …కూటమి అభివృద్ధిపై చర్చకు రెడీ

-వైసీపీకి మంత్రి సవిత సవాల్ -మీటరు రోడ్డు కూడా వేయలేని అసమర్థులు -వైసీపీ నేతలపై మంత్రి సవిత విసుర్లు -ఉన్న …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *