– పీపీపీ ప్రజా ప్రతినిధులు, ప్రజల ,అధికారుల భాగస్వామ్యం తోనే సాధ్యం
-నిరంతరం పారిశుధ్య నిర్వహణలో ప్రత్యక్షంగా భాగస్వామ్యం కావాలి
– జిల్లా కలెక్టర్ పి. ప్రశాంతి
-ఎమ్మేల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి
రాజమహేంద్రవరం రూరల్, నేటి పత్రిక ప్రజావార్త :
స్వచ్ఛ ఆంధ్ర – స్వచ్ఛ్ దివస్ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం లో భాగంగా 12 నెలల కార్యాచరణ ప్రణాళిక రూపొందించడం జరిగిందనీ జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి, ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి పేర్కొన్నారు.
శనివారము సాయంత్రం స్థానిక బొమ్మూరు రూరల్ రాజీవ్ కాలనీ లో స్వచ్ఛ ఆంధ్ర – స్వచ్ఛ్ దివస్ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ పి. ప్రశాంతి , రాజమండ్రీ రూరల్ శాసనసభ్యులు గోరంట్ల బుచ్చయ్య చౌదరి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ పి. ప్రశాంతి మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పరిసరాల పరిశుభ్రత, మనం నివసించే, తిరిగే ప్రాంతాలలో శానిటేషన్ కార్యక్రమాల రూపకల్పన చేస్తున్నట్లు తెలిపారు. అందులో భాగంగానే జిల్లా స్థాయి స్వచ్ఛ ఆంధ్ర – స్వచ్ఛ్ దివస్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగిందన్నారు. ప్రభుత్వం సూచనల మేరకు ప్రతి నెలా ప్రతి మూడవ శనివారం స్వచ్ఛ ఆంధ్ర – స్వచ్ఛ్ దివస్‌గా పాటించనున్నట్లు, ఆఫ్ స్ఫూర్తి నెల రోజుల పాటు చెయ్యట్టనున్నట్లు పేర్కొన్నారు.ఈ నెల థీమ్ లో భాగంగా జనవరి, 2025 ‘కొత్త సంవత్సరం- క్లీన్ స్టార్ట్’’ ప్రారంభించడం జరిగిందన్నారు.
మిశ్రమ వ్యర్థాలు కలిగిన చెత్త నుండి ఆ ప్రదేశంలో తడి పొడి చెత్తను వేరు ఆదాయ వనరుగా అభివృద్ది కోసం అడుగులు వేయాలని పేర్కొన్నారు. ప్రజల్లో చైతన్యం కలిగించే విధంగా వ్యర్థ పదార్థాలతో రూపొందించిన ప్రాజెక్టు ప్రదర్శించాలని స్పష్టం చేశారు. వీటిని డాక్యుమెంటరీ ఫిల్మ్ చెయ్యాలని కలెక్టరు ఆదేశించారు.
శాసన సభ్యులు గోరంట్ల బుచ్చయ్య చౌదరిమాట్లాడుతూ, మనరాష్ట్ర ముఖ్యమంత్రి దశాబ్దాల క్రితమే విజనరీ తోకూడిప్రజలనిభాగస్వామ్యం చేస్తూ6, జన్మభూమి కార్యక్రమం చేపట్టినట్లు గుర్తు చేశారు. ‘‘దైవభక్తి పక్కన పరిశుభ్రత’’ నినాదంతో ప్రతి ఒక్కరిని పరిసరాల పరిశుభ్రతలో భాగస్వాములు చేసి బహిరంగంగా చెత్తవేసే అలవాటును అరికట్టడంతో పాటు సామూహిక క్లీనింగ్ డ్రైవ్‌ల ద్వారా చెత్త, చెదరం వంటివి తొలగింపు, పరిసరాల శుభ్రపరచడం శిధిలాల తొలగింపు, బహిరంగ ప్రదేశాలు, బస్టాప్‌లు, మొదలైన వాటిలో మూసుకుపోయిన కాలువలను డ్రైయిన్‌లలో పూడిక తీత పనులు చేపట్టడం ప్రజల్లో చైతన్యం కలిగించే కార్యక్రమాలు చేపట్టడంజరిగిందన్నారు. కమ్యూనిటీ మరియు పబ్లిక్ టాయిలెట్లను శానిటైజ్ చేయండి వంటి చర్యలు తీసుకోవాలన్నారు. పరిసరాల పరిశుభ్రతను పాటిస్తానని ప్రతిజ్ఞ తీసుకుని ఆచరణ సాధ్యం చెయ్యాలని విజ్ఞప్తి చేశారు. స్వచ్ఛ ఆంధ్ర – స్వచ్ఛ్ దివస్ కార్యక్రమాన్ని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాలు , పాఠశాలలలో, స్కూల్స్ ప్రాంగణాలలో నిర్వహించి పచ్చదనం పరిశుభ్రతలో అధిక ప్రాధాన్యతనిచ్చేలా చర్యలు తీసుకోవడంలో భాగంగా సామూహిక కార్యక్రమాన్ని చేపట్టినట్లు తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఇంఛార్జి జిల్లా గ్రామ పంచాయితీ అధికారి ఎమ్. నాగలత, ఎంపిడివో డి . శ్రీనివాస్ రావు, ధవళేశ్వరం సీ ఐ గణేష్, ఈ వో పీఆర్డి ఆర్మ్ స్ట్రాంగ్, ఇతర అధికారులు గ్రామ పంచాయతీ కార్యదర్శి, వి ఆర్వో, సచివాలయం సిబ్బంది, రాజీవ్ కాలనీ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.