-పత్రి ఒక్కరిలో స్వచ్ఛత పై అవగాహన కలిగించాలి..
-స్వచ్ఛత-శుభ్రత పై ప్రజలు నైతిక బాధ్యత వహించాలి..
-మురుగు కాలువగట్లపై చెత్తను తొలగించిన రాష్ట్ర మంత్రి కొలుసు పార్ధసారధి..
-నూజివీడు పట్టణం లో స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర మంత్రి పార్ధసారధి..
ఏలూరు/నూజివీడు, నేటి పత్రిక ప్రజావార్త :
పరిశుభ్రత అనేది మన జీవితంలో భాగం కావాలని రాష్ట్ర గృహనిర్మాణ శాఖ, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్ధసారధి పిలుపునిచ్చారు. శనివారం నూజివీడు పట్టణంలో నిర్వహించిన స్వచ్ఛఆంధ్ర-స్వచ్ఛదివాస్ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి కొలుసు పార్ధసారధి పాల్గొన్నారు. ఈ సందర్బంగా రాజీవ్ సర్కిల్లో స్వచ్ఛ భారత్ లో పాల్గొని సుమారు గంట సేపు రహదారులను, మురుగు కాలువ గట్లను రాష్ట్ర మంత్రి కొలుసు పార్ధసారధి స్వయంగా శుభ్రపర్చారు. నూజివీడు రాజీవ్ సర్కిల్ కూడలిలో అధికారులు, సిబ్బంది, ప్రజలతో కలిసి మానవహారంలో పాల్గొని స్వచ్ఛఆంధ్ర-స్వచ్ఛ దివాస్ ప్రతిజ్ఞ ను రాష్ట్ర మంత్రి పార్ధసారధి చేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ స్వచ్ఛత శుభ్రత ప్రజల జీవన విధానం కావాలని, మనరాష్ట్రాన్ని స్వర్ణాంధ్రగా, స్వచ్ఛఅంధ్రగా తీర్చిదిద్దుకుందామని దీనిపై అందరిలో చైతన్యం రావాలని పిలుపునిచ్చారు, స్వచ్ఛత శుభ్రత పై భాద్యత వహించాలన్నారు,ఆంద్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న స్వచ్ఛఆంధ్ర-స్వచ్ఛ దివాస్ ప్రతి నెలా 3వ శనివారం క్రమం తప్పకుండా రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించుకోవడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో అందరి సహకారం, ప్రజల భాగస్వామ్యం ఎంతో అవసరమన్నారు. గతంలో గ్రామాల్లో చాలా పరిశుభ్రమైన గాలి, వాతావరణం ఉండేవని, క్రమేపి జనాభా పెరుగదల కారణంగా చెత్తపెరిగి ప్రజల ఆరోగ్యానికి విఘాతం కలిగిస్తున్న విషయం అందరికి తెలిసిందేనన్నారు. స్వర్ణాంధ్ర, స్వచ్ఛఆంధ్ర లక్ష్యాలను ఆయన వివరిస్తూ ఈ కార్యక్రమంలో భాగంగా ఇంటింటినుంచి నూరుశాతం చెత్తసేకరణ, చెత్తను నూరుశాతం తడిచెత్త, పొడిచెత్తగా వేరుచేయడం ఘనవ్యర్ధాలను నూరుశాతం శాస్ర్తీయంగా ప్రోసెస్ చేయడం తిరిగి ఉపయోగించగల వ్యర్ధాలను రీసైక్లింగ్ చేయడం నూరుశాతం ఓడిఎస్ ప్లేస్ ఆదర్శ గ్రామాలుగా ఉంచడమే మన లక్ష్యమన్నారు. ఈ లక్ష్యసాధనలో ప్రజలంతా ప్రభుత్వానికి సహకించాలన్నారు. మన పరిసరాలను మనం పరిశుభ్రంగా ఉంచుకోవాడం ద్వారా అందరూ ఆరోగ్యంగా జీవిస్తారని, స్వచ్ఛ ఆంధ్ర,స్వచ్ఛ దివాస్ పై మంచి ఆలోచన అందరిలో ప్రేరేపితం కావాలన్నారు. గత ప్రభుత్వం పారిశుధ్యంపై నిర్లక్ష్యం కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా 85 లక్షల మెట్రిక్ టన్నుల చెత్త పేరుకుపోయిందన్నారు. ఆ చెత్తను నేడు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు క్లీన్ చేయించి ప్రజలకు మంచి ఆరోగ్యకరమైన వాతావరణం కలిగించేందుకు నిర్మాణాత్మకమైన కార్యక్రమాలను చేపట్టారన్నారు. మన ప్రాంతాన్ని పరిశుభ్రంగా ఉంచుకోవడంతోపాటు రోడ్లపై, ముఖ్యకూడళ్లలో చెత్తవేయకుండా నియంత్రించడంలోకూడా ప్రజల భాగస్వామ్యం ఎంతైనా అవసరమన్నారు. ఇందుకు ప్రతి ఒక్కరూ స్వచ్ఛసేవకులు కావాలని ఆయన పిలుపునిచ్చారు. అదే విధంగా పారిశుధ్య నిర్వహణపై మున్సిపాలిటీ, పంచాయితీల్లో ప్రజలు తెలియజేసే సమస్యలను అధికారులు సత్వరమే పరిష్కరించాలని మంత్రి ఆదేశించారు. శానిటేషన్ విషయంలో అలసత్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవన్నారు, మరియు శానిటేషన్ పర్మినెంట్ వర్కర్స్ తరసుగా సెలవులు పెట్టి ఉద్యోగాన్ని నిర్లక్ష్యం చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు, ఇక నుండి పట్టణంలో ఏ ఒక్క వార్డులో కూడా చెత్త పేరుకుపోవడానికి వీలు లేదని అలా జరిగితే అందరి పై కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు, చెత్తను ఎప్పడికప్పుడు డంపింగ్ యార్డు కు తరలించాలన్నారు,ప్రజల ఆరోగ్యం కాపాడవలసిన బాధ్యత మున్సిపల్ శానిటేషన్ వర్కర్స్ పై ఉందన్నారు, రాజీవ్ సర్కిల్లో చెత్తను రోడ్డు ప్రక్కన నిల్వ ఉంచడంతో అధికారుల పై మండిపడి స్వయంగా సుమారు గంట సేపు శానిటేషన్ పని చేసి పరిసరాలను శుభ్రం చేసిన మంత్రి ఇక ఇలా జరగడానికి వీలులేదని అధికారులను హెచ్చరించిన మంత్రి,చేస్తున్న శానిటేషన్ పని పై ఇటు అధికారులు అటు ప్రజలు హర్షాన్ని ఆశ్చర్యాన్ని వ్యక్తం చేశారు.
కార్యక్రమంలో స్ధానిక ప్రజా ప్రతినిధులు , మున్సిపల్ కమిషనర్ రెడ్డి, మున్సిపల్ ప్లోర్ లీడర్ సిఎచ్, దుర్గాప్రసాద్. స్ధానిక నాయకులు పి,నాగరాజు శానిటరీ ఇన్స్పేక్టర్లు, పారిశుధ్యకార్మికులు, పలువురు అధికారులు, సిబ్బంది, ప్రజలు పాల్గొన్నారు.