విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఎపి గవర్నమెంట్ ఐ.టి.ఐ.ఎస్ అండ్ డి.ఎల్.టి.సి.ఎస్ స్టాఫ్ అసోసియేషన్ క్యాలెండర్ ను శుక్రవారం గురునానక్ కాలనీలోని విజయవాడ పార్లమెంట్ కార్యాలయం ఎన్టీఆర్ భవన్ లో ఎంపి కేశినేని శివనాథ్ ఆవిష్కరించారు. ఎన్టీఆర్ జిల్లాలో ఐ.టి.ఐ కాలేజీలు మరిన్ని ఏర్పాటు చేయాలని స్టేట్ ప్రెసిడెంట్ పుట్టుగుంట రమేష్ బాబు ఆధ్వర్యంంలో అసోసియేషన్ నాయకులు ఎంపి కేశినేని శివనాథ్ ను కోరారు. ఎంపి కేశినేని శివనాథ్ సానుకూలంగా స్పందించారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ స్టేట్ వైస్ ప్రెసిడెంట్ ఎమ్.రామారావు, జాయింట్ సెక్రటరీ సతీష్, హరికృష్ణ, సిటీ ప్రెసిడెంట్ మాగంటి రమేష్ బాబు, ఎన్.జి.వో సెక్రటరీ నాగార్జున, కాంట్రాక్ట్ స్టాఫ్ అసోసియేషన్ ప్రెసిడెంట్ కిషోర్ బాబులతో పాటు అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు.
Tags vijayawada
Check Also
పరిసరాల పరిశుభ్రత మనఅందరి బాధ్యత..పరిశుభ్రతతోనే ఆరోగ్యం…
-పత్రి ఒక్కరిలో స్వచ్ఛత పై అవగాహన కలిగించాలి.. -స్వచ్ఛత-శుభ్రత పై ప్రజలు నైతిక బాధ్యత వహించాలి.. -మురుగు కాలువగట్లపై చెత్తను …