అర్జీదారులకు ఆపన్న హస్తం అందించి మరోసారి మానవత్వం చాటుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు

-ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి 11 మందికి సుమారు రూ. 34.50 లక్షల ఆర్థిక సాయం చెక్కులను పలువురు అర్జీదారులకు అంచచేసిన జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ మరియు ఎంఎల్ఏ పులివార్తి నాని
-ఆపన్న హస్తం అందించి తమను ఆదుకున్నందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కు మనస్పూర్తిగా కృతఙ్ఞతలు తెలుపుతూ చల్లగా ఉండాలని మనసారా దీవించిన పలువురు అర్జీదారులు

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
ముఖ్యమంత్రి చంద్రగిరి మండలం నారావారిపల్లెకి తన స్వంత గ్రామానికి సంక్రాంతికి విచ్చేసిన సమయంలో తనను కలిసిన పలువురు అర్జీదారుల సమస్యలను సావధానంగా విని ఆపన్న హస్తం అందిస్తూ 24 గంటల పని దినాల సమయంలోపు 11 మందికి చంద్రగిరి, రామచంద్రపురం, తిరుపతి రూరల్, పులిచెర్ల దొరవారి సత్రం మండలాలకు చెందిన వారికి సుమారు రూ. 34.50 లక్షల ఆర్థిక సాయం ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి అందించి తమ మానవత్వాన్ని మరోసారి చాటుకున్నారు. పలువురు అర్జీదారులు ఎంతో మంచి హృదయంతో వారిని ఆదుకున్న ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలుపుతూ ముఖ్యమంత్రి చల్లగా ఉండాలని దీవించారు. చెక్కులను జిల్లా కలెక్టరేట్ తిరుపతి నందు జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ మరియు చంద్రగిరి శాసనసభ్యులు పులివర్తి నాని, జె.సి. శుభం బన్సల్ తో కలిసి అర్జీదారులకు అందజేశారు.

లబ్దిదారుల స్పందన
నా పేరు కె. లావణ్య w/o జగదీశ్వర్ రెడ్డి, మాది రామచంద్రాపురం మండలం, సి.రామాపురం గ్రామం నా కుమారుడు కె. అశ్విక్ రెడ్డికి 13 నెలలు, వెన్నెముక సమస్య ఉన్నందున అనేక ఆసుపత్రులకు తిరిగి వైద్యం చేయించడానికి చాలా ఖర్చు అయ్యింది. ఆర్థికంగా చాలా ఇబ్బందులుపడ్డాము. రాష్ట్ర ముఖ్యమంత్రి గారు నారావారిపల్లికి వచ్చిన సందర్బంగా మేము అక్కడికి వెళ్లి మా సమస్యను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లగా వారు వెంటనే స్పదించి మాకు సిఎం రిలీఫ్ ఫండ్ క్రింద 3 లక్షలు మంజూరు చేసారని, మాకు తక్షణ సహాయం చేసిన ముఖ్యమంత్రి గారికి మా ధన్యవాదాలు.

చంద్రగిరి మండలం ఐతేపల్లి గ్రామానికి చెందిన ఎ. పట్టాభి రెడ్డి మాట్లాడుతూ నేను పెరాలసిస్ సమస్యతో ఇబ్బంది పడుతున్నాను. ఆసుపత్రికి మందుల ఖర్చులకు చాలా ఖర్చు అయ్యేది నా సమస్యను ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లగా ఆయన స్పందించి సిఎం రిలీఫ్ ఫండ్ క్రింద ఒక లక్ష రూపాయలు మంజూరు చేసినందుకు ముఖ్యమంత్రి గారికి నా కృతజ్ఞతలు.

