Breaking News

విజయకృష్ణ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నూతన ప్రారంభం

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
విజయవాడ పైపులు రోడ్డు రవీంద్ర ధియేటర్ ఎదురుగా విజయకృష్ణ మల్టీ హాస్పిటల్ నూతనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమం ముఖ్యఅతిథిగా విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమా మహేశ్వర రావు పాల్గొని హాస్పిటల్ ప్రారంభించారు.

ఈ సందర్భంగా ప్రముఖ జనరల్ ఫిజిషియన్ డాక్టర్ చనికుల శ్రీనివాసరావు మీడియాతో మాట్లాడుతూ యశోద హాస్పిటల్ లో అత్యవసర విభాగం సేవలు అందించాలని తెలిపారు అనుభవంతోనే విజయ్ కృష్ణ మల్టీస్పెషల్టే హాస్పిటల్ ని విజయవాడ నగర ప్రాంత ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చేనని తెలిపారు. హాస్పిటలు ప్రారంభం సందర్భంగా ఒక వారం రోజులు పాటు ఫ్రీ కన్సల్టెన్సీ తో పాటు మందులు కూడా 50% ఇస్తున్నామని తెలిపారు. ఆ తర్వాత రోజు నుండి 200 రూపాయలు నార్మల్ ఫీజుతో మందుల్లో 20 శాతం తీసుకొని అన్ని రకాల వైద్య సదుపాయాలు అందిస్తున్నామని తెలిపారు. గైనకాలజీ కార్థోపెటిక్ కార్డియాలజీ జనరల్ ఫిజీషియన్ తదితర అన్ని రకాల సేవలు విజయ్ కృష్ణ మల్టీస్పెషల్టి హాస్పిటల్లో లభిస్తాయని తెలిపారు. 24 గంటలు ఆస్పత్రి లో అన్ని రకాల అత్యవసర సేవలు ప్రజలకు అందుబాటులో ఉంటాయని తెలిపారు. ఆధునిక పరికరాలతో ఎలాంటి ఆపరేషన్ అయినా సరే కంప్లీట్ అయ్యి మూడు రోజుల్లో పేషెంట్ నడిచే విధంగా తగిన జాగ్రత్తలు తీసుకొని సేవలు అందిస్తున్నామని తెలిపారు.

హాస్పటల్ సందర్శించిన ప్రతి పేషెంట్ కూడా హెల్త్ డిస్కౌంట్ కార్డు ఇస్తున్నామని ఆ కార్డు ద్వారా ఎప్పుడు ఆస్పత్రికి విజిట్ అయినా సరే 20% ఆసుపత్రి అన్ని రకాల ల్యాబ్ టెక్నీషియన్ సేవలలో డిస్కౌంట్ ఉంటుందని తెలిపారు.
ఈ కార్యక్రమానికి డాక్టర్ శ్రీనివాసరావు వాళ్ళ మామయ్య రాము పాల్గొని డాక్టర్ శ్రీనివాస్ కి అభినందనలు తెలుపుతూ విజయవాడ పరిసర ప్రాంత ప్రజలందరూ కూడా హాస్పిటల్ సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

తిరుపతి జిల్లాలో పదవ తరగతి పరీక్షలు నిర్వహణకు సర్వం సిద్ధం

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : తిరుపతి జిల్లాలో పదవ తరగతి పరీక్షల నిర్వహణకు ఏర్పాట్లు చాలా పకడ్బందీగా చేపట్టడం …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *