విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
విజయవాడ నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయంలో గల కమాండ్ కంట్రోల్ రూమ్ వద్ద వడ్డే ఓబన్నకు ఘన నివాళులర్పించారు. శనివారం ఉదయం అడిషనల్ కమిషనర్ ప్రాజెక్ట్ డాక్టర్ డి చంద్రశేఖర్, వడ్డే ఓబన్న చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ భయం ఎరుగని వడ్డెర్లు, బోయలు మరియు చెంచులతో కూడిన సంచార తెగల సైన్యాన్ని, సమర్ధవంతంగా నడిపించి, దట్టమైన నల్లమల అడవుల్లో సైతం, కుంఫనీ సైన్యాన్ని ఊచకోత కోసి ఉరుకులు పెట్టించడంలో ముఖ్య పాత్ర పోషించిన వీరుడు మన వడ్డే ఓబన్న ది అన్నారు. జయంతి సందర్భంగా అటువంటి మహనీయులని గుర్తు చేసుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యతని తెలిపారు. ఈ కార్యక్రమంలో అకౌంట్ ఆఫీసర్ సత్యనారాయణ, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ వెంకటేశ్వర రెడ్డి, విఎంసి సిబ్బంది పాల్గొన్నారు.
Tags vijayawada
Check Also
ఆకాంక్షిత బ్లాక్ కార్యక్రమం (ఏబీపీ)పై అధికారులతో కలెక్టర్ డా. జి.లక్ష్మీశ
-పెనుగంచిప్రోలు ఇబ్రహీంపట్నం బ్లాక్ లను టాప్ టెన్ లో నిలపండి…. -హెల్త్ ,ఎడ్యుకేషన్, న్యూట్రిషన్ పై దృష్టి సారించండి….. -కలెక్టర్ …