విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
బీసీల హక్కులు, రాజకీయ ప్రాతినిధ్యం, కులగణన అమలు సాధించే దిశగా బీసీలను సమాయుత్తం చేయడానికి ఆంధ్రప్రదేశ్ బీసీ సమన్వయ కమిటీ ఈ నెల ౬,౭ తేదీల్లో విజయవాడలోని పున్నమిఘాట్ నందు రాష్ట్ర ప్రతినిధుల సమావేశం మరియు శిక్షణ కార్యక్రమం నిర్వహించనుంది. రాష్ట్ర జిల్లా చైర్మన్లు, కన్వీనర్లు, మరియు బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర ప్రతినిధులు పాల్గొననున్నారు అని పార్టీ రాష్ట్ర కోఆర్డినేటర్ డా జుజ్జవరపు పూర్ణచంద్ర రావు తెలిపారు. రానున్ నరోజుల్లో ప్రజాపోరాటాలు మరింత తీవ్రతరంచేసే దిశగా, కులగణనపై చేయబోయే పోరాటాలపై కార్యాచరణ తీర్మానాలు, బీసీల సమస్యలపై శిక్షణ, అవగాహనా కార్యక్రమాలు నిర్వహించబోతున్నారని డా రావు తెలిపారు. ఈ కార్యక్రమంలో డా పూర్ణచంద్ర రావు, బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షులు బీ పరంజ్యోతి, కమిటీ చైర్మన్ అంగడాల పూర్ణచంద్ర రావు, కన్వీనర్ బీసీ రమణ, తదితరులు పాల్గొంటారు.
Tags vijayawada
Check Also
నేడు(ఈనెల 16) ఢిల్లీకి మంత్రి సవిత
-భారత్ టెక్స్-2025 లో పాల్గొన్ననున్నమంత్రి -రాష్ట్రంలో పెట్టుబడులకు పలు పారిశ్రామికవేత్తలతో భేటీ -చేనేత వస్త్రాల మార్కెటింగ్ విస్తరణకు చర్చలు అమరావతి, …