Breaking News

పునర్వ్యవస్థీకరించబడిన వాతావరణ ఆధారిత పంటల భీమా పధకం (RWBCIS) క్రింద తిరుపతి జిల్లాలో మామిడి పంటల భీమా ప్రక్రియ నమోదు

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
అగ్రికల్చర్ ఇన్సూరెన్స్ కంపెనీ ఆఫ్ ఇండియా లి అనే కేంద్రప్రభుత్వ సంస్థ రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వాల సహకారంతో కాలానుగుణంగా వాతావరణంలో వచ్చే ప్రతికూల మార్పులతో పంట నష్టం వలన కలిగే ఆర్థిక నష్టాల నుండి రైతులను అదుకొనుటకు Lr. No. AGC02-21025/29/2024, Dt: 07/11/2024 ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పునర్వ్యవస్థీకరించబడిన వాతావరణ ఆధారిత పంటల భీమా (RWBCIS) పధకాన్ని మామిడి పంటను రబీ
2024-25కు అమలు చేస్తుంది.

భీమా పొందడం ఎలా
భీమా పొందుటకు మీ దగ్గరలో ఉన్న బ్యాంకు / CSC (కామన్ సర్వీస్ సెంటర్) (మీ సేవ) / భీమా కంపెనీ ద్వారా నియమింపబడిన మధ్యవర్తులు (Infina Insurance broking private limited and Novo Insurance Broking Services Pvt Ltd) మరియు రైతులు నేరుగా PMFBY PORTAL (www. pmfby.gov.in) నందు మొబైల్ ద్వారా కూడా భీమా పొందవచ్చు.

కావలసిన పత్రాలు
బ్యాంకు అకౌంట్ జిరాక్స్, ఆధార్ కార్డు జిరాక్స్, భూమిపాస్ బుక్కు జిరాక్స్ మరియు పంట వేసినట్టు ధృవీకరణ పత్రము (VAA/VHA/VSA)
భీమా చేయబడు అంశాలు భీమా వర్తించు సమయం
అకాల/అధిక వర్షపాతం 15/12/2024-28/02/2025
చీడపీడల వాతావరణం (ముసురు / తేమ) 15/12/2024 28/02/2025
ఉష్ణోగ్రతలో వ్యత్యాసం 01/01/2025 15/03/2025
అధిక గాలి వేగం 01/03/2025 31/05/2025

నష్టపరిహారం అంచనా:
15/12/24 నుండి 31/05/25 సంవత్సరకాలం మధ్యన అధిక వర్షపాతం, గాలిలో తేమశాతం, వాతావరణం వ్యత్యాసం మరియు అధిక గాలివేగం సంబంధించిన పరిమాణాలను మండల స్థాయిలో గల “ఆంధ్రప్రదేశ్ స్టేట్ డెవలప్మెంట్ ప్లానింగ్ సోసైటీ” (APSDPS )వాతవరణ పరికరాల సమయంలో లెక్కించి, దానిని ఈ పథకంలో ముందుగా పొందుపరచబడిన పరిమాణాలలో సరిపోల్చినపుడు వచ్చిన తేడా ఆధారంగా నష్టపరిహారం చెల్లిస్తారు. తిరుపతి జిల్లాలో మామిడి పంట ఎకరాకు భీమా మొత్తం రూ.35000, ప్రీమియం ఎకరాకు రూ.1750.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్లేస్ మీరు చెప్పినా… నన్ను చెప్పమన్నా.. …కూటమి అభివృద్ధిపై చర్చకు రెడీ

-వైసీపీకి మంత్రి సవిత సవాల్ -మీటరు రోడ్డు కూడా వేయలేని అసమర్థులు -వైసీపీ నేతలపై మంత్రి సవిత విసుర్లు -ఉన్న …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *