విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఈనెల 9 10 11 వ తేదీల్లో విజయవాడ నగరంలో గుణదల మేరీమాత ఉత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతాయి. ఈ మూడు రోజుల్లో పెద్ద ఎత్తున భక్తులు ఈ ఉత్సవాల్లో పాల్గొంటారు. ఈ నేపథ్యంలో గుణదల మేరీ మాత టెంపుల్ మరియు పరిసర ప్రాంతాల్లో ఏర్పాటు చేస్తున్న బందోబస్తు ఏర్పాట్లను ఈరోజు నగర పోలీస్ కమిషనర్ ఎస్. వి. రాజశేఖర బాబు ఐ పి ఎస్ ఇతర పోలీస్ అధికారులతో కలిసి బందోబస్తు ఏర్పాట్లను పరిశీలించి, లా అండ్ ఆర్డర్ పరంగా , ట్రాఫిక్ పరంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అధికారులకు తగు సూచనలు సలహాలు అందించడం జరిగింది.
ఈ సందర్భంగా నగర్ పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ…… ఈనెల 9వ తేదీ నుంచి నగరంలో గుణదల మేరీమాత ఉత్సవాలు అత్యంత వైభవంగా ప్రారంభమవుతాయి. ఈ నేపథ్యంలో అన్ని శాఖలను సమన్వయం చేసుకుని పటిష్టమైన బందోబస్తు ఏర్పాట్లు ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈసారి ప్రత్యేకంగా మేరీ మాత టెంపుల్ మరియు పరిసర ప్రాంతాల్లో సీసీ కెమెరాలు డ్రోన్లతో ఆధునిక సాంకేతికను ఉపయోగించుకుని పకడ్బందీగా భద్రత ఏర్పాట్లు చేయడం జరుగుతుంది, పెద్ద ఎత్తున భక్తులు రానున్న నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేయడం జరుగుతుంది, చిన్నపిల్లల భద్రతపై, నగరంలో ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నట్లు, పోలీస్ అవుట్ పోస్ట్ ఏర్పాటు చేయడం జరుగుతుందని తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో నగర పోలీస్ కమిషనర్ తో పాటు డిసిపి గౌతమి షాలి ఐపీఎస్, ట్రాఫిక్ ఏ డి సి పి ఎ. వి. ఎల్ ప్రసన్నకుమార్, సౌత్ ఏసిపి డి పవన్ కుమార్, ట్రైనీ డీఎస్పీ పావని, ఇన్స్పెక్టర్లు, ఎస్. ఐ. లు మరియు సిబ్బంది పాల్గొన్నారు.