విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్ర సాంకేతిక విద్యాశాఖ విజయవాడలో ఈ నెల 6, 7 తేదీల్లో రెండురోజుల పాటు పాలీటెక్ ఫెస్ట్ (2కే24-25) నిర్వహించనుంది. నగరంలోని లబ్బీపేట, ఎస్ఎస్ కన్వెన్షన్ హాల్‌లో ఈ ఫెస్ట్ జరుగుతుంది. ప్రతిరోజు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు ఈ ఫెస్ట్ జరుగుతుంది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న డిప్లొమా విద్యార్థులు టెక్నికల్ ప్రాజెక్టుల ద్వారా తమ ప్రతిభను ప్రదర్శించేందుకు ఇది ఉత్తమ వేదికగా నిలవనుంది. ఈ ఏడాది పాలీటెక్ ఫెస్ట్ గౌరవ ముఖ్యమంత్రివర్యులు, మానవ వనరుల అభివృద్ధి శాఖామంత్రివర్యుల దార్శనికతకు అనుగుణంగా పాఠశాల, కాలేజీ విద్య ప్రిన్సిపల్ సెక్రటరీ కోన శశిధర్, టెక్నికల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ జి.గణేశ్ కుమార్ మార్గనిర్దేశంలో జరగనుంది. ఈ స్టేట్ లెవెల్ మీట్‌లో 107 పాలిటెక్నిక్స్ నుంచి 249 ప్రాజెక్టులు ప్రదర్శించడం జరుగుతుంది.
Tags vijayawada
Check Also
సమర్ధవంతంగా శాప్ విధులు
-ప్రణాళికాబద్ధంగా క్రీడల అభివృద్ధి -త్వరితగతిన క్రీడాభివృద్ధి పనులు -స్పోర్ట్స్ అథారిటీ అధికారులతో శాప్ ఛైర్మన్ రవినాయుడు విజయవాడ, నేటి పత్రిక …