నా పేరు నాగరత్నమ్మ మాది చంద్రగిరి మండలం, నారావారి పల్లి గ్రామం నా భర్త అనారోగ్యంతో ఇబ్బంది పడుతున్నారు మరియు మా ఇల్లు శిథిలావస్థలో ఉన్నదని ఆర్ధిక స్తోమత లేనందున ఇబ్బందులు పడుతున్నామని, ముఖ్యమంత్రి గారు నారావారిపల్లికి వచ్చారని తెలిసి ఆయన దృష్టికి తీసుకెళ్ళి కలవగా ఆయన తక్షణమే స్పందించి నా భర్త మందులకు, ఇంటి మరమ్మతులకు సిఎం రిలీఫ్ ఫండ్ క్రింద రెండు లక్షలు మంజూరు చేసారని, మాకు ఆర్ధిక సహాయం చేసిన ముఖ్యమంత్రికి మనసార ధన్యవాదాలు తెలుపుతూ ఎప్పటికీ ముఖ్యమంత్రిగా చంద్రబాబు ఉండాలని కోరుకుంటూ ధన్యవాదాలు తెలిపారు.

చంద్రగిరి మండలం ఎ రంగంపేట గ్రామానికి చెందిన సందీప్ రెడ్డి మాట్లాడుతూ నాకు షుగర్ సమస్య ఉన్నందున కాలు సెప్టిక్ అయ్యి ఆపరేషన్ చేసారు. మందులకు చాల ఖర్చులు అవుతున్నాయి. ఆర్ధిక స్థోమత లేక సంపాదించడానికి ఎలాంటి ఆస్కారం లేక చాల ఇబ్బంది పడుతున్నాను. సంక్రాంతికి ముఖ్యమంత్రి గారు నారవారిపల్లికి వచ్చినప్పుడు నేను ఆయనను కలిసి నా సమస్యను తెలియజేయగా ఆయన తక్షణమే నాకు ఆర్ధిక సహాయం క్రింది 3లక్షలు మంజూరు చేసారు. మాకు అండగా ఉంటూ సహాయం చేసి ఆదుకున్న ముఖ్యమంత్రి గారికి నా కృతజ్ఞతలు.

నా పేరు ఆర్. రాధా కృష్ణయ్య, మాది తిరుపతి రూరల్ మండలం తిరుచానూరు పంచాయతీ. నేను క్యాన్సర్ సమస్యతో భాధ పడుతున్నాను. ఆసుపత్రి చికిత్స మరియు మందులకు చాల ఖర్చు అవుతుంది. నా సమస్యను రాష్ట్ర ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లగా ఆయన స్పందించి సిఎం రిలీఫ్ ఫండ్ క్రింద 5లక్షలు మంజూరు చేసారు. మాకు ఆర్థిక సహాయం చేసి ఆదుకుని అండగా ఉన్నందుకు ముఖ్యమంత్రి గారికి మేము ఎల్లప్పుడూ రుణపడి ఉంటాను.

చంద్రగిరి మండలం, కందులవారిపల్లి గ్రామానికి చెందిన వాసుదేవనాయుడు మాట్లాడుతూ నాకు బ్రెయిన్ ట్యూమర్ సర్జరీ చేసియున్నారు. సర్జరీకి చాలా ఖర్చు అయింది. ఆర్ధిక పరంగా ఇబ్బందులు పడుతున్నాము. రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని కలిసి మా సమస్యను ఆయనకు విన్నవించుకోగా ఆయన తక్షణమే స్పందించి సిఎం రిలీఫ్ ఫండ్ క్రింద 4 లక్షలు మంజూరు చేసారు. ఆర్థికంగా ఆదుకున్న ముఖ్యమంత్రికి నా కృతజ్ఞతలు.

నా పేరు శారద మాది చంద్రగిరి మండలం, పనపాకం పంచాయతీ కందులవారిపల్లి గ్రామం నా భర్త సుబ్రహ్మణ్యం లివర్ కాన్సర్ తో భాదపడుతున్నారు. రోజూ కూలీ పనులు చేసుకునే పేదవారమైనందున ఆసుపత్రి ఖర్చులకు, మందులకు డబ్బులు సరిపోనందున ముఖ్య మంత్రి గారి సహాయార్థం ఆయనకు మా సమస్యను విన్నవించుకున్నాము, వారు వెంటనే స్పందించి సిఎం రిలీఫ్ ఫండ్ క్రింద మాకు ఆర్ధిక సహాయంగా 4 లక్షలు మంజూరు చేసారు. ఆయన మేలు ఎన్నటికీ మర్చిపోలేము.

చంద్రగిరి మండలం కందులవారిపల్లె గ్రామానికి చెందిన దామోదర్ నాయుడు ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నానని ముఖ్యమంత్రి గారిని కలిసి వివరించగా వారు వెంటనే స్పందించి రెండు లక్షల రూపాయల ఆర్థిక సాయం అందించినందుకు ముఖ్యమంత్రి చంద్రబాబుకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు.

చంద్రగిరి మండలం, మామండూరు గ్రామానికి చెందిన ఆదిలక్ష్మి మాట్లాడుతూ నా కుమారుడు గుణశేఖర్ నాయుడుకి ప్రమాదం జరిగి తలకు దెబ్బ తగిలి బ్రెయిన్ సర్జరీ చేసారు. కుమారుడు పూర్తి పడకపైనే ఉండడం వలన ఎలాంటి ఆదాయం లేదు. మాకు వయసు పైబడిందని, కుటుంబ పోషణ, ఆసుపత్రి ఖర్చులు భరించలేక ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నామని, ముఖ్యమంత్రి నారావారిపల్లి పర్యటన సందర్బంగా ఆయనను కలిసి మా పరిస్థితి తెలపగా ఆయన తక్షణమే స్పందించి సిఎం రిలీఫ్ ఫండ్ ద్వారా 2 లక్షలు మంజూరు చేసారు. మమ్మల్ని ఆదుకున్న ముఖ్యమంత్రికి ధన్యవాదాలు.
నా పేరు మనోరంజని, మాది చిత్తూరు జిల్లా, పులిచెర్ల మండలం, కమ్మపల్లి గ్రామం నేను గుండె సంబందిత వ్యాధితో బాదపడుతున్నారు. ఆసుపత్రి ఖర్చులకు, మందులకు ఇబ్బందిగా ఉన్నందు ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెల్లాము ఆయన తక్షణమే స్పందించి సిఎం రిలీఫ్ ఫండ్ ద్వారా రూ.3.5 లక్షలు ఆర్ధిక సహాయం అందించిన ముఖ్యమంత్రి గారికి మా ధన్యవాదాలు.

నా పేరు వి. అరుణ, మాది దొరవారి సత్రం మండలం పూల తోట గ్రామం, నా భర్త వి.రమేష్ అనారోగ్యంతో మరణించారు. ఆసుపత్రికి దాదాపు 25లక్షలు ఖర్చు అయిందని, ఆర్థికంగా చాలా చితికిపోయాము. కుటుంబ పోషణ కూడా చాలా ఇబ్బందిగా ఉన్నదని మా సమస్యను ముఖ్యమంత్రి గారికి తెలియజేయగా వారు వెంటనే స్పందించి మెడికల్ బిల్ల్స్ రీయంబర్స్మెంట్ ద్వారా 5 లక్షలు మంజూరు చేసారు. సహాయం చేసి మమ్మల్ని ఆదుకుని ఆపన్న హస్తం అందించిన ముఖ్యమంత్రి గారికి ఎల్లప్పుడూ రుణపడి ఉంటాము.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

పరిసరాల పరిశుభ్రత మనఅందరి బాధ్యత..పరిశుభ్రతతోనే ఆరోగ్యం…

-పత్రి ఒక్కరిలో స్వచ్ఛత పై అవగాహన కలిగించాలి.. -స్వచ్ఛత-శుభ్రత పై ప్రజలు నైతిక బాధ్యత వహించాలి.. -మురుగు కాలువగట్లపై చెత్తను …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *