-ఇప్పటికే క్షేత్ర స్థాయిలో గ్రామ సభల నిర్వహణా
-జిల్లా వ్యాప్తంగా 16 గ్రామాల్లో 130 బృందాల అధ్వర్యంలో 35,026 ఎకరాల్లో రీ సర్వే
-కలెక్టర్ పి ప్రశాంతి
నిడదవోలు, నేటి పత్రిక ప్రజావార్త :
గ్రామ సరిహద్దులు, ప్రభుత్వ భూములు గ్రామ కంఠం , రైతు, భూ యజమాని వారీగా ప్రవేటు భూముల గుర్తింపు, మ్యాపింగ్ విధానం పారదర్శకత తో రూపొందించాలని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి ఆదేశించారు.
శనివారం సాయంత్రం నిడదవోలు మండలం లో తాడిమళ్ళ గ్రామంలో రీ సర్వే పనులు, ఉనకర మిల్లి గ్రామంలో పల్లె పండుగ పనులను కలెక్టర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ పి ప్రశాంతి మాట్లాడుతూ , రాష్ట్ర ప్రభుత్వం భూముల రీ సర్వే పనులకు చెందిన
రీ సర్వే గ్రామాల్లో గ్రామ సభలు, బహిరంగ సభలు నిర్వహించి ఎటువంటి పొరపాట్లకు అవకాశం లేకుండా భూముల రికార్డులు రూపొందించాల్సి ఉందన్నారు.. ఇందుకు 120 రోజుల కార్యాచరణ ప్రణాళిక తో పాటు ఎస్ వో పి రూపొందించడం జరిగిందన్నారు. ఎటువంటి పొరపాట్లు దొర్లకుండా రికార్డులను సరిచేయాలన్నారు. జిల్లాలో ప్రతి మండలం నుంచి ఒక గ్రామం చొప్పున 16 గ్రామాల్లో రీ సర్వే పనులు చేపట్టడం జరుగుతున్నట్లు తెలిపారు. అన్ని రకాల భూసమస్యలపై విజ్ఞప్తులు స్వీకరించాలన్నారు. రీసర్వేతో నష్టపోయినట్లు రైతులెవరైనా ఫిర్యాదు చేస్తే క్షేత్రస్థాయిలో పరిశీలించి సమస్యను పరిష్కరించాలని ఆదేశించారు. రీసర్వేలో జరిగిన పొరపాట్లను గ్రామసభల ద్వారా సరి చేయాలన్నారు. గ్రామసభ నిర్వహణపై ముందుగా గ్రామంలో ప్రచారం చేసి, తహసీల్దార్, మండల సర్వేయర్, గ్రామస్థాయి సిబ్బంది తప్పనిసరిగా హాజరుకావాలన్నారు. జిల్లా వ్యాప్తంగా 16 గ్రామాల్లో 130 బృందాల అధ్వర్యంలో 35,026 ఎకరాల్లో రీ సర్వే పనులు చేపట్టడం జరిగిందన్నారు. తొలుత గ్రామ సరిహద్దులు, ప్రభుత్వ భూములు జనవరి 20 వరకూ చేపట్టాల్సి ఉందన్నారు. తదుపరి ప్రవేటు వ్యక్తుల భూములు గ్రౌండ్ ట్రూధింగ్, విస్తీర్ణం, రైతు వివరాలు , ప్రస్థుత భూ యజమాని, సర్వే, సెటిల్మెంట్ టైటిల్ డీడ్ వంటివి నిర్ధారణ చేయాలన్నారు. ఎక్సటెంట్ సరి చూసుకోవాలని, ప్రభుత్వ భూములు ఆక్రమణ జరగకుండా చూడాలని, చెరువులు, తదితర భూములను గుర్తించాలన్నారు. ఆర్ ఎస్ ఆర్, వన్ బి, రీ సర్వే రికార్డులు ఒకేలా ఉండాలనీ, ఈ విషయంలో ఎటువంటి అవకతవకలకు పాల్పడరాదని స్పష్టం చేశారు.
నిడదవోలు మండలంలో పల్లె పండుగ కింద రూ.409.93 కోట్లతో చేపట్టిన 83 పనులను పంచాయతీ రోడ్ల పనులను పరిశీలించిన ఉనకర మిల్లి గ్రామంలో పనులని ప్రారంభించడం జరిగింది.
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రహదారుల అభివృద్ధి పనులు చేపట్టడం ద్వారా గ్రామాల్లో రహదారుల అభివృద్ధి సాధ్యం అవుతున్నాయని పేర్కొన్నారు. గ్రామాలలో మౌలిక సదుపాయాలు కల్పించడం కోసం అత్యంత ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతోందని కలెక్టరు పేర్కొన్నారు
ఈ కార్యక్రమంలో కొవ్వూరు ఆర్డీవో రాణి సుస్మిత, డ్వామా పిడి ఏ నాగమహేశ్వరరావు, సర్వే & ల్యాండ్ రికార్డ్స్ సహాయ సంచాలకులు బి. లక్ష్మి నారాయణ, ఇన్స్పెక్ట ర్ ఆఫ్ సర్వేయర్ టి. వెంకటే శ్వరరావు, ఈ. ఈ, పంచాయ తీరాజ్ పి. రామ కృష్ణారెడ్డి, ఎంపిడిఓ డి లక్ష్మీనారాయణ,
డిఈ పంచాయతీరాజ్ కే రామ మోహన్ రావు, ఏఈలు కే భగవాన్ నారాయణ, ఎన్. ఏడుకొండలు, మండల సర్వే యర్, వి. నాగేంద్రబాబు తదితరులు పాల్గొన్నారు.