-అందరూ విద్యార్థినీ విద్యార్థులు పరీక్షల్లో మంచి ఫలితాలు సాధించాలని కోరుకుంటున్నా….
-సకాలంలో పరీక్షా కేంద్రాలకు చేరుకొని.. ఒత్తిడికి లోను కాకుండా ప్రశాంతంగా పరీక్షలు రాయండి …. ఆల్ ది బెస్ట్: జిల్లా కలెక్టర్ డా. వెంకటేశ్వర్ ఎస్
తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
జిల్లా వ్యాప్తంగా పది పరీక్షలకు హాజరవుతున్న విద్యార్థినీ విద్యార్థులు పరీక్షా సమయం 9:30 గంటలకు అర్ధగంట ముందుగానే పరీక్షా కేంద్రానికి చేరుకోవాలని హడావిడి లేకుండా ఒత్తిడి కి లోను కాకుండా పరీక్షలు రాయాలని, జిల్లా లో ప్రశాంత వాతావరణంలో పది పరీక్షల నిర్వహణకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయడం జరిగిందని దూర ప్రాంత విద్యార్థులు వారి హాల్ టికెట్ ను బస్సు లో చూపించి ఉచితం గా ప్రయాణించి సకాలంలో పరీక్షా కేంద్రాలకు చేరుకోగలరని తెలుపుతూ పదవ తరగతి పరీక్షలు రాయనున్న విద్యార్థిని విద్యార్థులు అందరికీ శుభా కాంక్షలు మరియు ఆల్ ది బెస్ట్ తెలిపిన జిల్లా కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్ ఎస్.