విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
రాణిగారి తోట సెంటర్ గుడ్ మార్నింగ్ హోటల్ ఎదురుగా మాదిగ వెల్ఫేర్ అసోసియేషన్ కమిటీ ఆధ్వర్యంలో భారతదేశ మాజీ ఉప ప్రధానమంత్రి బాబు జగజ్జీవన్ రామ్ నూతన విగ్రహ ఏర్పాటుకు తెలుగుదేశం పార్టీ యువ నాయకులు గద్దె క్రాంతి కుమార్ రూ 50 వేల రూపాయల ఆర్థిక సహాయం అందజేశారు. ఈ ఆర్థిక సహాయాన్ని అశోక్ నగర్ లోని తూర్పు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో శుక్రవారం మధ్యాహ్నం జగజ్జీవన్ రామ్ విగ్రహా ఏర్పాటు కమిటీ వారికి గద్దె క్రాంతి కుమార్ అందజేశారు.
ఈ సందర్భంగా గద్దె క్రాంతికుమార్ మాట్లాడుతూ బాబు జగజ్జివన్ రాం స్వాతంత్ర సమరయోధుడిగా, సంఘసంస్కర్తగా వెనకబడిన వర్గాల నుంచి వచ్చి దేశ ఉప ప్రధానిగా దేశ ప్రజలకు సేవలు అందించారని అన్నారు. భారత పార్లమెంట్లో 40 సంవత్సరాల పాటు వివిధ శాఖలకు మంత్రిగా వ్యవహరించి పేదలకు సేవ చేసిన మహనీయుడు బాబు జగజీవన్ రామ్ అన్నారు. అంటరాని తనంపై పోరాటం చేసి వారికి సమానత్వం కోసం బాబు జగజీవన్ రామ్ ఎనలేని కృషి చేశారన్నారు. అటువంటి మహనీయుడు విగ్రహ ఏర్పాటుకు తన వంతు సహాయం అందించడం తనకెంతో ఆనందంగా ఉందన్నారు.
ఈ కార్యక్రమంలో వేల్పుల సౌరి, చింతా బుచ్చిబాబు, పాతకోటి బాబురావు, వేల్పుల సురేష్, పాతకోటి దుర్గాప్రసాద్, రెడ్డపొంగు మధు తదితరులు ఉన్నారు.