-కేడిఎల్ఓ కోఆపరేటివ్ సొసైటీ ఉద్యోగుల యూనియన్ రజితోత్సవ సభలలో అతిథులు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఉద్యోగులు కార్మికులు నిరంతరం అంకితభావంతో పనిచేయడం వల్లనే కృష్ణ డిస్ట్రిక్ట్ లారీ ఓనర్స్ మ్యూచువల్లీ ఎయిడెడ్ కోపరేటివ్ సొసైటీ ఎదిగిందని సొసైటీ పాలకవర్గ సభ్యులు కొనియాడారు. క్రమశిక్షణతో వినియోగదారులకు మరింత సేవలు అందించాలని కోరారు.స్థానిక గవర్నర్ పేట బాలోత్సవ భవన్ లో ఆదివారం ది కృష్ణ డిస్ట్రిక్ట్ లారీ ఓనర్స్ మ్యూచువల్లీ ఎయిడెడ్ కోఆపరేటివ్ సొసైటీ ఎంప్లాయిస్ యూనియన్ రజతోత్సవ సభలు జరిగాయి.యూనియన్ అధ్యక్షులు ఏ శ్రీనివాస్ సభకు అధ్యక్షత వహించారు.ఈ సభలో పాల్గొన్న అతిథులు మాట్లాడుతూ కరోనా సమయంలో సైతం కార్మికులు సేవలందించారని చెప్పారు. పోటీ వాతావరణంలో సైతం వినియోగదారుల మన్నన పొందడం తమ సంస్థపై ఉన్న నమ్మకానికి నిదర్శనం అన్నారు. గత 58 సంవత్సరాలు గా పాలకవర్గాలు ఎన్ని మారినా తమ సంస్థ పురోగతిలో ఉందని పేర్కొన్నారు,.దీనికి పాలకవర్గాల నిర్ణయాలు , ఉద్యోగుల సమస్యల పరిష్కారంలో చూపిన సాంప్రదాయాలు కారణమని తెలిపారు. తమ రంగానికి,సంస్థకు నష్టం కలిగే చర్యలు ప్రభుత్వాలు తీసుకున్నప్పుడు రాజకీయాలకతీతంగా పాలకవర్గం కార్మిక సంఘాలతో కలిపి పోరాడిన సందర్భాలు గుర్తు చేసుకున్నారు. రాబోయే కాలంలో మారిన పరిస్థితులకు అనుగుణంగా సేవలందిస్తూ విధులు నిర్వహించాలని చెప్పారు కార్మిక సంక్షేమానికి ముందు చూపుతో వ్యవహరిస్తామని హామీ ఇచ్చారు. ఈ సభలో లారీ ఓనర్స్ సంఘం,సొసైటీ ల ప్రతినిధులు వై వి ఈశ్వరరావు, కే వెంకట రమేష్, నాగుమోతు రాజా, కె జగదీశ్వర్ రావు, సిఐటియు నాయకులు దోనేపూడి కాశీనాథ్, డివి కృష్ణ ,ఎం వి సుధాకర్,డి విష్ణువర్ధన్,ఎంప్లాయిస్ యూనియన్ నాయకులు జి గంగాధర్ రావు , ఎస్ కె కరీం, పాపారావు,రవిచంద్ర, రామ్మోహనరావు పాల్గొన్నారు. సభకు ముందు మ్యూజియం రోడ్డులోని సొసైటీ కార్యాలయం వద్ద సిఐటియు పతాకావిష్కరణ జరిగింది .అనంతరం జరిగిన సభలో ప్రజానాట్యమండలి కళాకారులు ఆటపాటతో అలరించారు. సొసైటీ ప్రస్తుత గతంలోని పాలకవర్గ సభ్యులకు, యూనియన్ లో సేవలందించిన పూర్వ ఉద్యోగులకు సన్మానం చేశారు. అనంతరం ఏ శ్రీనివాసరావు అధ్యక్షుడిగా జి గంగాధర్ రావు కార్యదర్శిగా ఉన్న 14 మందితో రానున్న కాలానికి నూతన కమిటీని ఎన్నుకోవడంతో సభ ముగిసింది.