రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
శుక్రవారం తూర్పు గోదావరి 1 వ అధనపు జిల్లా న్యాయమూర్తి ఆర్.శివ కుమార్ జిల్లా కోర్టు ఆవరణలో అండర్ ట్రయిల్ రివ్యూ కమిటీ మీటింగ్ మరియు ఎగ్జిక్యూటివ్ కమిటీ మీటింగ్ నిర్వహించారు.
ఈ సమావేశంలో విచారణలో ఉన్న ఖైదీల కేసుల దర్యాప్తు, చార్జ్ షీట్ ఫైల్ చేసే విషయంలో పోలీసు అధికారులకు పలు సూచనలు చేశారు. బెయిలు/జామీనుల విషయంలో ఖైదీలు ఎదుర్కుంటున్న సమస్యలపై తీసుకోవాల్సిన చర్యలు గురించి చర్చించి, సంబంధిత అదికారులకు తగిన సిఫార్సులు చేశారు.
ఈ సమావేశంలో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి మరియు సీనియర్ సివిల్ న్యాయమూర్తి . కె. ప్రకాష్ బాబు గ, 1 వ అధనపు సీనియర్ సివిల్ న్యాయమూర్తి ఎస్.కె. జానీ బాష , తూర్పు గోదావరి జిల్లా అడిషనల్ ఎస్.పి ఏ.వి. సుబ్బరాజు, కాకినాడ జిల్లా అడిషనల్ ఎస్.పి ఎమ్.జె.వి.భాస్కర్ రావు , ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా రెవెన్యూ అధికారులు, ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా పోలీసు అధికారులు, సెంట్రల్ జైలు మరియు ప్రత్యేక మహిళా జైలు అధికారులు, తూర్పు గోదావరి జిల్లా చీఫ్ లీగల్ అయిడ్ డిఫెన్స్ కౌన్సెల్ జె.మహేశ్ తదితరులు పాల్గొన్నారు.