Breaking News

కాబోయే అమ్మలు.. ర్యాంప్ పై తళుక్కుమన్నారు

– వినూత్నంగా అను మై బేబీ 3వ వార్షికోత్సవం
– ర్యాంప్ వాక్ తో అదరగొట్టిన గర్భిణీలు
– కార్యక్రమానికి ప్రత్యేక ఆకర్షణగా ప్రముఖ సినీ తార పూర్ణ
– అను మై బేబీలో అందుబాటులో హైరిస్క్ ప్రెగ్నెన్సీ, వాటర్ బర్త్, పెయిన్ లెస్ డెలివరీ సేవలు
– సేఫ్ హాండ్స్ ప్రోగ్రామ్ ద్వారా 80 కి.మీ. పరిధిలో ఎన్ఐసీయూ చికిత్సలు
– అను గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ డాక్టర్ జి.శ్రీదేవి

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
త్వరలో అమ్మలు కాబోతున్న మహిళలు.. ర్యాంప్ పై తళుక్కుమన్నారు. పండంటి బిడ్డకు జన్మనివ్వబోతున్న స్త్రీమూర్తుల ఆత్మవిశ్వాసం ర్యాంప్ వాక్ ను మరింత అందంగా మార్చింది. అను మై బేబీ 3వ వార్షికోత్సవ వేడుకలను ఆదివారం వినూత్నంగా నిర్వహించారు. ఎనికేపాడు అను మై బేబీ హాస్పిటల్ నందు జరిగిన ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరైన ప్రముఖ సినీ తార పూర్ణ.. కార్యక్రమానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. సంప్రదాయ, పాశ్చాత్య వస్త్రధారణతో కాబోయే అమ్మలు ర్యాంప్ వాక్ చేయడం స్ఫూర్తిదాయకంగా నిలిచింది. ఈ సందర్భంగా సినీ హీరోయిన్ పూర్ణ మాట్లాడుతూ.. అను మై బేబీ వార్షికోత్సవ సంబరాల్లో పాల్గొనడం ఆనందంగా ఉందని అన్నారు. కాబోయే అమ్మల ర్యాంప్ వాక్ లో భాగస్వామ్యం కావడం తనకు అద్భుతమైన అనుభూతినిచ్చిందని తెలిపారు. శక్తి స్వరూపిణి అయిన దుర్గమ్మ కొలువుదీరిన విజయవాడ నగరంలో నారీ శక్తికి నిజమైన నిదర్శనంగా ఈ కార్యక్రమం నిలిచిపోతుందని పూర్ణ వ్యాఖ్యానించారు. అనంతరం, అను గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ డాక్టర్ జి.శ్రీదేవి మాట్లాడుతూ.. అను మై బేబీ మూడేళ్ల ప్రస్థానంలో అనేక మైలురాళ్లను అధిగమించిందని అన్నారు. విశిష్టానుభవం కలిగిన వైద్య నిపుణులతో, ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అను మై బేబీలో వైద్య సేవలు అందిస్తున్నామని చెప్పారు. అనేక క్లిష్టమైన కేసుల్లో సైతం తమ వైద్యులు అత్యంత నైపుణ్యంతో చికిత్సనందించి చరిత్ర సృష్టించారని తెలియజేశారు. అను మై బేబీలోని ప్రపంచ స్థాయి సదుపాయాల ద్వారా హైరిస్క్ ప్రెగ్నెన్సీ, వాటర్ బర్త్, పెయిన్ లెస్ డెలివరీ సేవలను అందిస్తున్నామని వెల్లడించారు. సేఫ్ హాండ్స్ ప్రోగ్రామ్ ద్వారా 80 కి.మీ. పరిధిలో ఎమర్జెన్సీ నియోనేటల్ చికిత్సలను అందుబాటులోకి తెచ్చామని అన్నారు. ఈ ప్రోగ్రామ్ ద్వారా ఒకే ఒక్క ఫోన్ కాల్ ద్వారా నవజాత శిశువులకు అత్యాధునిక అత్యవసర చికిత్సలను అందిస్తామని తెలిపారు. ఇందు కోసం వెంటిలేటర్, తదితర వసతులతో అంబులెన్స్, ప్రత్యేక ఎన్ఐసీయూ విభాగం ఏర్పాటు చేసినట్లు వివరించారు. అను మై బేబీ వార్షికోత్సవ స్పూర్తితో, ప్రజలందరికీ నాణ్యమైన వైద్య సేవలందించాలనే తమ లక్ష్య సాధనలో పునరంకితమవుతామని డాక్టర్ శ్రీదేవి తెలిపారు. వార్షికోత్సవ వేడుకల్లో భాగంగా నిర్వహించిన ర్యాంప్ వాక్ లో పాల్గొన్న గర్భిణీలను అను గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్ చైర్మన్ డాక్టర్ జి.రమేష్ అభినందించారు. ఈ కార్యక్రమంలో అను మై బేబీ వైద్యులు డాక్టర్ కవిత, డాక్టర్ పావని, డాక్టర్ మంజు, హాస్పిటల్ సిబ్బంది పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

మూడోసారి విజయవంతంగా కిడ్నీ మార్పిడి

– శరత్స్ ఇనిస్టిట్యూట్ అరుదైన ఘనత – మొదటిసారి తల్లి, రెండోసారి భర్త.. ఇప్పుడు తండ్రి – మహిళకు మూడుసార్లు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *