సూర్యఘర్ కనెక్షన్ల మంజూరులో జిల్లాను అగ్రగామిగా నిలుపుదాం…

-జిల్లాలో రెండు లక్షల గృహాలకు సూర్యఘర్ వెలుగుల లక్ష్యం….
-సూర్య ఘ‌ర్‌ రిజిస్ట్రేషన్ లక్ష్యాలను వారంలోపు పూర్తి చేయండి….
-ల‌క్ష్య సాధ‌న‌లో పొదుపు సంఘాల మ‌హిళల భాగ‌స్వామ్యం కీలకం….
-జిల్లా క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ‌

విజ‌య‌వాడ, నేటి పత్రిక ప్రజావార్త :
జిల్లాలో ప్ర‌తి ఇంటా సూర్య‌ఘ‌ర్‌ వెలుగులను నింపాలని ఉద్దేశంతో రెండు లక్షలా సోలార్ విద్యుత్ కనెక్షన్లు అందించేందుకు రిజిస్ట్రేషన్ ప్రక్రియను వారంరోజులలోపు పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని జిల్లా క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ సంబంధిత అధికారులను ఆదేశించారు.

ప్రధానమంత్రి సూర్యఘర్ పధకం ద్వారా సౌర విద్యుత్ కనెక్షన్ల రిజిస్ట్రేషన్ ప్రక్రియపై శుక్రవారం జిల్లా కలెక్టర్ డా. జి.ల‌క్ష్మీశ కలెక్టరేట్ లోని ఆయన కార్యాలయం నుండి సంబంధిత అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కాన్ఫరెన్స్ ద్వారా కలెక్టర్ మాట్లాడుతూ సూర్య‌ఘ‌ర్ ప‌థ‌కం ద్వారా జిల్లాలో రెండు లక్షల గృహాలకు సౌర విద్యుత్ కనెక్షన్లు అందించాలనే లక్ష్యంగా నిర్దేశించడం జరిగిందన్నారు. ఇందుకు సంబంధించి ఇప్పటివరకు 45 వేల మంది సౌర విద్యుత్ కనెక్షన్ కొరకు పేర్లను నమోదు చేసుకోవడం జరిగిందన్నారు. ఇందులో 35 వేలు గ్రామీణ ప్రాంతంలో, 10 వేలు పట్టణ ప్రాంతంలో ఉన్నాయన్నారు. పట్టణ ప్రాంతాలలో రిజిస్ట్రేషన్ ప్రక్రియను మరింత వేగవంతం చేసేలా మున్సిపల్ అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. ప్రభుత్వం అధిక రాయితినిచ్చి త‌క్కువ పెట్టుబ‌డితో ఉచితంగా సౌర విద్యుత్‌ను పొందవచ్చునన్నా విషయాన్ని ప్రజలకు వివరించి లక్ష్య సాధనకు చర్యలు తీసుకోవాలన్నారు. రూ. 2 ల‌క్ష‌ల విలువైన 3 కేడ‌బ్ల్యూ సోలార్ ప్యానెల్‌ కొరకు ఓసీ, బీసీ వర్గాలకు చెందిన స్వయం సహాయక బృందాలు రూ. 78 వేల రాయితీతో ఇంటి పైక‌ప్పుపై ఏర్పాటు చేసుకోవ‌చ్చ‌న్నారు. రూ. 20 వేలు ల‌బ్ధిదారు వాటాపోను మిగిలిన మొత్తాన్ని త‌క్కువ వ‌డ్డీతో బ్యాంకులు రుణంగా మంజూరు చేసేందుకు సిద్ధంగా ఉన్నాయన్నారు. ఎస్సీ, ఎస్టీ వర్గాల వారికీ పూర్తి రాయితీతో సౌర విద్యుత్ కనెక్షన్స్ పొందే అవకాశం ఉందన్నారు. లక్ష్య సాధనలో స్వయం స‌హాయ‌క సంఘాల మ‌హిళలు, ప్రభుత్వ ఉద్యోగులు భాగ‌స్వామ్యం కీలకమన్నారు. వారంరోజులలోపు లక్ష్యసాధనకు చర్యలు తీసుకోవాలని అధికార యంత్రాంగం ప‌రంగా అన్ని విధాలా స‌హాయ‌స‌హ‌కారాలు అందించేందుకు సిద్ధంగా ఉన్నామ‌న్నారు. సొంత ఇల్లు ఉండి, క‌రెంట్ క‌నెక్ష‌న్ ఉన్న‌వారెవ‌రైనా www.pmsuryaghar.gov.in ద్వారా సుల‌భంగా రిజిస్ట్రేష‌న్ చేయించుకోవ‌చ్చ‌ని.. స‌మీప స‌చివాల‌యం లేదా విద్యుత్ కార్యాల‌యం వంటివాటిని సంప్ర‌దించి కూడా వారి స‌హాయంతో రిజిస్ట్రేష‌న్ చేసుకొనేలా ప్రజలలో చైతన్యం తీసుకురావాలని క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ సంబంధిత అధికారులను ఆదేశించారు.

వీడియో కాన్ఫరెన్స్ లో డీఆర్‌డీఏ జిల్లా ప్రాజెక్ట్ డైరెక్టర్ కె. శ్రీనివాసరావు, జిల్లా విద్యుత్ శాఖ ఎస్ఈ ఎ.ముర‌ళీమోహ‌న్‌, జిల్లాకు మున్సిపల్ కమిషనర్లు, మున్సిపల్ విద్యుత్ శాఖలకు చెందిన అధికారులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

పరిసరాల పరిశుభ్రత మనఅందరి బాధ్యత..పరిశుభ్రతతోనే ఆరోగ్యం…

-పత్రి ఒక్కరిలో స్వచ్ఛత పై అవగాహన కలిగించాలి.. -స్వచ్ఛత-శుభ్రత పై ప్రజలు నైతిక బాధ్యత వహించాలి.. -మురుగు కాలువగట్లపై చెత్తను …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *