-పెనుగంచిప్రోలు ఇబ్రహీంపట్నం బ్లాక్ లను టాప్ టెన్ లో నిలపండి….
-హెల్త్ ,ఎడ్యుకేషన్, న్యూట్రిషన్ పై దృష్టి సారించండి…..
-కలెక్టర్ డా. జి.లక్ష్మీశ
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఆకాంక్షిత బ్లాక్ కార్యక్రమం (ఏబీపీ) కింద కేంద్ర ప్రభుత్వం ఎంపిక చేసిన జిల్లాలోని ఇబ్రహీంపట్నం, పెనుగంచిప్రోలు మండలాల్లో అభివృద్ధి ప్రణాళికల అమలుపై ప్రత్యేక దృష్టి సారించాలని జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ అధికారులను ఆదేశించారు.
ఆకాంక్షిత జిల్లాలు, బ్లాక్‌లలో పురోగతిపై జిల్లా కలెక్టర్ లక్ష్మీ శ సోమవారం అధికారులతో కలెక్టరేట్ ఛాంబర్ లో సమావేశమయ్యారు. ఇబ్రహీంపట్నం, పెనుగంచిప్రోలు బ్లాకులకు సంబంధించి ఐదు విభాగాల్లో 40 సూచికలకు సంబంధించి పురోగతిని మదించడం జరిగిందన్నారు. సూచికల్లో ప్రగతికి అధికారులు సమన్వయంతో కృషిచేయాలని ఈ సందర్భంగా కలెక్టర్ లక్ష్మీశ సూచించారు. దేశంలోనే రెండు బ్లాకులను టాప్ టెన్ లో నిలపాలన్నారు. ప్రస్తుతం పెనుగంచిప్రోలు 80 ర్యాంకు, ఇబ్రహీంపట్నం 100 ర్యాంక్ లో ఉండడం పట్ల కలెక్టర్ అభినందించారు. ఇదే స్ఫూర్తిని కొనసాగిస్తూ దేశంలోనే రెండు బ్లాకులను టాప్ టెన్ లో నిరుపేలా కృషి చేయాలని అధికారులు ఆదేశించారు.
ముఖ్యంగా హెల్త్,ఎడ్యుకేషన్, న్యూట్రిషన్ పై దృష్టి పెట్టినట్లయితే టాప్ టెన్ కు చేరుకునేందుకు ఎక్కువ అవకాశం ఉంటుందని కలెక్టర్ సూచించారు.
సమావేశంలో ఇబ్రహీంపట్నం ఎంపీడీవో సునీత శర్మ పెనుగంచిప్రోలు ఎంపీడీవో శ్రీను, ఇబ్రహీంపట్నం బ్లాక్ కోఆర్డినేటర్ పి.శ్రీనివాస్, పెనుగంచిప్రోలు బ్లాక్ కోఆర్డినేటర్ బ్లాక్ కోఆర్డినేటర్ మోహన్ సందీప్ ఉన్నారు.