తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
తిరుపతి జిల్లాలో పదవ తరగతి పరీక్షల నిర్వహణకు ఏర్పాట్లు చాలా పకడ్బందీగా చేపట్టడం జరిగిందని జిల్లా విద్యా శాఖ అధికారి కెవిఎన్. కుమార్ పేర్కొన్నారు. ఈనెల మార్చి 17 నుండి ఏప్రిల్ ఒకటి వరకు ఎస్ఎస్ సి మరియు ఓపెన్ స్కూల్ పరీక్షల నిర్వహణ చేపట్టడం జరుగుతుందని, మొత్తం 28656 మంది విద్యార్థులు పరీక్షలు రాయబోతున్నారు, అందులో రెగ్యులర్ విద్యార్థులు 27,003 మంది, ప్రైవేట్ (వన్-ఫెయిల్డ్) విద్యార్థులు 634 మంది. వీరితో పాటు ఓపెన్ స్కూల్‌కు చెందిన 1,019 మంది విద్యార్థులు కూడా పరీక్షలకు హాజరవుతున్నారు. పరీక్ష ఉదయం 9:30 నుండి మధ్యాహ్నం 12:30 వరకు జరుగుతుందని ఓపెన్ స్కూల్ పరీక్షలు ఉదయం 9:30 నుండి మధ్యాహ్నం 12:45 వరకు నిర్వహించడం జరుగుతుందని పేర్కొన్నారు.
పరీక్షా కేంద్రాల విభజన
మొత్తం పరీక్షా కేంద్రాలు – 164
A క్యాటగిరి సెంటర్ – 89
B క్యాటగిరి సెంటర్ – 55
C క్యాటగిరి సెంటర్ – 20
పరీక్షా నిర్వహణ ఏర్పాట్లు
164 మంది చీఫ్ సూపరింటెండెంట్లు, 164 మంది డిపార్ట్‌మెంట్ ఆఫీసర్లు,
20 మంది సి సెంటర్ కస్టోడియన్స్, 1,574 మంది ఇన్విజిలేటర్లు నియమించారు.
10 ఫ్లయింగ్ స్క్వాడ్‌లు, 30 సెట్టింగ్ స్క్వాడ్‌లు ఏర్పాటు చేసి, రోజుకు 40 కేంద్రాల్లో పర్యవేక్షణ చేపట్టనున్నారు.
విద్యుత్ సమస్యలు రాకుండా విద్యుత్ శాఖతో సమన్వయం చేసుకున్నారు.
ప్రతి కేంద్రంలో తాగునీరు, ఫర్నిచర్, విద్యుత్ సౌకర్యం ఏర్పాటు చేశారు.
DMHO ఆదేశాల మేరకు ప్రతి సెంటర్లో ANM ఏర్పాటు చేశారు.
హెల్ప్ డెస్క్ నంబర్: 7569787131 (పరీక్షలకు సంబంధించిన ఏవైనా సమస్యల కోసం విద్యార్థులు/తల్లిదండ్రులు సంప్రదించవచ్చు).
కఠిన నిబంధనలు
ప్రతి పరీక్షా కేంద్రాన్ని “నో సెల్‌ఫోన్ జోన్” గా ప్రకటించారు – చీఫ్ సూపరింటెండెంట్ తప్ప ఎవరికీ సెల్‌ఫోన్ అనుమతి లేదు.
సబ్జెక్ట్ రోజున ఆ సబ్జెక్ట్ టీచర్లు పరీక్షా కేంద్రంలో డ్యూటీ చేయరు.
కాపీయింగ్ నివారించేందుకు కఠిన చర్యలు తీసుకోనున్నారు.
పరీక్షలు సజావుగా, నిష్పక్షపాతంగా, ఎలాంటి సమస్యలు లేకుండా నిర్వహిస్తామని జిల్లా విద్యాశాఖ అధికారి డాక్టర్ కె.వి.ఎన్. కుమార్ తెలిపారు. ప్రభుత్వం విద్యార్థుల హాల్ టికెట్‌ను బస్సు పాస్‌గా పరిగణించి ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తోంది. విద్యార్థులు ఒక గంట ముందుగా పరీక్షా కేంద్రానికి చేరుకోవడం మంచిది, అప్పుడు ఒత్తిడిలేకుండా ప్రశాంతంగా పరీక్ష రాయవచ్చు. అందరికీ ఆల్ ది బెస్ట్!