Breaking News

మల్టీ స్పోర్ట్స్ కాంప్లెక్స్ ను తిరుపతి నగర ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలి జిల్లా కలెక్టర్ డా. ఎస్ వెంకటేశ్వర్

-క్రీడాకారులను ప్రోత్సహించే దిశగా.. మల్టీ స్పోర్ట్స్ కాంప్లెక్స్ ఏర్పాటు తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు
-ప్రతి ఒక్కరు మానసిక, శారీరక దృఢత్వం కోసం క్రీడల వైపు ఆసక్తి చూపాలి శాప్ చైర్మన్ రవి నాయుడు
-నగరపాలక సంస్థ నుంచి క్రీడాకారులకు ఎప్పుడూ ప్రోత్సాహం ఉంటుంది నగర పాలక కమిషనర్ మౌర్య

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
తిరుపతి నగర ప్రజలందరికి మల్టీ స్పోర్ట్స్ కాంప్లెక్స్ ను అందుబాటులోకి తీసుకొని రావడం జరిగిందని, నగర ప్రజలందరూ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి అని జిల్లా కలెక్టర్ డా .ఎస్. వెంకటేశ్వర్ తెలిపారు. గురువారం స్థానిక ఇందిరా మైదానం నందు ఇండోర్ స్టేడియంలో మల్టీ స్పోర్ట్స్ కాంప్లెక్స్ ను తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు, మున్సిపల్ కమిషనర్ ఎన్.మౌర్య, రవినాయుడు తో కలిసి జిల్లా కలెక్టర్ శిలాఫలకం గావించి కార్యక్రమాన్ని ప్రారంభోత్సవం చేశారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ…తిరుపతి నగర ప్రజలందరికి కోసం మల్టీ స్పోర్ట్స్ కాంప్లెక్స్ ను ఏర్పాటు చేయడం జరిగింది అని అన్నారు. సుమారు రూ. 8.80 కోట్ల స్మార్ట్ సిటీ నిధులతో ఇండోర్ స్టేడియం నిర్మించడం జరిగిందన్నారు. ప్రజలకు క్రీడాకారులకు పలు రకాల క్రీడలను అందుబాటులోకి తీసుకొని రానున్నామని శుభ పరిణామమని తెలిపారు. ఈ ఇండోర్ స్టేడియం నందు బాస్కెట్ బాల్ , వాలీబాల్ షటిల్ వంటి క్రీడలతో పాటు ఇండోర్ క్రీడలు అందుబాటు లోకి వచ్చాయని తెలిపారు. గ్రౌండ్ ఫ్లోర్ నందు రెండు బ్యాడ్మింటన్ కోర్టులు, వాలీబాల్, బాస్కెట్ బాల్ కోర్టులు ఉంటాయని అన్నారు, మొదటి అంతస్తు నందు రెండు టేబుల్ టెన్నిస్ కోర్టులు, రెండు క్యారమ్ బోర్డులు, ఒక ఎయిర్ హాకీ, ఒక పూల్ టేబుల్ కోర్టులు, రెండవ అంతస్తులో జిమ్ ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. మల్టీ స్పోర్ట్స్ కాంప్లెక్స్ ను శాసనసభ్యులు, శాప్ ఛైర్మన్, ప్రజా ప్రతినిధుల ఆధ్వర్యంలో ఈరోజు ఏర్పాటు చేయడం ఆనందంగా ఉందన్నారు. నిరంతరాయంగా తిరుపతి ప్రజలకు అన్ని సౌకర్యాలు ఏర్పాటు ఎల్లప్పుడూ క్రీడలు నిర్వహణ జరిగేలా తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. కావున ప్రజలందరూ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు.

తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు మాట్లాడుతూ… క్రీడాకారులను ప్రోత్సహించే దశగా మల్టీ స్పోర్ట్స్ కాంప్లెక్స్ ను తిరుపతి ప్రజలకు అందరికీ అందుబాటులోకి తీసుకొని రావడం జరిగింది అని తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆశీస్సులతో మేరకు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కృషితో తిరుపతి ఆధ్యాత్మిక నగరానికి స్మార్ట్ చేసిన తీసుకుని రావడం జరిగిందని తెలిపారు. 2018-19 సంవత్సరంలో ఇండోర్ స్టేడియం కు అనుమతులు రావడం జరిగిందని తెలిపారు. ఆ రోజే ఇండోర్ స్టేడియం మంజూరు చేసిన పనులు పూర్తి అయి పూర్తిస్థాయిగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం, తిరుపతి ప్రజలకు అందుబాటులోకి తీసుకొని రావడం సంతోషంగా ఉందని తెలిపారు. స్పోర్ట్స్ కాంప్లెక్స్ లో బాస్కెట్ బాల్, టెన్నిస్, వాల్ బాల్ వంటి వంటి ఆటలను క్రీడాకారులకి అందుబాటులోకి తీసుకొని రావడం జరిగింది అని తెలిపారు. స్మార్ట్ సిటీ నిధులతో తిరుపతి అభివృద్ధి పనులు, మున్సిపల్ నిధులతో తిరుపతి నగరలో గుంతలు లేని రోడ్ల లేని పనులను పూర్తి చేయడం జరుగుతుందని తెలిపారు. కావున తిరుపతి నగర ప్రజలందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు.

శాప్ ఛైర్మన్ మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్ ను క్రీడాంధ్రప్రదేశ్ గా మార్చాలని సంకల్పంతో ప్రతి ఒక్కరూ మానసికంగా, శారీరకంగా దృఢంగా ఉండాలంటే క్రీడల ఎంతో ముఖ్యమని వీటిపై ఆసక్తి చూపాలని రాష్ట్ర ముఖ్యమంత్రి ఆశయంతో నేడు తిరుపతి లోని క్రీడాకారులకు, ప్రజలకు ఉపయోగపడే విధంగా ఈరోజు మల్టీ స్పోర్ట్స్ కాంప్లెక్స్ ను అందుబాటులోకి తీసుకురావడం జరిగిందని తెలిపారు. తిరుపతి ని స్పోర్ట్స్ హబ్ గా మార్చాలని సంకల్పంతో తిరుపతి నగరం జాతీయ క్రీడలకు వేదిక కావాలని ఆలోచనతో స్టేడియం ఏర్పాటుకు రూపకల్పన జరిగిందని అన్నారు. ప్రజలందరూ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని, క్రీడల వైపు మొగ్గు చూపాలన్నారు. ఈ రాష్ట్రాన్ని క్రీడాంధ్రప్రదేశ్ మార్చేలా స్పోర్ట్స్ అథారిటీ కృషి చేస్తుందని తెలిపారు.

కమిషనర్ మాట్లాడుతూ.. నగరంలో క్రీడాకారులు ప్రోత్సహించేందుకు ఈ మల్టీ స్పోర్ట్స్ కాంప్లెక్స్ ఎంతో ఉపయోగపడుతుందని, క్రీడాకారులందరూ ఈ స్పోర్ట్స్ కాంప్లెక్స్ సద్వినియోగం చేసుకుని తిరుపతి ఖ్యాతిని దశ దిశలా చాటి చెప్పాలని పిలుపునిచ్చారు. నగరపాలక సంస్థ నుంచి క్రీడాకారులకు ఎప్పుడు ప్రోత్సాహం ఉంటుందని అన్నారు. అనంతరం జిల్లా కలెక్టర్ ఎమ్మెల్యే తో కలిసి వాలీబాల్, టెన్నిస్ ఆడి అందరిని ఉత్సాహపరిచారు.

ఈ కార్యక్రమంలో మేయర్ శిరీష్, స్మార్ట్ సిటీ మేనేజర్ చంద్రమౌళి, మాజీ శాసన సభ్యురాలు సుగుణమ్మ, టీటీడీ బోర్డు మెంబర్ భాను ప్రకాష్ , డిప్యూటీ కమిషనర్ అమరయ్య తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్లేస్ మీరు చెప్పినా… నన్ను చెప్పమన్నా.. …కూటమి అభివృద్ధిపై చర్చకు రెడీ

-వైసీపీకి మంత్రి సవిత సవాల్ -మీటరు రోడ్డు కూడా వేయలేని అసమర్థులు -వైసీపీ నేతలపై మంత్రి సవిత విసుర్లు -ఉన్న …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *