అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా కొద్దిసేపటి క్రితం విజయవాడకు చేరుకున్నారు. విమానాశ్రయం నుంచి నేరుగా ఉండవల్లిలోని ముఖ్యమంత్రి చంద్రబాబు నివాసానికి వెళ్లారు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అమిత్ షాకు ఘన స్వాగతం పలికారు. అనంతరం అమిత్ షాతో చంద్ర బాబు, పవన్ కళ్యాణ్ భేటీ అయ్యారు. అమిత్ షాకు ఉండవల్లి నివాసంలో సీఎం చంద్రబాబు విందు ఏర్పాటు చేశారు. విందుకు పురందేశ్వరి, పలువురు కూటమి నేతలు హాజరయ్యారు. విందు అనంతరం రాష్ట్రానికి సంబంధిం చిన పలు అంశాలపై చంద్రబాబు, అమిత్ షా చర్చించే అవకాశం ఉంది. రాత్రికి విజయవాడలోని ప్రైవేట్ హెూటల్లో బస చేయను న్న అమిత్ షా, నేడు జరగనున్న ఎన్డీఆర్ఎఫ్ వేడుకల్లో సీఎం చంద్రబాబుతో కలిసి పాల్గొంటారు. నేటి మధ్యాహ్నం గన్నవరం నుంచి తిరిగి అమిత్ షా ఢిల్లీ వెళ్లనున్నారు.
హృదయపూర్వక స్వాగతం
రాష్ట్రానికి వచ్చిన అమిత్ షాకు విమానాశ్రయంలోనే హృదయపూర్వక స్వాగతం పలికారు ఐటీ మంత్రి నారా లోకేష్, రాష్ట్ర విపత్తు నిర్వహణ బలోపేతానికి అమిత్ షా పర్యటన దోహద పడుతుందని ఈ సందర్భం గా వ్యాఖ్యానించారు. నేడు జరిగే ఎన్డీఆర్ఎఫ్ రైజింగ్ డే వేడుకల కోసం తానూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్టు మంత్రి నారా లోకేష్ వ్యాఖ్యానించారు. విమానాశ్రయంలో అమిత్ షాను పలువురు రాష్ట్ర మంత్రులూ కలిసి సాదర స్వాగతం పలికారు.