విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
గుణదలలోని రాంగోపాల్ థియేటర్ నేటి నుంచి రామ్స్ థియేటర్ గా నగరవాసులకు వినోదాన్ని అందించనుందని థియేటర్ అధినేత యలమంచిలి రామ్ తెలిపారు. సంక్రాంతి పండుగ సందర్భంగా సంక్రాంతి పండుగ సందర్భంగా సరికొత్త సినిమాలతో రామ్ సినిమాస్ నగర వాసులను అలరించునుందని తెలిపారు. రామ్ సినిమాస్ రెండు స్క్రీన్ లతో, డిజిటల్ సౌండ్ సిస్టం ఏర్పాటుచేసినట్లు తెలిపారు. గత 48 సంత్సరాలుగా విజయవాడలో రాంగోపాల్ థియేటర్ గా అల్లరించ్చిందని ఇక నుండి రామ్ సినిమాస్ గా అందరి ముందుకు వస్తుందని అన్నారు. థియేటర్ లో విశాలామైన కార్ పార్కింగ్ తో పాటు, స్కూటర్ పార్కింగ్ కూడా ఉందని అన్నారు. టికెట్స్ థియేటర్ తో పాటు బుక్ మై షో ద్వారా ఆన్ లైన్ ద్వారా బుక్ చేసుకోవచ్చని తెలిపారు.
అనంతరం తెలుగు చలనచిత్ర నిర్మాతల మండలి అధ్యక్షులు కేఎల్ దామోదర్ ప్రసాద్ మాట్లాడుతూ రాష్ట్రంలో సింగిల్ స్క్రీన్స్ థియేటర్స్ ను కాపాడుకోవడమే నిర్మాతల లక్ష్యమని తెలిపారు. సామాన్య ప్రేక్షకులకు సింగిల్ స్క్రీన్ ద్వారా సినిమాలను తక్కువకే అందిస్తామని వివరించారు.
ఈ విలేకరుల సమావేశంలో యలమంచిలి రాహుల్, యలమంచిలిరోహన్ తదితరులు పాల్గొన్నారు.
Tags vijayawada
Check Also
ఆకాంక్షిత బ్లాక్ కార్యక్రమం (ఏబీపీ)పై అధికారులతో కలెక్టర్ డా. జి.లక్ష్మీశ
-పెనుగంచిప్రోలు ఇబ్రహీంపట్నం బ్లాక్ లను టాప్ టెన్ లో నిలపండి…. -హెల్త్ ,ఎడ్యుకేషన్, న్యూట్రిషన్ పై దృష్టి సారించండి….. -కలెక్టర్ …