Breaking News

అధికారులు రైతులు సమన్వయంతో ముందుకెళ్లినట్లయితే రైతులకు ఇబ్బంది లేకుండా నీటి లభ్యత చేకూరుతుంది…

-శాసనసభ్యులు దూలం నాగేశ్వరరావు

కలిదిండి, నేటి పత్రిక ప్రజావార్త :
సాగునీటి సక్రమ నిర్వహణ కోసం అధికారులు రైతులు సమన్వయంతో ముందుకెళ్లినట్లయితే రైతులకు ఇబ్బంది లేకుండా నీటి లభ్యత చేకూరుతుందని శాసనసభ్యులు దూలం నాగేశ్వరరావు అన్నారు. ఆదివారం కలిదిండి మండలం కోరుకొల్లు గ్రామంలో పంట కాల్వ లాకుల వద్ద మండల పార్టీ అధ్యక్షులు నీలపాల వెంకటేశ్వరరావు, ఎంపీపీ అభ్యర్థి చందన ఉమామహేశ్వరరావు ఆధ్వర్యంలో డ్రైనేజీ, ఇరిగేషన్, మరియు రైతులతో ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. సమావేశంలో శాసనసభ్యులు డిఎన్ఆర్ మాట్లాడుతూ నియోజకవర్గంలో వున్న డ్రైన్లు, పంట కాల్వలు పనుల విషయం లో రైతులు, అధికారులు కలసికట్టుగా ముందుకివెళ్లాలని, అప్పుడే నూటికి నూరు శాతం, రైతులకు ఇబ్బందులు లేకుండా, ఎగువ నుంచి వచ్చే నీరు చివారు ప్రాంతాలకి కూడా అందుతుందన్నారు. ప్రతి సంవత్సరం మాదిరిగానే గౌరవ ముఖ్యమంత్రి వై ఎస్ జగన్మోహనరెడ్డి ఆశీస్సులుతో మన నియోజకవర్గంలో వున్న డ్రైన్లు, పంటకాల్వలలో, తూడు, గుర్రపుడెక్క, కిక్కిస తొలిగింపునకు, ప్రభుత్వం రూ.4 కోట్ల రూపాయలు నిధులు కేటాయించారన్నారు. ఎక్కడికి అక్కడ మీ మీ ఆయకట్టు ప్రాంతాలలో కాంట్రాక్టర్ లతో రైతులు దగ్గర ఉండి పనులు చేయించుకోవాలన్నారు. గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగనన్న పెద్దమనసుతో రైతుల కోసం క్రాప్ ఇన్సూరెన్స్ ప్రభుత్వం ద్వారా చెల్లించారని అన్నారు. ఒక్క కైకలూరు నియోజకవర్గ రైతులకు రూ.19 కోట్ల రూపాయలు నేరుగా వారి బ్యాంక్ అకౌంట్ లలో జమ చేశారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు అమలు చేస్తూనే రైతుల కోసం రైతుల సంక్షేమం కోసం అనేక మార్పులు తీసుకువచ్చి, రైతుకు మేలు చేస్తున్నారు. దివంగత నేత డాక్టర్ వైఎస్. రాజశేఖరరెడ్డి చల్లని దీవెనలతో రాష్ట్రంలో ప్రతి రైతుకు అండగా ఉండే విధంగా ప్రతి గ్రామ సచివాలయం కి అనుసంధానం గా రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నారు. రాష్ట్రంలో ఎక్కడా కూడా నకిలీ విత్తనాలు, నకిలీ ఎరువులు ఉండకూడదని ప్రత్యేక పర్యవేక్షణ ఏర్పాటు చేశారు. ప్రతి నియోజకవర్గానికి ఒక్క ల్యాబ్ ప్రవేశపెట్టారన్నారు. ముఖ్యంగా మన నియోజకవర్గం ఆక్వా రంగం పైన ఆధారపడి వుందని ఇటీవల వైఎస్సార్ జయంతి రోజున కైకలూరు పట్టణంలో రూ.18.6 లక్షలు రూపాయలుతో ఆక్వా ల్యాబ్ ను అభివృద్ధి చేసుకుని ప్రారంభించుకున్నామన్నారు.అలాగే వ్యవసాయ ఇంటిగ్రేటెడ్ ల్యాబ్ నిర్మాణ దశలో ఉందన్నారు. నియోజకవర్గంలోని 110 గ్రామ పంచాయతీలలో సర్పంచ్ లు, ప్రజా ఆరోగ్యం పైన ప్రత్యేక ద్రుష్టి పెట్టాలని, మీ మీ గ్రామాలలో ఎప్పటికి అప్పుడు, డ్రైనేజి నీరు బయటకు వెళ్ళేవిధంగా కచ్చ డ్రైన్లు త్రవ్వించి సున్నం, బ్లీచింగ్ చల్లించాలని అన్నారు. గ్రామాలలో మంచినీటి ఇబ్బందులు ఉండకూడదన్నారు. ఉపాధి హామీ పధకం ద్వారా 2 సంవత్సరాలు పైబడిన 6 అడుగుల మొక్కలు గ్రామాలకు ఇస్తారని నియోజకవర్గంలో ప్రతి గ్రామంలో మొక్కలు పెద్ద ఎత్తున నాటి సంరక్షణ పూర్తి బాధ్యత కూడా గ్రామ సర్పంచ్ లు తీసుకోవాలని అన్నారు. కోవిడ్ 19 మహమ్మారి వలన మనం చాలా మంది ఆత్మీయులను కోల్పోయా మన్నారు. మనమందరం కూడా చాలా అప్రమత్తంగా ఉండాలని, ప్రతి ఒక్కరు కూడా మాస్క్ ధరించి, శానిటేజర్ రాసుకోవాలని, సామాజిక దూరం పాటించాలని కోరారు. గౌరవ ముఖ్యమంత్రి జగనన్న కరోనా ఇబ్బందులతో రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు బాగోకపోయినా, ఎక్కడ కూడా ప్రజా సంక్షేమ పధకాలు ఆగకూడదన్న లక్ష్యంతో ఇచ్చిన మాట ప్రకారం చెప్పిన తేదీన సంక్షేమ పధకాలు అక్కచెల్లమ్మల అకౌంట్ లలో నేరుగా వేస్తున్నారన్నారు. రాష్ట్రంలో ముసలి అవ్వా తాతల దగ్గర నుంచి, అక్కచెల్లమ్మలు, అన్నదమ్ములు, పసి పిల్లలు వరకు ప్రతి ఒక్కరు కూడా జగనన్న కావాలని కోరుకుంటున్నారన్నారు. మీ అందరి ఆశీస్సులు జగనన్నకు ఎప్పుడు ఉండాలన్నారు. కార్యక్రమంలో ఇరిగేషన్ డీఈఈ గణపతి, ఏఈఈలు సూర్యతేజ, ధర్మాజ్యోతి, డ్రైనేజీ డీఈఈ శిరీష, ఏఈఈలు ఇందిరా, కుమార్, నాయకులు,చిట్టూరి వెంకటేశ్వరరావు, చెన్నంశెట్టి కోడందరామాయ్య,వడుపు రామారావు, వైస్ సర్పంచ్ చెన్నంశెట్టి నాగరాజు, మోకా రామకృష్ణ, నున్న రామచంద్రరావు, చిట్టూరి బుజ్జి, నున్న కృష్ణబాబు, బత్తిన ఉమామహేశ్వరరావు,సాన వెంకటరామారావు, తట్టిగోళ్ల నాంచారయ్య, నరహరశెట్టి నరసయ్య, పోతురాజు లక్ష్మణరావు, మహాదేవ విజయబాబు, నామాని అన్నవరం, దాసి ఏసుబాబు, చెన్నంశెట్టి ఫణిప్రసాద్, పెటేటి భోగేశ్వరరావు, పెటేటి రామకృష్ణ, వలవల ప్రసాద్, నీలపాల సుబ్బయ్య, కట్టా లక్ష్మయ్య, సాగి కిట్టురాజు, కందుల వెంకటేశ్వరరావు, గొరిపర్తి వెంకటరెడ్డి, షేక్ చాన్ బాషా, చలమలశెట్టి లక్ష్మయ్య, చెన్నంశెట్టి సోమేశ్వరరావు, వెంకటరాజు, బోయిన సత్యనారాయణ,కృష్ణ, ఫ్రాన్సిస్, దానయ్య, చెన్నంశెట్టి మతారావు, మరగాని అర్జునరావు, కోకా ఎకో నారాయణ తదితరులు పాల్గొన్నారు.

Check Also

యువతకు వినూత్న మరియు భవిష్యత్తు నైపుణ్యాలపై సీడ్ యాప్ సంస్థ లో వర్క్‌షాప్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : పరిశ్రమతో రాష్ట్ర యువతను మమేకం చేసే లక్ష్యంతో వారికి శిక్షణ అందించి మెరుగైన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *