-దక్షిణ మధ్య రైల్వేలో మొట్ట మొదటి మహిళా ప్రిన్సిపల్ చీఫ్ ఆపరేషన్స్ మేనేజర్
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
సికింద్రాబాద్‌లోని రైలు నిలయంలో దక్షిణ మధ్య రైల్వే ప్రిన్సిపల్ చీఫ్ ఆపరేషన్స్ మేనేజర్ ( పి. సి.ఓ.ఎం.) గా కె. పద్మజ ఈరోజు అనగా జనవరి 15, 2025న పదవి బాధ్యతలు స్వీకరించారు. వీరు ఇండియన్ రైల్వేస్ ట్రాఫిక్ సర్వీస్ 1991 బ్యాచ్‌కి చెందినవారు. వీరు బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ & బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్ లో పట్టభద్రులు. ఈ నియామకానికి ముందు వారు దక్షిణ మధ్య రైల్వే ప్రిన్సిపల్ చీఫ్ కమర్షియల్ మేనేజర్ (పి.సి.సి.ఎం) గా విధులను నిర్వర్తిస్తూ దక్షిణ మధ్య రైల్వే ప్రిన్సిపల్ చీఫ్ ఆపరేషన్స్ మేనేజర్ ( పి.సి.ఓ.ఎం.) గా అదనపు బాధ్యతలను కూడా నిర్వహిస్తున్నారు.
భారతీయ రైల్వేలో 30 సంవత్సరాలకు పైగా విశిష్టమైన కెరీర్‌లో కె. పద్మజ దక్షిణ మధ్య రైల్వేలో హైదరాబాద్ డివిజన్‌లో అసిస్టెంట్ కమర్షియల్ మేనేజర్; అసిస్టెంట్ ట్రాఫిక్ మేనేజర్ మరియు డివిజనల్ ఆపరేషన్స్ మేనేజర్ (కోల్ & గూడ్స్ ), సికింద్రాబాద్ డివిజన్; సీనియర్ డివిజనల్ సేఫ్టీ ఆఫీసర్ , గుంతకల్లు డివిజన్; డిప్యూటీ చీఫ్ కమర్షియల్ మేనేజర్, పి.ఆర్.ఎస్; సీనియర్ డివిజనల్ కమర్షియల్ మేనేజర్ మరియు సీనియర్ డివిజనల్ ఆపరేషన్స్ మేనేజర్, సికింద్రాబాద్ డివిజన్ లో పనిచేశారు. తదుపరి రైల్ నిలయం ప్రధాన కార్యాలయంలో వారు డిప్యూటీ చీఫ్ ఆపరేషన్స్ మేనేజర్/కోచింగ్; చీఫ్ ట్రాఫిక్ మేనేజర్, జనరల్; చీఫ్ ప్యాసింజర్ ట్రాఫిక్ మేనేజర్; చీఫ్ ఫ్రైట్ ట్రాఫిక్ మేనేజర్ మరియు చీఫ్ కమర్షియల్ మేనేజర్, ప్యాసింజర్ సర్వీసెస్ వంటి అనేక ఇతర కీలక పదవులు నిర్వహించారు.
వారు తన సుదీర్ఘ ఉద్యోగ ప్రస్థానంలో, సలహాదారు (రవాణా)/గోదావరి ఫెర్టిలైజర్స్ కంపెనీ లిమిటెడ్ మరియు జనరల్ మేనేజర్, కాంకర్, హైదరాబాద్‌గా కూడా పనిచేశారు. అంతేకాకుండా వారు అదనంగా దక్షిణ మధ్య రైల్వే భారత్ స్కౌట్స్& గైడ్స్ కు రాష్ట్ర కమీషనర్, కార్యదర్శి, హ్యాండ్‌బాల్, దక్షిణ మధ్య రైల్వే స్పోర్ట్ అసోసియేషన్, ప్రెసిడెంట్; దక్షిణ మధ్య రైల్వే లలిత కళా సమితి , సికింద్రాబాద్ ప్రెసిడెంట్ మరియు దక్షిణ మధ్య రైల్వే ఆఫీసర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గా కూడా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
జూలై, 2024 నుండి ప్రిన్సిపల్ చీఫ్ కమర్షియల్ మేనేజర్ (పి.సి.సి.ఏం)గా ఆమె పదవీకాలంలో, పద్మజ ప్రయాణీకుల మరియు సరకు రవాణా సేవలను సమర్థవంతంగా నిర్వహించడం ద్వారా రైలు వినియోగదార్ల సంతృప్తి మరియు ఆదాయాన్ని పొందేలా పద్మజ పర్యవేక్షించారు.