రెవిన్యూ సేవలు అందించే క్రమంలో జవాబుదారీతనం కలిగి ఉండేలా చూసుకోవాలి…

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
రెవిన్యూ సేవలు అందించే క్రమంలో జవాబుదారీతనం కలిగి ఉండేలా చూసుకోవాలనీ జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి ఆదేశించారు. శుక్రవారం స్ధానిక కలక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా రెవిన్యూ అధికారులతో జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి, జాయింట్ కలెక్టర్ ఎస్ చిన్న రాముడు, డి ఆర్వో టి సీతారామ మూర్తి, కలక్టరేట్ ఏ వో ఎమ్ డి. ఆలీ లతో కలిసి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ పి ప్రశాంతి మాట్లాడుతూ, ప్రజల నుంచి అర్జీలను స్వీకరించడం లో భాగంగా ఎక్కువ మొత్తంలో రెవిన్యూ పరమైన అంశాలపై అర్జీలను స్వీకరించడం, పరిష్కారం అయ్యే విధంగా చర్యలు చేపట్టాల్సింది ఉందన్నారు. వీటిలో ఎక్కువగా ఐదు కేటగురిలకి చెందిన అర్జీలు ఉన్నాయని వాటిలో మ్యుటేషన్లపై రెవెన్యూ ఫిర్యాదులు : 1079 , రెవెన్యూ రికార్డులలో నమోదుల ఆదాయ సవరణ-879 , ఎస్ ఎల్ ఏ సర్టిఫికేట్లు (రెవెన్యూ) 835, ఆర్ వో ఆర్
డేటాలో దిద్దుబాట్ల కోసం రెవెన్యూ అభ్యర్థన -334 , రెవెన్యూ ఉద్యోగుల సేవా సమస్యలు ఇంక్రిమెంట్ల మంజూరు/ప్రమోషన్ కోసం అభ్యర్థన/మెడికల్ రీయింబర్స్‌మెంట్ మంజూరు కోసం అభ్యర్థన – 319 ఉన్నాయని పేర్కొన్నారు. పలు అర్జీలు పరిష్కరం కొరకు తిరిగి తెరవడం జరిగిందని వాటిలో రెవెన్యూ రికార్డులలో రెవెన్యూ సవరణల నమోదులు-15 , ఉద్యోగులపై ఫిర్యాదుదారులు – 12 , సర్టిఫికెట్ల జారీ జాప్యం 7 ,సేకరించిన భూమికి పరిహారం చెల్లించకపోవడం-8 భూసేకరణపై చర్య -7 ఉన్నాయన్నారు. రెవిన్యూ డివిజన్ అధికారి ప్రతి రోజు కనీసం ఒకసారైనా తహసిల్దార్ వారీగా అర్జీల పరిష్కారం కోసం చేపడుతున్న చర్యలు పై సమీక్ష నిర్వహించాలన్నారు. సీఎంవో , మంత్రులు, రాష్ట్ర స్థాయి లో వస్తున్న అర్జీలను త్వరితగతిన పరిష్కరించే దిశగా చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. ప్రజా సమస్యల పరిష్కార విధానం లో రెవెన్యు అధికారులు పాత్ర కీలకం అన్నారు.

జాయింట్ కలెక్టర్ ఎస్ చిన్న రాముడు మాట్లాడుతూ, సమస్య పరిష్కారం కోసం వొచ్చే వారిలో ఎక్కువ మంది పెద్ద వారు రావడం జరుగుతుందని, వారితో ఆప్యాయత తో కూడి వ్యవహరించడం వల్ల సమస్య తీవ్రత తగ్గడం తో పాటు పరిపాలన యంత్రాగం పై గౌరవం కలిగే అవకాశం ఉంటుందన్నారు. సమస్య పరిష్కారం అవుతుందనే నమ్మకం కల్పించడం లో క్షేత్ర స్థాయిలో తహసీల్దార్లు వ్యవహరించే తీరు ముఖ్యం అన్నారు. ఆర్డీవో అధ్వర్యంలో మండల వారీగా ఫిర్యాదులు పరిష్కార విధానం పై ప్రత్యక్ష పర్యవేక్షణ ఉండాలని స్పష్టం చేశారు.

ఈ సమావేశం లో జిల్లా రెవిన్యూ అధికారి టి సీతారామ మూర్తి, ఆర్డీవో లు ఆర్ కృష్ణ నాయక్ , రాణి సుస్మిత, ఏవో ఆలీ, తహశీల్దార్లు, కలక్టరేట్ సిబ్బంది పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

పరిసరాల పరిశుభ్రత మనఅందరి బాధ్యత..పరిశుభ్రతతోనే ఆరోగ్యం…

-పత్రి ఒక్కరిలో స్వచ్ఛత పై అవగాహన కలిగించాలి.. -స్వచ్ఛత-శుభ్రత పై ప్రజలు నైతిక బాధ్యత వహించాలి.. -మురుగు కాలువగట్లపై చెత్తను …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *