విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
సితార సెంటర్ వద్ద ఆత్మహత్య చేసుకున్న చలువాది మల్లికార్జునరావు పొట్టి శ్రీరాములు ఇంజనీరింగ్ కళాశాలకు చెందిన విద్యార్థి బోయ కళ్యాణ్ రెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన పోతిన వెంకట మహేష్.
బోయ కళ్యాణ్ రెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన అనంతరం మహేష్ బోయ కళ్యాణ్ రెడ్డి తల్లిదండ్రులైన రామచంద్ర రెడ్డి భారతీయులను పరామర్శించినారు ఈ సందర్భంగా వారు మహేష్ తో మాట్లాడుతూ మా కుమారుడు ఎంతో కష్టపడి చదువుకుంటున్నాడని ప్రతి ఒక్కరికి సాయం చేసే మనస్తత్వం కలవాడని ఈమధ్య కళాశాలలో స్ట్రీట్ లైట్స్ ఉదయం పూట ఆటోమేటిక్గా ఆరిపోయేలా ఒక నూతన టెక్నాలజీని ఆవిష్కరించే ప్రయత్నం చేస్తున్నాడని ఈ అంశం టీవీల్లో కూడా ప్రసారమయిందని ఇంట్లో వాళ్ళను కూడా డబ్బులు అడగకుండా సొంతంగా తనే పార్ట్ టైం జాబ్ చేసుకుంటాడని ప్రాజెక్టు వర్క్ లో ఎంతో కష్టపడి చేస్తాడని ఈ తరుణంలో అధ్యాపకుల వేధింపులు అవమానాలు తట్టుకోలేకే తమ కుమారుడు ఆత్మహత్య చేసుకున్నాడని ఇందు కారణమైన అధ్యాపకులను చట్టపరంగా తప్పక శిక్షించాలని ఎందుకంటే మాలాంటి కడుపుకోత మరి ఏ ఇతర తల్లితండ్రులకు ఆ కళాశాలలో ఎదుర్కారాదని చదువుకోడానికి వెళ్లిన పిల్లలు నవ్వుతూ ఆనందంగా ఇంటికి తిరిగి వచ్చి వందేళ్లపాటు మంచి భవిష్యత్తు ఉండాలని కోరుకునే తల్లిదండ్రులను కనుకనే ఇటువంటి సంఘటన మరొక తల్లిదండ్రులకు జరగకూడదని తెలియజేస్తూ తమ కుమారుడి కళ్లను ఎల్వి ప్రసాద్ కంటి ఆసుపత్రి ద్వారా డొనేట్ చేశామని కళాశాల యాజమాన్యం గాని అధ్యాపకులు గాని ఇంతవరకు కనీసం తమ కుటుంబం ను పరామర్శించలేదని, ఆసుపత్రిలో ఆరుచికస్ పొందిన ఎవరూ కనీసం కళాశాల వైపు నుంచి చూడ్డానికి రాలేదని ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా మహేష్ మాట్లాడుతూ ఇంజనీర్ బోయ కళ్యాణ్ రెడ్డి మరణం తమను ఎంతో కలచి వేసిందని, డబ్బు లేకపోతే పేదవారికి న్యాయం జరగదా అని, పేదవారిపట్ల కులం మతం కూడా సరైన రీతిలో స్పందించవా అని, పేదవారికి న్యాయం చేయడంలో వ్యవస్థలు సరిగా పనిచేయడం లేదని ,ఏ తప్పు లేకపోతే కళాశాల యాజమాన్యం గాని అధ్యాపకులు గాని ఇంతవరకు ఎందుకు స్పందించలేదని, ఈ ఘటనపై అధికారులు కళాశాల యాజమాన్యం సరైన రీతిలో స్పందించకపోతే తప్పక కార్యాచరణ ప్రకటిస్తామన్నారు.
ఈ కార్యక్రమంలో మాల మహానాడు అధ్యక్షులు శ్యామ్ న్యాయవాది ఎం హనుమాన్ గంగాధర్, షాహినా, మారుతి, సోమశేఖర్ ,పొట్నూరి శ్రీను, పైలా పవన్ ,నూకరాజు, చింతాడ నాని, రాజు తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News