-జాతీయ విద్యా విధానం (ఎన్ఈపీ) 2020 ప్రగతిశీలమైంది, శాస్త్రీయమైంది మరియు ఉపాధి ఆధారితం; హర్యానా గవర్నర్
-జాతీయ విద్యావిధానం కొత్త తరానికి నైపుణ్యాలను సంపాదించడంలో తోడ్పడుతుంది; పంజాబ్ గవర్నర్
-యూటీ, చండీగఢ్ ద్వారా కొత్త క్రిమినల్ చట్టాల అమలును బహిర్గం చేసిన ప్రెస్ పార్టీ
చండీగఢ్, నేటి పత్రిక ప్రజావార్త :
ఎనిమిది మంది పాత్రికేయులు, విజయవాడ పత్రికా సమాచార కార్యాలయం మరియు కేంద్ర సమాచార కార్యాలయం అధికారులతో కూడిన మీడియా ప్రతినిధి బృందం ఆంధ్రప్రదేశ్ నుంచి డిసెంబర్ 5, 2024న పంజాబ్ రాష్ట్రంలో తమ పత్రికా పర్యటనను ప్రారంభించింది. మొదటి రోజు, ప్రతినిధి బృందం పంజాబ్ గవర్నర్ గులాబ్ చంద్ కటారియా, హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయతో సమావేశమయ్యారు; వారు కొత్త క్రిమినల్ చట్టాలపై ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్‌ను సైతం సందర్శించారు. అలాగే పంజాబ్ ప్రభుత్వానికి చెందిన డిఐపిఆర్‌తో సమావేశమయ్యారు. అదనపు డైరెక్టర్ జనరల్ (ప్రాంతీయం), సమాచార మరియు ప్రసార మంత్రిత్వ శాఖ, విజయవాడ, భారత ప్రభుత్వం, రాజిందర్ చౌదరి ప్రతినిధి బృందానికి నాయకత్వం వహిస్తారు.
‘‘హర్యానా వచ్చే ఏడాది నుంచే జాతీయ విద్యా విధానాన్ని అమలు చేయనుంది’’.
హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ సందర్శనకు విచ్చేసిన మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ- హర్యానా రాష్ట్రం 2030 జాతీయ లక్ష్యానికి అనుగుణంగా వచ్చే ఏడాది నుంచే జాతీయ విద్యా విధానాన్ని అమలు చేయనుంది. ఎన్ఈపీ ప్రగతిశీలమైంది, శాస్త్రీయమైంది, అలాగే ఉపాధి-ఆధారితం అని అన్నారు. మాతృభాష ప్రాముఖ్యత పై గవర్నర్ ప్రసంగిస్తూ- ‘‘ప్రపంచవ్యాప్తంగా ఉన్న దేశాల మాదిరిగానే ఉన్నత విద్యలో కూడా ప్రాంతీయ భాషలను ఉపయోగించడం పై దృష్టి సారించడం నేర్చుకునే ప్రక్రియకు దోహదపడుతుంది’’ అని అన్నారు.
‘‘హర్యానాలోని 180 కేంద్రాలను గీతకు సంబంధించిన తీర్థయాత్ర కేంద్రాలుగా అభివృద్ధి చేయనున్నారు’’.
ఈ రోజు ప్రారంభమైన మూడు రోజుల 9వ అంతర్జాతీయ గీతా మహోత్సవ్ గురించి హర్యానా గవర్నర్ మాట్లాడుతూ- ‘‘భగవద్గీత పర్యావరణం గురించి ఎలా నొక్కి చెబుతుందో మరియు సహజ వనరులను దోపిడీ చేయవద్దని హెచ్చరిస్తుందో అందరూ గుర్తు చేసుకోవాలి’’ అని అన్నారు. ఈ అంశం పై సుమారు 700 పరిశోధన పత్రాలపై మహోత్సవంలో చర్చిస్తామన్నారు. ఇప్పటివరకు, గీతకు సంబంధించిన మొత్తం 182 తీర్థయాత్ర కేంద్రాలు గుర్తించడం జరిగింది మరియు హర్యానాలో 112 యాత్రా స్థలాలుగా అభివృద్ధి చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. విద్యార్థులకు విలువలతో కూడిన విద్యను అందించడానికి గీత ఒక మూలమని గవర్నర్ సూచించారు. గవర్నర్ సూచన మేరకు హర్యానా రాష్ట్రం సొంతంగా ఉపగ్రహాన్ని ప్రయోగించే యోచనలో ఉన్నట్లు మీడియా ప్రతినిధుల బృందానికి తెలిసింది.
‘‘శ్రమకు తగిన గౌరవం ముఖ్యం, శ్రమకు ఎక్కువ విలువ ఇవ్వాలి’’
పంజాబ్ గవర్నర్ గులాబ్ చంద్ కటారియా మాట్లాడుతూ- ‘‘జాతీయ విద్యా విధానం కొత్త తరానికి నైపుణ్యాలను పెంపొందించుకోవడానికి దోహదపడుతుంది’’ అని అన్నారు. ముందు తరాలు ఎదిగే కొద్దీ నైపుణ్యాలను అలవరచుకునేవారని, అయితే ప్రస్తుత తరం ఈ విషయంలో కాస్త వెనుకబడిందని గవర్నర్ పేర్కొన్నారు. శ్రమకు తగిన గౌరవం అనే అంశం గురించి ఆయన మాట్లాడుతూ ఈ రోజుల్లో కష్టపడి పని చేయడం కంటే ఉద్యోగాలు సాధించడం పైనే దృష్టి సారిస్తున్నారని అన్నారు.
ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ విలువ గురించి గవర్నర్ మాట్లాడుతూ – ‘‘ప్రాచీన కాలం నుంచి భారతదేశం అంతా ఒక్కటేనని, సంస్కృతులను పెంపొందించడంలో, జాతీయ సమగ్రతను పెంపొందించడంలో మీడియా చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది’’ అని అన్నారు.
మూడు కొత్త క్రిమినల్ చట్టాలపై ప్రదర్శన
రెండు రోజుల క్రితం 3 డిసెంబర్, 2024న ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించిన చండీగఢ్ పంజాబ్ ఇంజినీరింగ్ కళాశాలలో జరిగిన ఎగ్జిబిషన్ దవ్రా, చండీగఢ్ కేంద్రపాలిత ప్రాంత పరిపాలన ద్వారా మూడు కొత్త క్రిమినల్ చట్టాల అమలును మీడియా ప్రతినిధి బృందం లీనంగా బహిర్గతం చేసింది. నేరం జరిగినప్పటి నుంచి కోర్టులో తుది తీర్పు వెలువడే వరకు నేర దృశ్యం యొక్క పూర్తి అనుకరణ నడకను ఈ ఎగ్జిబిషన్ ప్రదర్శించింది. కొత్త క్రిమినల్ చట్టాల క్రింద ప్రవేశపెట్టిన సంస్కరణలు సాంకేతికతను మరియు క్రమబద్ధమైన ప్రక్రియలను ఎలా ఉపయోగిస్తాయో, వేగంగా, పౌర-కేంద్రీకృతంగా న్యాయం ఎలా జరిపిస్తారో చెప్పడానికి మరియు తద్వారా మరింత సురక్షితమైన, భద్రత కలిగిన సమాజానికి మార్గం సుగుమం చేస్తుంది.
‘‘వివిధ మతాలకు చెంది ఉపాధ్యాయుల జ్నానాన్ని ఉదారంగా ప్రస్తావించడంలో గురు గ్రంథ్ సాహిబ్ ప్రత్యేకమైంది’’.
అంతకుముందు రోజు, మీడియా ప్రతినిధి బృందం పంజాబ్ ప్రభుత్వ సమాచార మరియు ప్రజా సంబంధాల శాఖతో సమావేశమైంది. ప్రెస్ పార్టీని ఉద్దేశించి, డీఐపిఆర్ డైరెక్టర్ విమల్ కుమార్ సేథియా పంజాబ్ యొక్క గొప్ప సంస్కృతి మరియు సిక్కు మతం, సంప్రదాయం యొక్క గొప్పదనం, వైభవం గురించి వారికి వివరించారు. గురు గ్రంథ్ సాహిబ్ ఒక మత గ్రంథమని, ఇది వివిధ మతాలకు చెంది ఉపాధ్యాయుల జ్నానాన్ని ఉదారంగా ఉదహరించి, ప్రస్తావించిందని ఆయన సూచించారు. రాష్ట్ర సంస్కృతి గురించి మరింత తెలుసుకోవడానికి మరియు స్వర్ణ దేవాలయం వంటి పవిత్ర స్థలాలను సందర్శించాలని ఆయన మీడియాను ప్రోత్సహించారు. డిఐపిఆర్ జాయింట్ డైరెక్టర్ శ్రీ హర్జీత్ సింగ్ గ్రేవాల్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
పర్యాటక శాఖ డైరెక్టర్ హర్జోత్ కౌర్‌తో కూడా మీడియా ప్రతినిధి బృందం సమావేశమైంది. వారు ఫామ్ టూరిజం, రివర్ టూరిజం మరియు ఇతర వివిధ రకాల పర్యాటకాన్ని ప్రోత్సహించడానికి రాష్ట్రం చేపడుతున్న వివిధ కార్యక్రమాల గురించి వారికి వివరించారు.
పత్రికా పర్యటన ద్వారా, భారత ప్రభుత్వ సమాచార మరియు ప్రసార మంత్రిత్వ శాఖ చొరవతో మీడియా ప్రతినిధుల బృందానికి రాష్ట్రంలో ప్రభుత్వ అభివృద్ధి పథకాల పనితీరుని బహిర్గతం చేస్తారు. రేపు, మీడియా ప్రతినిధి బృందం జలంధర్‌లోని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీని సందర్శించి, జాతీయ విద్యా విధానం అమలును బహిర్గతం చేయనుంది. వారు ఐజీ, బీఎస్ఎఫ్‌తో కూడా పరస్పరం చర్చలు జరుపుతారు మరియు ఈ ప్రాంతంలో బీఎస్ఎఫ్ పాత్ర, బాధ్యతలు మరియు పనితీరు గురించి కూడా బహిర్గతం చేస్తారు. ప్రెస్ పార్టీ కూడా అమృత్‌సర్‌ని సందర్శించి, స్వర్ణ దేవాలయం, శ్రీ దుర్గియానా దేవాలయం, అట్టారీ సరిహద్దు మరియు జలియన్ వాలాబాగ్ మెమోరియల్‌ను సందర్శించి వారి సొంత రాష్ట్రానికి వచ్చే విధంగా షెడ్యూల్ రూపొందించడం జరిగింది.