విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఢిల్లీ వేదికగా జరిగిన ఖోఖో పురుషుల, మహిళల ప్రపంచకప్లో భారత జట్లు విజేతగా నిలవడం గర్వించదగ్గ విషయమని, ప్రపంచ వ్యాప్తంగా మహిళల విభాగంలో 23 దేశాల జట్లు, పురుషుల విభాగంలో 19 దేశాల జట్లు తలపడగా భారత జట్లు ప్రదర్శించిన ప్రతిభ అద్భుతమని ఏపీ స్పోర్ట్స్ అథారిటీ ఛైర్మన్ అనిమిని రవినాయుడు పేర్కొన్నారు. ఈ సందర్భంగా భారత జట్లకు శాప్ తరపున అభినందనలు తెలియజేశారు. ముఖ్యంగా భారత పురుషుల జట్టులో ఏపీ నుంచి ప్రాతినిధ్యం వహించిన ప్రకాశం జిల్లా క్రీడాకారుడు పి.శివారెడ్డికి ఆయన ప్రత్యేక అభినందనలు తెలియజేశారు. విశ్వవ్యాప్తంగా భారతదేశ కీర్తిప్రతిష్టతలను ఇనుమడింపజేశారని, భవిష్యత్తులో మరిన్ని అద్భుత ప్రదర్శనలివ్వాలని ఆయన కోరారు.
Tags vijayawada
Check Also
ఉద్యోగుల అంకితభావంతోనే సంస్థ ఎదుగుదల
-కేడిఎల్ఓ కోఆపరేటివ్ సొసైటీ ఉద్యోగుల యూనియన్ రజితోత్సవ సభలలో అతిథులు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఉద్యోగులు కార్మికులు …