-స్వచ్ఛ ఆంధ్ర – స్వచ్ఛ్ దివస్ ద్వారా పరిసరాల పరిశుభ్రత..
-పచ్చదనం` పరిశుభ్రత జిల్లాగా తీర్చిదిద్దుదాం.
-జిల్లా కలెక్టర్ డా. జి. లక్ష్మీశ
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రజల భాగస్వామ్యంతో స్వచ్ఛ ఆంధ్ర – స్వచ్ఛ్ దివస్ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం ద్వారా జిల్లాను పచ్చదనం` పరిశుభ్రతలో అగ్రగామిగా నిలిపేందుకు అధికారులు కృషి చేయాలని జిల్లా కలెక్టర్ డా. జి. లక్ష్మీశ కోరారు.
జిల్లాలో స్వచ్చఆంధ్ర – స్వచ్ఛ్ దివస్ కార్యక్రమం అమలు పై జిల్లా కలెక్టర్ లక్ష్మీశ శుక్రవారం సంబంధిత అధికారులతో కలెక్టరేట్ నుండి వీడియోకాన్ఫరెన్స్ నిర్వహించారు. కాన్ఫరెన్స్ ద్వారా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వ సూచనల మేరకు ప్రతి నెలా ప్రతి మూడవ శనివారం స్వచ్ఛ ఆంధ్ర – స్వచ్ఛ్ దివస్‌గా పాటించాలని నిర్ణయించిన్నట్లు తెలిపారు. థీమ్‌జి జనవరి, 2025 ‘‘కొత్త సంవత్సరం-క్లీన్ స్టార్ట్’’ ప్రారంభించడం జరిగిందన్నారు. ఇందులో భాగంగా ‘‘దైవభక్తి పక్కన పరిశుభ్రత’’ నినాదంతో ప్రతి ఒక్కరిని పరిసరాల పరిశుభ్రతలో భాగస్వాములు చేసి బహిరంగంగా చెత్తవేసే అలవాటును అరికట్టడంతో పాటు మాస్ క్లీనింగ్ డ్రైవ్‌ల ద్వారా చెత్త, ముల్లపొదల వంటివి తొలగింపు, పరిశాలను శుభ్రపరచడం శిధిలాల తొలగింపు, బహిరంగ ప్రదేశాలు, బస్టాప్‌లు, మొదలైన వాటిలో మూసుకుపోయిన కాలువలను డ్రైయిన్‌లలో పూడిక తీయడం కమ్యూనిటీ మరియు పబ్లిక్ టాయిలెట్లను శానిటైజ్ చేయండి వంటి చర్యలు తీసుకోవాలన్నారు. పరిసరాల పరిశుభ్రతను పాటిస్తానని ప్రతిజ్ఞ తీసుకుని ప్రజలలో అవగాహన కల్పించాలన్నారు. స్వచ్చఆంధ్ర ` స్వచ్ఛ్ దివస్ కార్యక్రమాలు ఎప్పటికప్పుడు సోషల్ మీడియా, ప్రసార మాధ్యమాల ద్వారా ప్రచారం చేయాలన్నారు. జిల్లాలో స్వచ్ఛ ఆంధ్ర `స్వచ్ఛ దివస్‌లో భాగంగా గ్రామ, మండల పంచాయతీ స్థాయి అధికారులు తొలగించిన చెత్త రవాణాకు వాహనాలు అవసరమైన యంత్రాలు దాతల సహకారంతో సమకూర్చుకునేలా కృషి చేయాలన్నారు. అవసరమైతే మండలంలోని ఇతర గ్రామ పంచాయితీలకు చెందిన పారిశుధ్య సిబ్బందిని చెత్త కుప్పల తొలగింపు కోసం వినియోగించుకోవాలన్నారు. మిశ్రమ వ్యర్థాలు కలిగిన చెత్త నుండి ఆ ప్రదేశంలో తడి పొడి చెత్తను వేరు చేసి పెద్దమొత్తంలో కొనుగోలు చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. పారిశుధ్య పని ప్రారంభించే ముందు మరియు పని సమయంలోను చెత్తను తొలగించిన అనంతరం 8 కోణాల నుండి ఫోటోలు తీసి జిల్లా అధికారులకు సమర్పించాలని కలెక్టర్ తెలిపారు.
స్వచ్ఛ ఆంధ్ర – స్వచ్ఛ్ దివస్ కార్యక్రమాన్ని అన్ని ప్రభుత్వ ప్రైవేట్ కార్యాలయాలు ప్రాంగణాలలో నిర్వహించి పచ్చదనం పరిశుభ్రతలో అధిక ప్రాధాన్యతనిచ్చేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ లక్ష్మీశ అధికారులను ఆదేశించారు.
వీడియోకాన్ఫరెన్స్‌లో డిఆర్‌వో ఎం.లక్ష్మి నరసింహ, డిఆర్‌డిఏ పిడి కె. శ్రీనివాసరావు, డిపివో లావణ్య, డియంఅండ్ హెచ్‌వో యం. సుహాసిని, డ్వామా పిడి ఎ. రాము, డిఎస్‌వో పాపరావు, ఇండ్రస్టీస్ జనరల్ మేనేజర్ సాంబశివరావు, జిల్లాకు చెందిన మున్సిపల్ కమీషనర్లు, మండల అభివృద్ధి అధికారులు పాల్గొన్నారు.