Breaking News

ప్రజలకి ఎటువంటి అసౌకర్యం కలగకుండా చూసుకోవాలి

-విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర ఆదేశాలు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రజలకి ఎటువంటి అసౌకర్యం కలగకుండా చూసుకోవాలని అధికారులను విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర ఆదేశించారు. సోమవారం ఉదయం తన పర్యటనలో భాగంగా బెంజ్ సర్కిల్, రామలింగేశ్వర నగర్, నేతాజీ బ్రిడ్జ్, ప్రాంతాలన్ని పర్యటించే క్షేత్రస్థాయిలో పరిశీలించారు.

ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ అధికారులందరూ ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉంటూ వర్షాలు పడిన రోడ్ల పైన వర్షపు నీరు చేరకుండా ఉండేటట్టు చర్యలు తీసుకోవాలని, నగరంలో ఎక్కాడాను అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పొంగకుండా ఎప్పటికప్పుడు ఫీల్డ్ విజిట్స్ చేస్తూ పరిశీలిస్తూ, సమస్యలను పరిష్కరించాలని, త్రాగునీటి లీకేజీలను అరికట్టాలని, కల్వెర్ట్లను రిపేరు చేసుకోవాలని అధికారులను ఆదేశించారు. ప్రజా ఆరోగ్య సిబ్బంది ఎప్పటికప్పుడు చెత్త సేకరణ సమయానికి చేసుకుంటూ, పరిస్థితి నిర్మాణంలో ఎటువంటి లోపం లేకుండా చూసుకోవాలని అన్నారు.

రామలింగేశ్వర్ నగర్ లోని ఓవర్ హెడ్ వాటర్ ట్యాంక్ పరిశీలించి ఆ ట్యాంక్ నుండి మంచినీరు త్వరగా ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని, అందుకు అనుగుణంగా రిపేర్లు సత్వరమే నిర్వహించాలని అన్నారు. రామలింగేశ్వర నగర్ లోని ఎస్ టి పి పరిశీలించి అమృత్ పథకం 2.0 ద్వారా జరుగుతున్న పనులను సత్వరమే పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.

తదుపరి నీతాజీ బ్రిడ్జ్ వద్ద గల అన్న క్యాంటీన్ పరిశీలించి, అన్న క్యాంటీన్ నిర్వహణ సక్రమంగా జరగాలని, పరిశుభ్రమైన వాతావరణం, నెలకొల్పాలని, వాడుకనీరు మరుగుదొడ్లు ఎప్పటికప్పుడు నిర్వహణ చేసుకుంటూ అధికారులు పర్యవేక్షిస్తుండాలని కమిషనర్ ఆదేశించారు.

ఈ పర్యటనలో చీఫ్ ఇంజనీర్ ఆర్ శ్రీనాథ్ రెడ్డి, చీఫ్ సిటీ ప్లానెర్ జి వి జి ఎస్ వి ప్రసాద్, ఇంచార్జ్ చీఫ్ మెడికల్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ సురేష్ బాబు, సూపర్డెంట్ ఇంజనీర్లు పి.సత్యనారాయణ, పి సత్యకుమారి, అసిస్టెంట్ సిటీ ప్లానర్ మోహన్ బాబు, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు వెంకటేశ్వర్ రెడ్డి, సామ్రాజ్యం తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

మైనారిటీ యువతకు విద్య, ఉద్యోగాల్లో స్వర్ణావకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం

-వడ్డేశ్వరంలో సెంటర్ ఫర్ ఎడ్యుకేషనల్ డెవలప్‌మెంట్ ఆఫ్ మైనారిటీస్ (CEDM) నూతన కార్యాలయాన్ని ప్రారంభించిన మంత్రి ఎన్.ఎమ్.డి. ఫరూక్ అమరావతి, …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *