-చిన్నచిన్న వివాదాలకు తావివ్వకుండా భార్యాభర్తలు సద్ది చెప్పుకొని ముందుకు సాగాలి
-క్షణికావేశాలకు లోనై జీవితాలను పాడు చేసుకోకూడదు
-తద్వారా చిన్న పిల్లల భవిష్యత్తు పాడవుతుందని సూచన
-మంగళగిరి గ్రామీణ ఎస్సై చిరుమామిళ్ల వెంకట్
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
కుటుంబ కలహాల నేపథ్యంలో ఇల్లు వదిలి వెళ్లిపోయిన వివాహితను, చిన్న పిల్లలను వారి కుటుంబ సభ్యుల చెంతకు ఆదివారం మంగళగిరి గ్రామీణ ఎస్సై చిరుమామిళ్ల వెంకట్ చేర్చారు. మంగళగిరి మండలం కాజా గ్రామ వెంక రెడ్డి పాలెం కు చెందిన వేముల శ్రీకాంత్, అతని భార్య అయినా వేముల భార్గవి కుటుంబ కలహాల నేపథ్యంలో గత నెల 25వ తారీకు రాత్రి ఎవరికి చెప్పకుండా ఆమె ముగ్గురు పిల్లలతో సహా ఇంటిలో నుంచి వెళ్లిపోవడం జరిగింది. ఆమె భర్త వేముల శ్రీకాంత్ మంగళగిరి గ్రామీణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. మంగళగిరి గ్రామీణ ఎస్ఐ చిరుమామిళ్ల వెంకట్ కేసు నమోదు చేసి ఆమె సెల్ఫోన్ సిగ్నల్ ట్రాకింగ్ ద్వారా ఆమె ఆచూకీ కనుగొని మంగళగిరి గ్రామీణ పోలీస్ స్టేషన్లో ఆమె భర్త కుటుంబ సభ్యులకు గ్రామీణ ఎస్ఐ సిహెచ్ వెంకట్ అప్పచెప్పారు. ఈ సందర్భంగా వారి కుటుంబ సభ్యులకు ఫ్యామిలీ కౌన్సిలింగ్ ఇచ్చి చిన్న చిన్న విషయాలకు, గొడవలకు ఇల్లు వదిలి వెళ్లి జీవితాలను పాడు చేసుకోవద్దని వారికి కౌన్సిలింగ్ ఇచ్చారు. ఇల్లు వదిలి వెళ్ళటం వలన ఎన్నో అనర్ధాలు ప్రమాదాలు జరుగుతాయని ఆయన వారికి సూచించారు. అలాగే క్షణికావేశంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకోకుండా భార్యాభర్తలు కలిసి ఉండాలని, చిన్న చిన్న విషయాలకు గొడవలు పడటం వల్ల చిన్న పిల్లలు జీవితాలు పాడవుతాయని భార్యాభర్తలు ఒకరికొకరు సర్ది చెప్పుకోవాలని వారికి ఎస్ఐ వెంకట్ సూచించారు.