విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
భారతదేశ అత్యున్నత న్యాయస్థానం (పంజాబ్ రాష్ట్రం & ఇతరులు Vs దేవిందర్ సింగ్ & ఇతరులు (సివిల్ అప్పీల్ నం. 2317 ఆఫ్ 2011 మరియు డబ్ల్యు.పి.సి. నం. 562 ఆఫ్ 2022) తేదీ: 01.08.2024 న వెలువరించిన తీర్పు ననుసరించి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం షెడ్యూల్డ్ కులాలలోని ఉప- వర్గీకరణపై విచారణ చేయడానికి, రాజీవ్ రంజన్ మిశ్రా, ఐ.ఏ.ఎస్., (రిటైర్డ్) నేతృత్వంలో ఏకసభ్య కమిషన్ ను నియమించబడినది.
సదరు ,ఏకసభ్య కమిషన్ ది.20.01.2025 వ తేదీన అనంతపురము మరియు ది.21.01.2025 వ తేదీన చిత్తూరు జిల్లాలలో పర్యటించెదరు. పర్యటనలో భాగంగా ఆయా పూర్వపు (erstwhile) జిల్లా హెడ్ క్వార్టర్స్ నందు ఏర్పాటు చేయబడిన సమావేశములందు షెడ్యూల్డ్ కులాలలోని ఉపకులాల వర్గీకరణకు సంబంధించిన అంశంపై, సంబంధిత పూర్వపు (erstwhile) జిల్లాకు మరియు అట్టి జిల్లా నుండి నూతనముగా ఏర్పడిన జిల్లా(ల)కు చెందిన వ్యక్తుల/సంస్థల నుండి కమిషన్ నేరుగా మెమోరాండం/ విజ్ఞప్తులును స్వీకరించెదరని తెలియచేయడమైనది.
Tags vijayawada
Check Also
పరిసరాల పరిశుభ్రత మనఅందరి బాధ్యత..పరిశుభ్రతతోనే ఆరోగ్యం…
-పత్రి ఒక్కరిలో స్వచ్ఛత పై అవగాహన కలిగించాలి.. -స్వచ్ఛత-శుభ్రత పై ప్రజలు నైతిక బాధ్యత వహించాలి.. -మురుగు కాలువగట్లపై చెత్తను …